Kheti Badi

అధిక దిగుబడితో పాటు తెగుళ్లను తట్టుకునే ఆర్కా రక్షక్ టమాటో సాగు .....

KJ Staff
KJ Staff

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా చేపట్టే కూరగాయల సాగులో టమాటో ఒకటి. మన ఆహారంలో టమాటో ఎప్పటినుండో ఒక భాగమైపోయింది. కూరలు మరియు పచ్చళ్ళ తయారీకే కాకుండా, సాస్ తయారీలో కూడా టొమాటను వినియోగిస్తూ ఉంటారు. టమోటాలో ఆహార ప్రయోజనాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి, టమోటాలో లభించే విటమిన్-సి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. దీనిలోని పీచుపదార్ధాలు ఆహారం జీర్ణమవ్వడంలో సహాయంచేసి, రక్తంలోని చెక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. అయితే టమాటాను సాగు చేసే రైతులు మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు, టమాటా తరచు చిడిపిడిలు మరియు వైరస్ల భారిన పది రైతులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తుంది. దీనితోపాటు మార్కెట్కి తరలించే సమయంలో కూడా టమాటా ఎక్కువుగా పాడవుతుంది.

ఇటువంటి సమస్యలు సమగ్రవంతంగా నివారించడానికి మేలైన టమాటా రకాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అన్ని రకాల తెగుళ్లు తట్టుకొని, ఎక్కువ నిల్వ సామర్ధ్యం కలిగిన పంటల్లో ఆర్కా రక్షక్ టమాటా ఒకటి, ఇది ఒక హైబ్రిడ్ రకం కాబట్టి మంచి నాణ్యమైన దిగుబడిని కూడా ఇస్తుంది, దీనిని బెంగుళూరు జాతీయ ఉద్యాన సంస్థ అభివృద్ధి చేసింది. టమాటాను మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్, మహారాష్ట్ర మరియు బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధానంగా సాగు చేస్తారు. ప్రతి రాష్ట్రంలో అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండే టమాటా రకాలను సాగు చేస్తారు. టమాటా సాగు చేసే రైతులు ఎంచుకునే విత్తనంలో తగిన జాగ్రత్తలు పాటించాలి.

ప్రస్తుతం ఆర్కా రక్షక్ రకం రైతులకు ఒక వరంలాగా మారింది. హైబ్రిడ్ రకం కావడం మూలాన ఎకరానికి 40-50 టన్నుల వరకు దిగుబడినిచే సామర్ధ్యం కలిగి ఉంది. పంట కాలం కూడా తక్కువ కేవలం 140 నుండి 150 రోజుల్లో దిగుబడి రావడం ప్రారంభమవుతుంది. ఈ రకం విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి, ఎన్నో కంపెనీలు ఈ రకాన్ని మార్కెట్లో విక్రయిస్తున్నారు, ఆర్కా రక్షక్ సాగుకు ఎకరానికి 25-30 గ్రాముల విత్తనం అవసరం ఉండగా, ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల 600-700 రూపాయిలు ఉంది. ఈ రకం మరొక్క ప్రత్యేకత ఏమిటంటే ఏది అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది.

మిగిలిన టమాటా రకాలతో పోలిస్తే ఆర్కా రక్షక్ టమాటకు తెగుళ్లు మరియు చీడపీడల బెడద చాలా తక్కువ, దీని కారణంగా రైతులకు పంట ఖర్చులు తగ్గుతాయి. సరైన యాజమాన్య పద్దతులు పాటిస్తే ఒక చెట్టునుండి కనీసం 18 కేజీల వరకు టమాటా పండుతుంది, ముదురు ఎరుపు రంగులో ఉండే టమాటా 10 నుండి 15 రోజుల నిల్వ సామర్ధ్యం కలిగి ఉంటుంది , కాబట్టి సుధూర మార్కెట్లకు నిశ్చింతగా రవాణా చెయ్యవచు. ఇతర రకాలతో పోలిస్తే ఈ రకం టమాటాను ఎక్కువ ధరకు విక్రయించుకోవచ్చు.


అయితే అర్క రక్షక్ టమాటా సాగు చేపట్టే రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. డ్రిప్ పద్ధతి ద్వారా సాగు చేపడితే మేలైన ఫలితాలు ఉంటాయి. ఫెర్టిగేషన్ పద్ధతి ద్వారా పోషకాలను అందించడం ద్వారా మంచి దిగుబడి పొందవచ్చు, అంతేకాకుండా ఈ పద్దతిని పాటించడం ద్వారా ఆకుముడత తెగులు, ఎండు తెగులు, బాక్టీరియా వంటి తెగుళ్లను సమగ్రవంతంగా తట్టుకొని అధిక దిగుబడి పొందవచ్చని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. ఈ రకం టమాటాను పండించడం ద్వారాఎకరానికి 4-5 లక్షల రూపాయిల ఆదాయం పొందవచ్చు.

Related Topics

#Tomato #Cultivation #Hybrid

Share your comments

Subscribe Magazine