Kheti Badi

దోసకాయ పంట సాగు విధానం

KJ Staff
KJ Staff
dosa crop
dosa crop

దోసకాయ నిత్యావసర సరుకు. రోజూ వంటింట్లో ఉపయోగించే ముఖ్యమైన సరుకు. దోసకాయతో ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు. దోసకాయ కర్రీ, దోసకాయ పచ్చడి, దోసకాయ పప్పుతోపాటు అనేక వంటకాలు చేసుకోవచ్చు. ఇక సాంబార్ లాంటి అనేక వంటల్లో దోసకాయకు ప్రత్యేక మైన స్థానం ఉంది. దోసకాయకు వంటల్లో డిమాండ్ ఉండటంతో.. వీటి సాగు ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చు. చాలామంది వివిధ పంటల్లో మధ్యలో అంతర్ పంటగా దోసకాయ సాగు చేస్తూ ఉంటారు. దోసకాయ సాగుకు ఎక్కువ నీరు కూడా అవసరం ఉండదు.

వర్షపు నీరు సరిపోతాయి. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, ఆదాయం దోసకాయ పంటలో పొందవచ్చు. అందుకే చాలామంది రైతులు దోసకాయ సాగు చేపడుతూ ఉంటారు. వేసవి కాలంలో దోసకాయకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. అంతేకాకుండా అతితక్కువ కాలంలో దోసకాయ పంట కోతకు వస్తుంది. అన్ని రకాల నేలల్లో దోసకాయ పంటను సాగు చేయవచ్చు. దోసకాయ పంట సాగు విధానం గురించి ఇప్పుడు సమగ్రంగా తెలుసుకుందాం.

వేసవిలో దోసకాయ పంటను సాగు చేసుకోవడం మంచిది. వేసవిలో పూత రాలిపోవడం, తెగుళ్లు, చీడపరుగుల సమస్య ఉండడు. విత్తనాల్లో ఆర్‌ఎన్ఎస్ఏం-1 రకం మంచిది. ఈ రకం దోసకాయలు చారలు కలిగి ఉండి కొద్దిగా పోడవాటిగా ఉంటాయి. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వస్తుంది. వేసవి కాలానికి అనుకూలమైన రకం ఇది. పంటకాలం 130 నుంచి 140 రోజుల వరకు ఉంటుంది. ఒక ఎకరాలకు 60 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఇక ఇవేకాకుండా నాంధరి 910, అభిజిత్ గ్లోరీ, మల్టీస్టార్ లాంటి హైబ్రిడ్ దోసకాయలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.ఇక పచ్చిదోస విషయానికొస్తే.. జపనీస్ లాంగ్ గ్రీన్, స్ట్రెయిట్ ఎయిట్, కో-1, పూసా సంయోగ లాంటి చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి.

విత్తన శుద్ధి

ముందుగా నేలను దుక్కి దున్నాలి. మూడు లేదా నాలుగు అడుగుల వెడల్పుల్లో బోదెలు వేసుకోవాలి. బోదె బోదెకు మధ్య ఒక అడుగు వెడల్పులో కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ఒకరాకు ఒకటి నుంచి ఒకటిన్న కిలోల అవసరం ఉంటుంది. ఇక హైబ్రిడ్ అయితే ఎకరాకు 250 గ్రాముల విత్తనం అవసరం ఉంటుంది. కిలో విత్తనానికి మూడు నుంచి ఐదు మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలపాలి. ఇక మూడు గ్రాముల థైరం లేదా కాప్టాన్ కలిపి విత్తనశుద్ధి చేయాలి.

నీటి యాజమాన్య పద్దతులు

విత్తనాలు నాటిన దగ్గర నుంచి అవి మొలకెత్తే వరకు వెంటవెంటనే నీరు పారించాలి. మొలకలు వచ్చిన తర్వత ఏడు నుంచి 10 రోజుల మధ్యలో నీళ్లు అందించాలి. ఇక కలుపు మొక్కలు రాకుండా ఉండాలంటే.. ఎకరాకు ఒక లీటర్ మెటలాక్టోర్ ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అదే గట్టి పంట నేలలు అయిేత 1.5 లీటర్ల మెటలాక్లోర్ ను 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి. ఇక అడపూలు ఎక్కువగా రావాలంటే.. నాలుగు గ్రాముల బోరాక్స్ ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

Related Topics

Dosakaya crop, Water

Share your comments

Subscribe Magazine