Kheti Badi

అదనపు లాభాలు తెచ్చిపెట్టే పెసరు పంట:

KJ Staff
KJ Staff

వేసవి కాలం వచ్చేస్తుంది, ఈ సమయంలో పొలాన్ని కాలిగా ఉంచకుండా, ఏ పంట వేస్తే అదనపు లాభాలు వస్తాయి అని ఆలోచించే రైతులకు, పెసరు పంట సాగు ఒక మంచి ప్రత్యామ్నాయం. ఈ పంటను సాగు చెయ్యడం ద్వారా, రైతులు మంచి లాభాలు పొందడంతో పాటు, నేలలో సారం పెరిగి, తర్వాత సాగు చేసే పంటల్లో మంచి దిగుబడిని పొందవచ్చు.

Image Credits: Pixabay, PDpics
Image Credits: Pixabay, PDpics

నిర్వహణ పద్ధతులు:

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో, పెసరు పంటను, తొలకరి పంటగా లేదా రబీ పంటగా పండిస్తారు. డెల్టా ప్రాంతాలు అయిన కృష్ణ మరియు గోదావరి జిల్లాల్లో, వేసవి పంటగా లేదా మూడో పంటగా సాగు చేస్తుంటారు. లెగ్యూమినేసి జాతికి చెందిన మొక్క గనుక, వాతావరణం లో ఉండే నైట్రోజన్ న్ని మట్టిలో మొక్కకు అవసరమయ్యే అమ్మోనియం నైట్రేట్ గా మార్చి మట్టిలో స్థిరీకరిస్తుంది. ఈ ప్రక్రియ జరగడానికి ముఖ్య కారణం, రైజోబియం అని పిలవబడే ఒక బాక్టీరియా. ఈ బాక్టీరియా లెగ్యూమినేసి జాతికి చెందిన మొక్కల వేరులుపై బోనిపెలుగా ఏర్పడి మొక్కకు అవసరం అయ్యే నైట్రేట్ ను వాతావరణం నుండి మట్టిలో స్థిరికరిస్తాయి. మట్టిలో ఉన్న స్థిరీకరించబడిన నైట్రేట్స్ తరువాత వేసే పంటకు కూడా ఎంతో ఉపయోగకరం. కరువు పరిస్థితులను బలంగా తట్టుకొని నిలబలడగలడు, కనుక అన్ని కాలాల్లోనూ సాగు చెయ్యడానికి అనువుగా ఉంటుంది.

నేల తయారీ - పెసరను అన్ని రకాల భూముల్లోనూ పండించవచ్చు. కానీ చౌడు నేలలు, నీరు ఎక్కువుగా నిలిచే నేలలు పనికిరావు. రబీ పంటగా వేసే రైతులు, పొలాన్ని మెత్తగా దున్ని నేలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఎకరానికి 5-6 టన్నుల పశువుల ఎరువును పొలంలో కలిపి కలియదున్నుకోవాలి. వరి కోతకోసిన పొలంలో దుక్కిదున్నవలసిన అవసరం లేదు, నేరుగానే విత్తనాలను నాటుకోవచ్చు.

విత్తన యాజమాన్యం- విత్తునాటే ముందు, 30gm కర్భోసల్ఫేట్ మందుతో, విత్తనశుద్ధి చెయ్యవలసి ఉంటుంది. వేసవి పంటకు ఫిబ్రవరి మరియు మార్చిలో విత్తు నాటుకోవడం శ్రేయస్కరం. ప్రతీ వరుసకు 30cm దూరాన్ని, మొక్కకు, మొక్కకు మధ్య 10cm ల దూరాన్ని పాటిస్తూ విత్తనాలు నాటాలి. ఎల్.జిజి.407, ఎల్.జిజి.450, ఎల్.జిజి.410, ఎల్.జిజి.295, డబ్ల్యు .జి.జి.2, డబ్ల్యు .జి.జి. 37(ఏకశిల), యం.యల్ 267, ఇవి తెలుగు రాష్ట్రాల్లో వాడే కొన్ని ప్రముఖ రకాలు.

ఎరువుల వినియోగం : ఒక ఎకరాకు 40Kg నత్రజని, 25Kg భాస్ఫారమ్, 15Kg పోటాష్, ను దుక్కిదున్నే సమయంలో కలిపి దున్నాలి. నత్రజని మాత్రం, మూడు భాగాలుగా విభజించి, పొలం దున్నే సమయంలో ఒక దఫా, మిగిలిన రెండుభాగాలు, 40-50 రోజుల మధ్యలో, మరియు 70-80 రోజుల తరువాత వేసి నీరు పెట్టాలి. వేసవి కాలంలో వారి మాగాణుల్లో, ఎరువులు వాడాల్సిన అవసరం లేదు.

నీటి యాజమాన్యం: పెసర వర్షధారపు పంట, కానీ మట్టిలోని తేమ శాతాన్ని బట్టి ఒకటి లేదా రెండు తడులు ఇవ్వడం ద్వారా మంచి దిగుబడులు పొందవచ్చు.

కలుపు నియంత్రణ: పెసర పంటలో వచ్చే కలుపును, సమయానుసరంగా చేతితో నియంత్రిచవచ్చు. విత్తు నాటే ముందు, ఫ్లుక్లోర్లిన్ 40 శాతం,పెండిమేతలిన్ 30 శాతం ఎకరాకు 1.3 -1.6 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారి చేయాలి. పెనక్సప్రాప్ ఇథైల్ 9 శాతం ఎకరాకు 250 మీ.లీ. చొప్పున విత్తిన 20-25 రోజులప్పుడు 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.

మొక్కలో వచ్చే రోగాలు:

బూడిద తెగులు: గాలిలో తేమ శాతం ఎక్కువ ఉన్నపుడు, ఈ తెగులు రావడానికి అవకాశం ఉంటుంది, ఆకుల పై మచ్చలుగా ఏర్పడి, క్రమంగా, కొమ్మలకు, కాయలకు కూడా వ్యాపిస్తుంది. ఈ వ్యాధిని అరికట్టేందుకు, నీటికి 1 గ్రాము కర్బండిజం లేదా 1 గ్రాము తయోఫానేట్ మిథైల్ లేదా 1 మి.లి. కేరాథెన్ కలిపి, 10-15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చెయ్యాల్సి ఉంటుంది.

సేర్కొస్పోర ఆకుపచ్చ తెగులు: ఈ తెగులు సోకిన ఆకులపై గోధుమ రంగు గుండ్రని చిన్న చిన్న మచ్చలు కనిపించి అనుకూల వాతావరణ పరిస్తితులలో . ఈ మచ్చలు పెద్దవై ఆకులు ఎండి రాలిపోతాయి . దీని వలన కాయల్లో గింజలు సరిగా నిండవు . దీని నివారణకు లీటరు నీటికి 2.5 గ్రాముల మంకోజేబ్ లేదా 2 గ్రా . క్లోరోథాలోనిల్ లేదా 1 గ్రాము కార్బండజిమ్ లేదా 1 గ్రాము థాయోఫనేట్ మిథైల్ లను కలిపి వాడటం ద్వారా ఆకుపచ్చ తెగులుతో పాటు బూడిద తెగులును నివారించవచ్చు.

బాక్టిరియల్ బ్లైట్ : ఈ తెగులు సోకినా మొక్కల ఆకులపై గోధుమ వర్ణంలో చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి. 1 గ్రా. పౌషామైసిన్ ను నీటిలో కలిపిన ద్రావణంలో కిలో విత్తనాన్ని 30 నిముషాలు నానబెట్టి విత్తాలి . ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రా . కాపర్ ఆక్సిక్లోరైడ్ మరియు 100 మి.గ్రా. ప్లాంటో మైసిన్ ను కలిపి 12 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి

ఆకుముడత తెగులు (మోవ్వకుళ్ళు) : ఇది వైరస్ జాతి తెగులు . తామర పురుగులు ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాపిస్తుంది. తెగులు ఆశించిన మొక్కలు ఆకులు అంచులు వెనుకకు ముడుచుకొని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకుల అడుగుభాగంలోని ఈ నెలు రక్తవర్నాన్ని పోలి వుంటాయి . లేత దశలో వ్యాధి సోకినా మొక్కలను పికి తగులబెట్టడం ద్వారా పైరులోని ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చు .నివారణకు లీటరు నీటికి 1 గ్రాము ఎసిఫేట్ లేక 2 మీ.లీ డైమితోయేట్ మందును కలిపి పిచికారి చేయాలి. యం.జి.జి.-295 యల్.జి.జి.- 460 , పెసర రకాలు , టి- 9 , యల్.జి.జి. - 20 మినుము రకాలు ఈ తెగులును కొంతవరకు తట్టుకొంటాయి.

పురుగుల నివారణ:

తెల్లదోమ : ఈ పురుగులు ఆకుల్లోని రసాన్ని పిలుస్తాయి . అంతేగాక ఎల్లోమొజాయిక్ అనే వైరస్ వ్యాధిని( పుల్లాకు తెగులు) కూడా వ్యాపింపచేస్తాయి. వీటి నివారణకు 1.6 మి.లి. మొనోక్రోటోఫాన్ లేదా 2 మి.లి. మిథైల్ డేమేటాన్ ను లేదా డ్రైజోఫన్ 2.0 మి.లి . లీటరు నీటికి కలిపి పిచికరి చేయాలి.

తామరపురుగులు : ఈ పురుగులు తొలి దశలో లేత ఆకులపై వృద్ధి చెంది రసాన్ని పిలుస్తాయి . వీటి వల్ల ఆకు ముడత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాపిస్తుంది.పంటకు 15-20 శాతం నష్టం కలుగుతుంది . నివారణకు మొనోక్రోటోఫాన్ 1.5 మీ.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రా .లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి .

మరూకా మచ్చల పురుగు : ఈ పురుగు మొగ్గ, పూత , పిందె దశల్లో ఆశించి ఎక్కువ నష్టం కలుగచేస్తుంది. పూత దస పూతను గుడుగా చేసి లోపల పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేపుడు కాయలను దగరకు చేర్చినగుడుగా కట్టి కాయలకు రంద్రం చేసి లోపల గింజలను తినటం వలన పంటకు ఎక్కువ నష్టం కలుగుతుంది. నివారణకు క్లోరిపైరిఫాస్ 2.0 మీ.లీ. లేదా క్వినాల్ ఫాస్ 2.0 మీ.లీ. మరియు డైక్లోర్ వాస్ 1.0 మీ.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి .

కోత కోసే విధానం:
పంట నాటిన, 70-80 రోజుల తర్వాత(పంట రకాన్ని బట్టి) పంట కోతకు వస్తుంది. వర్షాకాలం ముందే పంటను కోత కొయ్యవలసి ఉంటుంది, లేదంటే తడికి విత్తనం మొలకైతే అవకాశాలు ఎక్కువ. మొక్కలను కోసి కట్టలుగా కట్టి 3-4 రోజులు ఎండనిచ్చి, విత్తనాలను వేరు చెయ్యాలి. యాజమాన్యపద్ధతులు అన్ని సర్రిగ్గా పాటిస్తే ఒక ఎకరానికి 3-4 క్వింటాల్ దిగుబడి ఆశించవచ్చు.

Share your comments

Subscribe Magazine