Kheti Badi

నిమ్మ గడ్డి పెంచి, లక్షలు సంపాదించండి.

KJ Staff
KJ Staff
Lemon Grass Plant
Lemon Grass Plant

చాలాసార్లు మనం అనుకొని ఉంటాం. ఏదైనా పంట సులభంగా పండిస్తూ నెలకు లక్షల్లో ఆదాయం పొందే వీలుంటే ఎంత బాగుంటుంది అని.. చాలామంది వివిధ రకాల పద్ధతులను పాటిస్తూ ఇలా ఆదాయాన్ని పొందుతూ ఎంతో మందికి స్పూర్తిని కూడా అందిస్తున్నారు.

మీరు కూడా అలాంటివారిలో ఒకరు కావాలనుకుంటే నిమ్మ గడ్డి అని పిలుచుకునే లెమన్ గ్రాస్ పంటను పండిస్తూ లాభాలను సాధించవచ్చు. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా నిమ్మ గడ్డి పంటను పెంచడాన్ని ప్రోత్సహించారు. దీన్ని కాస్మెటిక్, డిటర్జెంట్లు, మందుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. దీన్ని పండించి ఆయా సంస్థలకు అమ్మడం ద్వారా మంచి లాభాలను చవి చూసే వీలుంటుంది. ఈ పంట పండించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. దీన్ని పండించేందుకు ప్రత్యేకంగా ఎరువుల అవసరం లేదు. కీటకాలు దీనికి పెద్దగా ఆశించవు. పైగా ఏ జంతువులు కూడా దీన్ని పాడు చేయవు. అందుకే ఈ పంట అన్ని రకాలుగా లాభాలను అందిస్తుంది.

ప్పుడు ప్రారంభించవచ్చు?

లెమన్ గ్రాస్ పంటను ప్రారంభించేందుకు ఫిబ్రవరి నుంచి జులై మధ్య సమయాన్ని ఎంచుకోవచ్చు. ఒకసారి పంటను వేస్తే కోతకు రావడానికి కేవలం మూడు నుంచి ఐదు నెలలు మాత్రమే పడుతుంది. అంతే కాదు.. ఒక మొక్కను కనీసం ఆరు నుంచి ఏడు సార్ల వరకు కోయవచ్చు. మనం కోస్తూ ఉంటే ఈ మొక్క పెరుగుతూనే ఉంటుంది. ఈ మొక్క నుంచి నూనెను తీసి దాన్ని వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. ఒక ఎకరంలో దీన్ని పండిస్తే దాని నుంచి యాభై నుంచి అరవై ఐదు లీటర్ల నూనెను పొందే వీలుంటుంది. ఒక లీటర్ నూనె కనీసం వెయ్యి రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఉంటుంది.

Lemon Grass Oil
Lemon Grass Oil

ఎలా గుర్తించాలి?

నిమ్మ గడ్డి మొక్కలను తుంచి వాసన చూస్తే నిమ్మ కాయకు వచ్చినట్లుగా వాసన వస్తోందంటే చాలు.. అది కోసేందుకు సిద్ధంగా ఉందని గుర్తించాలి. అప్పుడు దీన్ని భూమి నుంచి ఐదు అంగుళాల పైకి కట్ చేసి కట్టలు కట్టి అమ్మవచ్చు. లేదా నూనెను తీసి అమ్మితే మంచి ధర పలుకుతుంది. ఇవి మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు పెరుగుతాయి. కట్ చేస్తూ ఉంటే మళ్లీ పెరుగుతాయి కాబట్టి మూడేళ్ల వరకు ఖర్చు లేకుండా సంపాదించవచ్చు. దీన్ని పెంచేందుకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది. కేవలం ముప్ఫై నుంచి నలభై వేల రూపాయల ఖర్చుతో లక్షల్లో లాభాలను ఆర్జించవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఎకరానికి సంవత్సరానికి లక్ష నుంచి లక్షా యాభై వేల ఆదాయం వస్తుంది. ఇందులో ఖర్చులు పోగా నికర ఆదాయం సుమారు రూ. 70 వేల నుంచి లక్షా ఇరవై వేల రూపాయల లాభాలను పొందే వీలుంటుంది.

ఎలా పండించాలంటే..

దీనికి ఎండ ఎక్కువగా ఉండే వాతావరణం నప్పుతుంది. తక్కువ నీళ్లు అవసరం కాబట్టి వర్షాధారితంగా కూడా పెంచవచ్చు. నీళ్లు నిల్వ ఉండే నేలలు తప్ప అన్ని రకాల నేలలు దీన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి. మార్చి ఏప్రిల్ లో దీని కోసం బెడ్స్ సిద్ధం చేసుకోవాలి. 60 cm x 60 cm గ్యాప్ తో విత్తనాలు నాటుకోవాలి. కేవలం రెండు నుంచి మూడు సెంటీమీటర్ల లోతులోనే వీటిని నాటుకోవాలి. ఎకరానికి ఒకటిన్నర నుంచి రెండు కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తే ముందు కెరెసన్ మందు ద్రావణాన్ని 0.2 శాతం లేదా ఎమిసన్ ని కేజీకి ఒక గ్రాము చొప్పున చేర్చి విత్తన శుద్ధి చేసుకోవాలి. మొక్కలు నాటేందుకు సుమారు 70 వేల వరకు ఖర్చు వస్తుంది. మెయినెటెయినెన్స్, కోతలు అన్నింటికి కలిపి హెక్టారుకు రెండు లక్షల ఖర్చు అవుతుంది.

https://krishijagran.com/health-lifestyle/lemongrass-cultivation-health-benefits/

https://krishijagran.com/success-story/know-how-lemon-grass-has-become-a-boon-for-jharkhand-ladies/

Share your comments

Subscribe Magazine