Kheti Badi

పత్తి పంటలో పూత, పిందే ఎందుకు రాలుతాయి.. నివారణ చేయడం ఎలా?

KJ Staff
KJ Staff
Cotton Crop
Cotton Crop

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పంట పత్తి. రైతులు ఎక్కువగా పండించే పంట. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చాలామంది రైతులు ఈ పంటను పండిస్తూ ఉంటారు. పత్తి ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు దేశంలో ముందు వరుసలో ఉంటాయి. అంతేకాదు దేశంలో పండిస్తున్న వాణిజ్య పంటల్లో అత్యంత ముఖ్యమైన పంట పత్తి. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా 16 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి పంటను పండిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే పత్తి ఉత్పత్తిలో ఇండియా రెండో స్థానంలో ఉందంటే.. ఆ ఘనత మన దేశ రైతులకే దక్కుతుంది. విస్తీర్ణంలో ఇండియా తొలి స్థానంలో ఉంది.

పత్తి పంటలో అనేక ఇబ్బందులు ఉంటాయి. పురుగులు, తెగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు పూత, పిందే రాలడం సమస్య ప్రధానంగా ఉంటుంది. పూత, పిందె రాలడం సమస్యకు నివారణ చర్యలు వెంటనే తీసుకోవడం ద్వారా పత్తి పంటను కాపాడుకోవచ్చు. పత్తిలో పూత, పిందే రాలడానికి ప్రధాన సమస్యలు ఏంటి..? నివారణ చర్యలు ఏంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పూత, పిందే రాలడానికి ప్రధాన కారణాలు ఏంటి?

-వర్షాభావం వల్ల, తగినంత నీళ్లు లేకపోవడం
-పురుగులు, తెగులు సమస్య వల్లన
-జన్యుపరమైన కారణాల వల్లన
-ప్రధాన, సూక్ష్యపోషకాలు లోపాల వల్లన

పూత, పిందే రాలే సమస్యకు నివారణ

-పూత, పిందే దశలలో పత్తి పంటకు నీటిని ఇవ్వడం
-నాణ్యమైన, జన్యుస్వచ్చత కలిగిన విత్తనాలు వాడటం వల్లన
-సాగునీరు టైమ్‌కి అందించడం
-నత్రజని ఎరువులు అధిక మోతాదులో అందించడం ద్వారా
నివారించవచ్చు
-నాఫ్తలీన్ ఎసిటిక్ యాసిడ్ 10 పి.పి.ఎం. (ఫ్లానోఫిక్స్) ఒక మి.లీ మందును 4-5 లీటర్ల నీటిలో కలిపి విడిగా గానీ లేక 1-2 శాతం డై అమ్మోనియం ఫాస్ఫేట్ లేదా యూరియా ద్రవనంతో కలిపి గాని ఒకటి లేదా రెండుసార్లు 10-15 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి పిచికారీ చేసి నివారించవచ్చు.
-సైకోసిల్ 60 పిపిఎం మోతాదులో పిచికారి చేసి అరికట్టవచ్చు
-డి.ఎ.పి లేదా యూరియా 2 శాతం ద్రావణాన్ని అంటే 20 గ్రా. లీటరు నీటికి కలిపి లేదా పొటాషియం నైట్రేట్ (మల్టికె) లేదా 19:19:19 (పాలిఫీడ్) ద్రావకాన్ని లీటరు నీటికి 10 గ్రా. చొప్పున కలిపి 7-10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి.

Share your comments

Subscribe Magazine