
వేసవి పంటల సాగు పై సమగ్ర గణాంకాలను సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వేసవి కాలంలో సాగు చేసే ప్రతి పంటను తప్పనిసరిగా ఈ-క్రాప్ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుందని (e-Crop registration process) వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. మార్చి నుండి ఏప్రిల్ మొదటి వారంలోపుగా విత్తకాలు వేసి, వేసవిలోనే కోతకు వచ్చే పంటలే ఈ లెక్కల్లో చేర్చబడతాయని వెల్లడించింది.
ఎందుకు ఈ-క్రాప్?
వేసవి పంటల వివరాలను డిజిటల్‌గా నమోదు చేయడం ద్వారా:
- రాష్ట్రవ్యాప్తంగా వేసవి సాగు విస్తీర్ణం,
- పంటల దిగుబడి అంచనాలు,
- భూమి వినియోగ సరళి మార్పులు,
- వరుస పంటల పద్ధతులపై ఖచ్చితమైన గణాంకాల్ని పొందవచ్చని వ్యవసాయశాఖ భావిస్తోంది.
ఈ గణాంకాలు పబ్లిక్ పాలసీ (AP agri digital policy) రూపకల్పనకు తోడ్పడటంతోపాటు, రాబోయే సబ్సిడీలు, పెట్టుబడి ప్రోత్సాహకాలు, భీమా ప్రయోజనాలకి బేస్‌గా ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.
అర్హత వివరాలు (AP e-Crop registration summer crops)
- రాష్ట్రంలో ఏ రైతైనా వేసవిలో పంట సాగు చేస్తే ఈ-క్రాప్ లో నమోదు తప్పనిసరి.
- రైతుల ఆధార్, భూ పత్రాలు, మొబైల్ నంబర్, సాగు వివరాలు వంటి సమాచారం అవసరం.
- ఈ ప్రక్రియ గ్రామ వ్యవసాయ సహాయకులు లేదా RBK సిబ్బంది ద్వారా జరగవచ్చు.
వేసవి పంటల లిస్ట్ మరియు వాటి ప్రయోజనాలు
వేసవి కాలంలో రైతులు సాధారణంగా సాగు చేసే పంటలు:
- మినుము, పెసర – మట్టిలో నత్రజని స్థాయిని పెంచి భూమి జీవనశైలిని మెరుగుపరుస్తాయి.
- జనుము, పిల్లి పెసర, కాకి జొన్న – పచ్చిరొట్ట ఎరువుగా వాడతారు, భూమిలో తేమను నిలిపి ఉంచుతాయి.
- నువ్వులు – తక్కువ నీటి అవసరం, మంచి ధర.
- నేపియర్ గడ్డి (Napier grass cultivation AP) – పశుగ్రాసంగా వాడతారు, నేలతేమను కాపాడుతుంది, పొలాల్లో కవరింగ్ క్రాప్‌గా పనిచేస్తుంది.
ఈ-క్రాప్ నూతన వెర్షన్ (2025 e-Crop guidelines)
వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు తెలిపిన ప్రకారం, ఈ-క్రాప్ అప్లికేషన్‌ను ఆధునికీకరించిన కొత్త వెర్షన్ ద్వారా వేసవి పంటల (summer pulses AP) నమోదు చేపట్టనున్నారు. రైతులకు మరింత సులువుగా ఉండేలా ఇంటర్‌ఫేస్‌ను రూపొందించారని తెలిపారు.
రైతులకు లాభాలు
- పంటలపై ఖచ్చితమైన డేటా ఉండటంతో భూమి ఆరోగ్యాన్ని నిర్ధారించవచ్చు.
- భవిష్యత్తులో ప్రభుత్వ ప్రోత్సాహకాల కోసం ఆధారంగా నిలుస్తుంది.
- సాగుపై ట్రాక్ ఉండటంతో భీమా, రుణాలు పొందడంలో సులువు.
- ఈ గణాంకాల ఆధారంగా ప్రభుత్వానికి పంటల వ్యాప్తి, సాగు మార్పులపై స్పష్టత లభిస్తుంది.
ఈ వేసవిలో పంటలు సాగు చేసే ప్రతి రైతు తన వివరాలను త్వరగా ఈ-క్రాప్‌లో నమోదు చేయాలని వ్యవసాయశాఖ సూచించింది. ఇది ఒక డిజిటల్ ఉద్యమంగా, భూమి ఆరోగ్యం, రైతుల భవిష్యత్తు ప్రయోజనాలకు దోహదపడే మార్గంగా అభివర్ణిస్తున్నారు.
Read More:
Share your comments