
భారతదేశ వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ (Indian Agriculture Digitization) చేయడంలో కీలక ముందడుగుగా కేంద్ర ప్రభుత్వం 2024 సెప్టెంబర్‌లో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ను ఆమోదించింది. మొత్తం రూ. 2,817 కోట్లు వ్యయంతో ప్రారంభించిన ఈ మిషన్, రైతులకు డిజిటల్ ఐడెంటిటీ (Farmer ID)ల సృష్టికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో "రైతులకు డిజిటల్ గుర్తింపు అంటే ఏమిటి? ఇది అవసరమేనా?" అనే ప్రశ్నలకు సమాధానమే ఈ ఆర్టికల్.
డిజిటల్ ఐడెంటిటీ (Farmer Digital ID)అంటే ఏమిటి?
డిజిటల్ ఐడెంటిటీ అనేది ప్రతి రైతుని ప్రత్యేకంగా గుర్తించే యూనిక్ ఐడీ నంబర్. ఈ ఐడీ ఆధారంగా ఆయా రైతుల పంటల వివరాలు, భూస్వామ్యం, ప్రభుత్వ పథకాల్లో లబ్ధి వివరాలు వంటి సమాచారాన్ని ఒకే చోట నిల్వ చేస్తారు. దీని ద్వారా సరైన సమాచారంతో సరైన రైతుకు సరైన సమయంలో మద్దతు అందించేందుకు వీలవుతుంది.
డిజిటల్ కృషి యోజన (Digital Krishi Yojana), అగ్రిస్టాక్ (AgriStack), డిజిటల్ ప్రణాళిక (Digital Infrastructure)
ఈ మిషన్ కింద AgriStack అనే డిజిటల్ వ్యవసాయ మౌలికసదుపాయ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. దీంట్లో:
- భూక్షేత్ర మాప్‌లు (Geo-Referenced Village Maps)
- పంటల నమోదు రిజిస్ట్రీ (Crop Sown Registry)
- రైతుల రిజిస్ట్రీ (Farmers Registry)
ఈ మూడు ప్రధాన డేటాబేస్‌లను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి.
రైతు డేటా బ్యాంక్ (Farmer Identification Number India Data Bank) డిజిటల్ ఫలితాలు
- 2026-27 నాటికి 11 కోట్ల రైతులకు డిజిటల్ ఐడీ జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- 2025 ఖరీఫ్ నుంచి అన్ని రాష్ట్రాల్లో డిజిటల్ క్రాప్ సర్వే చేపట్టనున్నారు.
- ఇప్పటి వరకు 4.85 కోట్ల రైతుల ఐడీలు జారీ అయ్యాయి.
- 2024 ఖరీఫ్‌లో 436 జిల్లాల్లో, 2024-25 రబీ సీజన్‌లో 461 జిల్లాల్లో, 23.90 కోట్ల ప్లాట్లపై సర్వే పూర్తయింది.

వ్యవసాయ రంగం డిజిటల్ మిషన్ (Digitalization of Indian Agriculture): రాష్ట్రాలకు సాంకేతిక, ఆర్థిక మద్దతు
- రైతు డిజిటల్ ఐడెంటిటీ (ఫార్మర్ ఐడీ), క్రాప్ సర్వే కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్
- రాష్ట్ర అధికారులకు శిక్షణ
- ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటుకు మానవ వనరులు
- క్లౌడ్ మౌలిక సదుపాయాల మద్దతు
- PM-KISAN పథకం నుండి ఒక్కో రైతు ఐడీకి ₹10 రూపాయిలు
- స్థానిక శిబిరాల నిర్వహణకు ఒక్కో క్యాంప్‌కు ₹15,000 ఆర్థిక సహాయం
Digital Agriculture Mission India 2025: ప్రభుత్వ లక్ష్యం
ఈ మిషన్ ద్వారా రైతు కోసం నిఖార్సైన డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం, సరైన సమయంలో అవసరమైన సమాచారాన్ని పంచడం, విత్తనాలు, ఎరువులు, పంట బీమా వంటి పథకాల అమలును వేగవంతం చేయడం ప్రభుత్వ లక్ష్యం. డిజిటల్ రైతు గుర్తింపు వ్యవసాయ రంగానికి నవతర శక్తిని అందించనుంది. రైతులు సాంకేతికంగా ముందుకెళ్లే మార్గాన్ని ఇది సమకూరుస్తోంది.
Read More:
Share your comments