
నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుతూ, వ్యవసాయ దిగుబడిని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రధాన్ మంత్రి కృషి సించాయీ యోజన PMKSY కింద పర్ డ్రాప్ మోర్ క్రాప్ PDMC పథకం 2015-16లో ప్రారంభించబడింది. తాజాగా 2025 నిర్దేశకాలు విడుదల చేస్తూ, మైక్రో ఇరిగేషన్ విస్తీర్ణాన్ని పెంచే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
2025 PDMC మార్గదర్శకాల్లో ముఖ్యమైన మార్పులు
- సూక్ష్మ నీటిపారుదల విస్తీర్ణం పెంపు – ఇప్పటివరకు 96.97 లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ అమలు.
- డ్రిప్ & స్ప్రింక్లర్ ఇరిగేషన్ – 46.37 లక్షల హెక్టార్లలో డ్రిప్, 50.60 లక్షల హెక్టార్లలో స్ప్రింక్లర్ ఇరిగేషన్.
- మినీ స్ప్రింక్లర్లు & అధునాతన నీటిపారుదల పద్ధతులకు ప్రోత్సాహం.
- 55% సబ్సిడీ – చిన్న & సన్నకారు రైతులకు, 45% సబ్సిడీ – ఇతర రైతులకు.
- 2022-23 నుండి "PM రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (PMRKVY)" కింద అమలు.
మైక్రో ఇరిగేషన్ నిధులు MIF
సూక్ష్మ నీటిపారుదల విస్తీర్ణాన్ని మరింతగా పెంచేందుకు 2017-18 కేంద్ర బడ్జెట్‌లో రూ. 5000 కోట్లు కేటాయిస్తూ మైక్రో ఇరిగేషన్ నిధులను NABARD ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అలానే 2021-22 కేంద్ర బడ్జెట్‌లో మరో రూ. 5000 కోట్లు నిధికి అదనంగా కేటాయించారు.
- రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ నిధిని వినియోగించి, అదనపు సబ్సిడీ అందించొచ్చు.
- MIF రుణాలను 7 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాలి (మొదటి 2 ఏళ్లు మన్నింపు కాలం).
- NABARD రుణాలపై 2% తక్కువ వడ్డీ రేటు అందిస్తుంది.
ప్రత్యక్ష లబ్ధిదారుల బదిలీ (DBT), జియోట్యాగింగ్ ద్వారా పర్యవేక్షణ.
MIF & PDMC అమలు విధానం
- MIF నిధులను రాష్ట్రాలు, రైతు సంఘాలు, నీటి వినియోగదారుల సంఘాలు అంటే WUA మాత్రమే పొందగలవు.
- NABARD ద్వారా ఈ రుణాలు అందించబడతాయి.
- PDMCలో రాష్ట్ర ప్రభుత్వాల వాటాను భర్తీ చేసేందుకు MIF వినియోగం అనుమతించబడదు.
- సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతుగా ఉండి, రైతుల కోసం మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులను అమలు చేయాలి.
2025 PDMC మార్గదర్శకాలు రైతులకు నీటి వినియోగంలో సమర్థతను పెంచుతూ, వ్యవసాయ ఆదాయాన్ని పెంచేందుకు భారీగా సహాయపడనున్నాయి. డ్రిప్ & స్ప్రింక్లర్ ఇరిగేషన్ విస్తీర్ణాన్ని పెంచేలా తీసుకున్న తాజా చర్యలు దేశవ్యాప్తంగా సాగు విధానాన్ని ఆధునికీకరిస్తాయి.
Share your comments