Kheti Badi

వెల్లుల్లి పంట సాగు విధానం.. అధిక దిగుబడి రావాలంటే ఎలా?

KJ Staff
KJ Staff
garlic crop
garlic crop

వెల్లుల్లి. నిత్యావసర సరుకుగా దీనికి చెప్పవచ్చు. చాలా కూరల్లో దీనిని వాడుతూ ఉంటారు. కూరలో కాస్త వెల్లుల్లి వేస్తే వచ్చే టేస్ట్ వేలు. వెల్లుల్లి వేయకపోతే కూరకు టేస్ట్ అంతగా రాదు. అందుకే చాలా కూరల్లో వెల్లుల్లి వేస్తూ ఉంటారు. ఇక ఆయుర్వేదంలో వెల్లుల్లికి అత్యంత ప్రాధాన్యత ఉంది. చాలా వ్యాధులను నయం చేసే గుణాలు వెల్లుల్లిలో ఉన్నట్లు ఆయుర్వేదం ప్రకారం తెలుస్తుంది. హోమ్ మెడిసిన్‌గా వెల్లుల్లిని చాలామంది భావిస్తారు. మసాల దినుసుగా వెల్లుల్లిని ఉపయోగిస్తారు.

గొంతు, కడుపు నొప్పి లాంటి వ్యాధులకు హోమ్ రెమిడీగా దీనిని ఉపయోగిస్తారు. యాంటీ బాక్టీరియల్ గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. ఊరగాయ, కూరగాయలు, పచ్చడిలో వెల్లుల్లిని బాగా ఉపయోగిస్తారు. బీపీ, జీర్ణ, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్, ఆర్థరైటిస్, నపుంసకత్వము లాంటి అనేక వ్యాధులకు వెల్లుల్లిని ఉపయోగిస్తారు. క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా వెల్లుల్లితో ఉన్నట్లు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే రసాయనం ఉంటుంది. అందుకే వెల్లుల్లి కొంచెం ఘాటుగా ఉంటుంది. ప్రత్యేకమైన వాసన వెదజల్లుతుంది. వెల్లుల్లి నిత్యావసర సరుకు గనుక ఈ పంటకు కూడా మంచి డిమాండ్ ఉంది. వెల్లుల్లి సాగు చేయడం ద్వారా రైతులు లాభాలు పొందవచ్చు. వెల్లుల్లి సాగు ఎలా.. సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సాగు విధానం

వెల్లుల్లి పంట వేయాలంటే పొలాన్ని రెండు, మూడుసార్లు దున్నాలి. ఆ తర్వాత ఎరువు కలపాలి. ఒక హెక్టార్ పొలంలో 100 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, పొటాష్, సల్ఫర్ కలపాలి. ఇక నాటు వేసే సమయంలో 35 కిలోలు నత్రజని చల్లాలి. ఆ తర్వాత 30 రోజుల తర్వాత 35 కిలోల నత్రజని చల్లాలి. ఆ తర్వాత 45 రోజుల తర్వాత 30 కిలోలు చల్లాలి.

నాటు వేసే విధానం

-వరుస నుంచి వరుసకు 15 సెం.మీ దూరం ఉండాలి
-మొక్క నుంచి మొక్కకు 10 సెం.మీ దూరం ఉంచితే పంట దిగుబడి అధికంగా ఉంటుంది.
-ఇక చీడపరుగులు రాకుండా ఉండటానికి ఒక లీటరు నీటిలో పెండమెథలిన్ 3.5 నుంచి 4 మి.లీ క్లెయిమ్ మొత్తాన్ని కలిపి పిచికారీ చేయాలి.

వెల్లుల్లి పంటలో రసం పీల్చు పురుగుల ముట్టడి

ఆక్సిడిమెటన్ - మిథైల్ 25% ఇసి @ 480 మి.లీ 300 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.

వెల్లుల్లి సాగులో తామర పురుగుల నియంత్రణ

వెల్లుల్లి సాగులో తామర పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. తామర పురుగులు ఆకు ఉపరితలాన్ని గీకి, రసాన్ని పీలుస్తాయి. పురుగు సోకిన మొక్క ఆకులు ముడుచుకొని చివరికి ఎండిపోతాయి. దీని వల్ల పంటకు తీవ్ర నష్టం చేకూరుతుంది. తామర పురుగుల నియంత్రణ కోసం, లాంబ్డా సైహెలోథ్రిన్ 5 ఇసి @ 10 మి.లీ లేదా ఫిప్రోనిల్ 80 డబుల్ల్యు జి @ 2 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి. ఇలా చేయడం వల్ల తామర పురుగుల నియంత్రణ చేపట్టవచ్చు.

Related Topics

Garlic, Crop

Share your comments

Subscribe Magazine