Kheti Badi

మెంతికూర సాగు చేయు విధానం.. యాజమాన్య పద్ధతులు ఇవే!

KJ Staff
KJ Staff

ఆకుకూర పంటల రకానికి చెందిన మెంతికూర వ్యవసాయ భూమి తక్కువగా ఉన్న రైతులకు మంచి ఆదాయం అందించే పంట. తాజా లేత ఆకులను, కాండాన్ని కూరగాయలుగా ఉపయోగిస్తారు. అదే విత్తనాలను అయితే, దాదాపు అన్ని రకాల వంటకాలలో రుచికోసం మసాలగా వినియోగిస్తారు. మెంతితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మార్కెట్ లో మెంతి విత్తనాలతో పాటు మెంతి ఆకుకూరకు కూడా మంచి డిమాండ్ ఉంది. 0.9 మీటర్లు పెరిగే ఈ మెంతిని గార్డెన్ లో సైతం పెంచుకోవచ్చు. రైతులు పంటపొలాల్లో మెంతిని ఎలా సాగు చేయాలి? సస్యరక్షణ, నీటి యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయ నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం..

మెంతి సాగుకు నేలను తయారు చేయడం.. విత్తన ఎంపికలు : భూమిని మూడు నుంచి నాలుగు సార్లు చదునుగా దున్నుకోవాలి. చిన్న చిన్న మడులుగా చేసుకుని విత్తనాలు చల్లుకోవాలి. దీని వల్ల కొతకు, నీటిని అందించడానికి అనుకూలంగా ఉంటుంది. సాధారణ రకాలను మార్చి నుంచి సెప్టెంబర్, నవంబర్ మధ్య కాలంలో నాటుకుంటారు. కానీ ప్రస్తుతం అనేక రకాల హైబ్రీడ్ రకాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని సంవత్సరాంతరం సాగు చేయవచ్చు. మనకు అనుకూలంగా ఉన్న విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. ఒక హెక్టారుకు సుమారు 20 నుండి 25 కిలోల విత్తనం అవసరం అవుతుంది. విత్తనాలు విత్తిన ఆరు నుంచి ఎనిమిది రోజుల వ్యవధిలో మెలకలు వస్తాయి.

 

ఎరువుల వాడకం, నీటి యాజమాన్యం: పొలం సిద్ధం చేసుకునే సమయంలో ఎకరాకు 15 టన్నుల పశువుల ఎరువులను వేసుకోవాలి. అలాగే, 25 కిలోల నత్రజని ఎరువును వేసుకోవాలి. నత్రజని మోతాడుతో సగం భాస్వరం, పోటాష్ వేసుకోవాలి. ప్రతి కొత తర్వాత నత్రజని ఎరువులు వాడాలి. దీని వల్ల పంట ఏపుగా పెరుగుతుంది. దిగుబడి అధికంగా వస్తుంది. విత్తనాలు విత్తిన వెంటనే నీటిని అందించాలి. మొకలు వచ్చిన తర్వాత పంట సరిస్థితిని బట్టి నీరు అందించాలి. మొదటి కోత నెలలోపు వస్తుంది. రెండో కొత వారం నుంచి పది రోజుల్లోనే వస్తుంది. విత్తానాల కోసం పెంచేట్టు అయితే, కాయలు ఎండినప్పుడు వాటిని కుప్పలుగా వేసుకోని కర్రలతో కొట్టడం లేదా ఇతర పద్దతుల ద్వారా విత్తనాలు సేకరించుకోవాలి. కొతకు, విత్తనాలు రెండు రకాల ప్రయోజనాలు ఆశించి సాగు చేసిన మెంతిలో హెక్టారుకు 1200 నుండి 1500 కిలోల విత్తన దిగుబడి వస్తుంది.

Share your comments

Subscribe Magazine