మరికొన్ని రోజుల్లో వర్షాకాల పంటల (ఖరీఫ్) సాగు ప్రారంభం కానుంది,అయితే ఈ తరుణంలో రైతులు వేయబోయే పంటలకు, ప్రభుత్వ అందిస్తున్న కనీస మద్దతును ధర వివరాలు తెలుసుకోండి.
ఏయే పంటకి ఎంత కనీస మద్దతు ధర అందివ్వాలో , వ్యవసాయ ఖర్చులు & ధరల కమిషన్ (Commission for Agricultural Costs & Prices) సూచిస్తుంది. అయితే తుది నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వానిదే.Commission for Agricultural Costs & Prices అనేది భారత ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క అనుబంధ కార్యాలయం. ఇది జనవరి 1965లో ఉనికిలో ప్రారంభమయింది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించేలా రైతులను ప్రోత్సహించడానికి మరియు ఉత్పాదకత మరియు మొత్తం ధాన్యం ఉత్పత్తిని పెంచడానికి కనీస మద్దతు ధరలను (MSPs) సిఫార్సు చేయడం తప్పనిసరి. అయితే కనీస మద్దతు ధరని నిర్ణయించేముందు ఆయా పంటకి సాగుకి అయ్యే ఖర్చుకి కనీసం 1.5 రెట్లు ఉండేలా చూసుకుంటుంది.
కనీస మద్దతు ధర వివరాలు:
ప్రభుత్వం 22 పంటలకు కనీస మద్దతు ధరలను తప్పనిసరి చేసింది అందులో ఖరీఫ్ సీజన్‌లో 14 పంటలు, రబీలో 6 పంటలు, మరో రెండు వాణిజ్య పంటలు ఉన్నాయి.
ఖరీఫ్ పంటలు:
వరి సాధారణ రూ.1940
వరి గ్రేడ్ 'A' రూ.1960
జొన్న హైబ్రిడ్ రూ. 2738
జొన్న మల్దండి రూ.2758
సజ్జలు రూ.2250
మొక్కజొన్న రూ.1870
రాగి రూ.3377
కంది రూ.6300
పెసర్లు రూ.7275
మినుములు రూ.6300
పత్తి మీడియం స్టేపుల్ రూ.5726
పత్తి లాంగ్ స్టేపుల్ రూ.6025
వేరుశెనగ రూ.5550
ప్రొద్దుతిరుగుడు రూ.6015
సోయాబీన్ రూ.3950
నువ్వులు రూ.7307
కుసుమ రూ.6930
మరిన్ని చదవండి.
మొక్కలలో పోషక లోపాల లక్షణాలు మరియు అధిక మోతాదు వల్ల సంభవించే నష్టాలు!
Share your comments