
చపాటా మిర్చికి GI ట్యాగ్ ఎలా వచ్చింది?
చపాటా మిర్చిని స్థానికంగా "టమాట మిర్చి" అని కూడా పిలుస్తారు. ఇది తక్కువ ఘాటుతో, ప్రత్యేకమైన ఎరుపు రంగుతో ప్రసిద్ధి చెందింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట రైతు ఉత్పత్తిదారుల సంఘం, మహబూబాబాద్ జిల్లా జెన్నారెడ్డి వెంకటరెడ్డి హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్, తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ సహకారంతో 2022లో చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీకి వరంగల్ GI టాగ్ (Warangal GI tag crops) కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు మూడు సంవత్సరాల పరిశీలన తర్వాత, ఈ ఏడాది GI ట్యాగ్ మంజూరు చేశారు.
చపాటా మిర్చి ప్రత్యేకత ఏమిటి?
- టమాట ఎరుపు రంగు, తక్కువ ఘాటు కలిగి ఉంటుంది.
- ఒలియోరెసిన్ (మిరప నుంచి తీసే నూనె) 6.37% – 6.75% ఉండటంతో దీనిని ఆహార ఉత్పత్తులు, కాస్మోటిక్స్, మెడిసిన్స్, డ్రింక్స్ తయారీలో వినియోగిస్తున్నారు.
- మిర్చి నూనెకు చైనా, యూకే, యూఎస్, జర్మనీ, ఇతర యూరోపియన్ దేశాల్లో గిరాకీ ఉంది.
రైతులకు GI ట్యాగ్ వల్ల ప్రయోజనాలు
- ప్రస్తుతం మార్కెట్‌లో చపాటా మిర్చి ధర కిలో రూ.300 ఉండగా, GI ట్యాగ్ కారణంగా రూ.450 – రూ.500 వరకూ పెరిగే అవకాశం.
- తిమ్మంపేట రైతుల సంఘం ఇప్పుడు తమ సొంత బ్రాండ్, లోగోతో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు చేయవచ్చు.
- ప్రస్తుతం హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 20,000 మంది రైతులు, 6,738 ఎకరాల్లో చపాటా మిర్చిని సాగు చేస్తున్నారు.
భవిష్యత్‌లో డిమాండ్ & ఎగుమతులు
GI గుర్తింపు పొందడంతో, వరంగల్ తిమ్మంపేట రైతులు దేశవ్యాప్తంగా తమ మిర్చిని పెద్ద మార్కెట్లకు నేరుగా ఎగుమతి చేసే అవకాశం ఉంది. భారత దేశంలో GI టాగ్ ఉన్న పదార్థాలు (GI tag products in India) తక్కువ, అందుకే తెలంగాణలో రైతుల స్వయం సమృద్ధి లక్ష్యానికి ఇది కీలక మైలురాయి కానుంది. రైతులకు దీని ద్వారా అధిక లాభాలు, అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత పెరగనున్నాయి.
మరింత వ్యవసాయ సమాచారం కోసం (Telangana agriculture news)
Read:
Share your comments