వర్షాకాలంలో వర్షాలు మొదలైన వెంటనే దేశంలో ఖరీఫ్ పంటలు నాటడం ప్రారంభమవుతుంది. అయితే, ఈ పంటలకు ఎరువులు మరియు ఇతర పోషకాల ఆవశ్యకత ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య మాత్రమే ఉంటుంది.
రాబోయే ఖరీఫ్ సీజన్ లో రైతులకు సరైన మరియు కాలవ్యవధిలో ఎరువుల అందించడానికి ఊహించిన దానికంటే ఎక్కువ నిలువలు కల్గి ఉండడం ప్రభుత్వం లక్ష్యంగా పేర్కొంది . వర్షాకాలం పంటలకు ఎరువుల లభ్యతకు ప్రభుత్వం ముందుగానే సన్నాహాలు ప్రారంభించిందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు బుధవారం తెలిపారు. ప్రపంచ మార్కెట్ నుంచి ఎరువులు, ఇతర ముడి పదార్థాల సమీకరించనున్నట్లు ,యూరియా, డి-అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) ప్రాథమిక నిల్వను సమీకరించనుంది .
కోవిడ్-19 మహమ్మారి మరియు చైనా విధించిన ఆంక్షల కారణంగా ఎరువుల సరఫరాపై ఈ ప్రభావం పడిందని ,త ద్వారా ఎరువుల యొక్క ధరలు పెరిగియాయని , ఈ పరిస్థితి పునరావృతం కాకుండా భారతదేశం ఇప్పటికే తన సన్నాహాల్లో ఉందని , 45 శాతం (DAP) మరియు కొంత యూరియాను చైనా నుంచి దిగుమతి చేసుకుంది. యూరియా మినహా డిఎపి మరియు ఇతర ఫాస్ఫేట్ ఎరువుల ధరలను ప్రైవేట్ కంపెనీలు నిర్ణయిస్తాయి. ముడిపదార్థాల ప్రపంచ ధరలు పెరగడం వల్ల డిఎపి ధరలు కూడా దేశీయ స్థాయిలో పెరిగాయి.
గత వర్షాకాలం , యాసంగి పంట సీజన్లలో రైతులు ఎరువుల కోసం చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. చాలా రాష్ట్రాల్లో రైతులు ఎరువు కోసం నిరసన వ్యక్తం కూడా మనం చూసాం . ఎరువు కొరత కారణంగా, కొన్ని ప్రాంతాల్లో పంట వేసుకోవడం కూడా ఆలస్యమైంది. అటువంటి పరిస్థితి మళ్లీ జరగకుండా నిరోధించడానికి, ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైంది. గత సంవత్సరం 2021 లో (DAP ) నిల్వాలు 14. 5 నుంచి 16 లక్షల టన్ను లుగా ఉండగా యూరియా 40 నుంచి 50 లక్షల టన్ను ల వరకు ఉంటుందని తెలిపారు.
మరిన్ని చదవండి .
Share your comments