Kheti Badi

దానిమ్మలో వచ్చే బ్యాక్టీరియా తెగులు, నివారణ చర్యలు ఇవే!

KJ Staff
KJ Staff
Pomegranate Bacterial blight
Pomegranate Bacterial blight

దానిమ్మ పండ్ల వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వీటి నుంచి శరీరానికి అవసరమైన పలు రకాల పోషకాలు పుష్కలంగా అందుతాయి.  దానిమ్మ పండులోని ప్రతి భాగం మనకు ఉపయోగ పడుతుంది. దీనిలో ఉన్న అనేక రకాల ఔషధ గుణాల కారణంగా దీనిని ఆయుర్వేద మందుల తయారీలోనూ ఉపయోగిస్తారు. దానిమ్మ పండ్ల చర్మం (పై తోలు)రసంఆకులు, వేర్లు ఇలా మొక్కలోని ప్రతిభాగం ఆయుర్వేద మందులలో వాడతారు. వైద్యులు సైతం వీటిని నిత్యం తీసకుంటే రోగ నిరోరధ శక్తిని పెంచడంతో పాటు శరీరంలో రక్తశాతం పెరుగుదలకు తోడ్పడుతుందని చెబుతున్నారు. ఇన్ని లాభాలు కలిగించే దానిమ్మకు మార్కెట్ లోనూ మంచి డిమాండ్ ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలోనే రైతులు దానిమ్మను సాగు చేస్తున్నారు. అయితే, దానిమ్మలో పలు రకాలు తెగుళ్లు వచ్చి పంటను, దిగుబడిని నష్టపరుస్తాయి. అందులో అధికంగా వచ్చే తెగులు దానిమ్మ బ్యాక్టీరియా తెగులు. బ్యాక్టీరియా తెగులు జాంథోమోనాస్ ఆక్సనోఫోడిస్. పి.వి. పునికేఅనే బాక్టీరియా కారణంగా సంక్రమిస్తుంది. ఇది ఒక మొక్క నుంచి మరో మొక్కకు గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. పంట మొత్తం వ్యాపించడంలో పాటు చుట్టూ ఉన్న తోటలకు సైతం సంక్రమించే అవకాశం అధికంగా ఉంటుంది. వర్షకాలంలో మరింత వేగంగా వ్యాపిస్తుంది.

బ్యాక్టీరియా తెగులు సోకిన మొక్కల్లో ఆకులపై అక్కడక్కడ మచ్చలు ఏర్పడతాయి. ఈ చిన్న చిన్న మచ్చల చుట్టూ పసువు వర్ణపు రంగులో వలయం ఏర్పడుతుంది. ఇది మరింత ముదిరితే మొక్క ఆకులన్నీ రాలిపోతాయి.  దానిమ్మ కాయలపై కూడా ఇలాంటి మచ్చలు ఏర్పడి మొదట్లో చిన్నగా ఉన్నప్పటికీ.. తర్వాత ఇవన్నీ కలిసిపోయి పెద్దగా మారిపోతాయి. కాయల ఆకారం మారడంతో పాటు.. అవి కుళ్లిపోయి రాలిపోతుంటాయి.

దానిమ్మకు బ్యాక్టీరియా తెగులు రాకుండా సాగు రైతులు సామూహిక చర్యలు తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి.  ఈ తెగులు రాకుండా కత్తిరింపుల సమయంలో ఉపయోగించే కత్తెరలను సోడియం హైపోక్లోరైడ్ తో కడిగి ఉపయోగించాలి. తెగులు సోకిన మొక్కల కొమ్మలు, కాయలు ఉంటే వాటిని తొలగించాలి.  కత్తిరించిన భాగంలో బోర్డు పేస్ట్ ను రుద్దాలి.  నేలపై రాలిన ఆకులను, తెగులు సోకిన కొమ్మలు, కాయలను పంట నుంచి తొలగించాలి. దానిమ్మలో బ్యాక్టీరియా తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే కాఫరాక్సీక్లోరైడ్ 30 గ్రాములుప్రైప్టో సైక్లిన్ 5 గ్రాములను 10 లీటర్ల నీటిలో కలిపి రెండు వారాల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. ఇవి అందుబాటులో లేకపోతే.. మార్కెట్ లో దొరికే ఇతర నివారణ మందులను ఉపయోగించాలి.

Share your comments

Subscribe Magazine