అందరికీ బాగా తెలిసిన మరియు ఎన్నో ఔషధ విలువలు కలిగిన సుగంధద్రవ్యం ఏదైనా ఉంది అంటే అది లవంగం అనే చెప్పుకోవాలి. ఇది ఇండోనేషియా కు చెందిన ఒక సతత హరిత వృక్షం. యూరప్, ఆసియా ఖండాల దేశాల్లో వీటిని ఎక్కువగా సాగు చేస్తారు.
లవంగాల మొక్క 10 నుండి 20 మీటర్ల వరకు ఎత్తు పెరుగుతాయి. ఇవి మొక్కదశ నుండి వృక్ష దశ కు చేరుకునే సమయానికి వాటి ఆకుల రంగు రాగి రంగు నుండి ఆకుపచ్చగా మారుతాయి. వీటి పువ్వులు పుష్ప గుచ్చాలుగా విచ్చుకోబడతాయి. వీటిని ఆకుపచ్చని మొగ్గ దశలో ఉన్నప్పుడే వృక్షాల నుండి వేరు చేస్తారు.
ఎలా పెంచాలి? (How to harvest)
లవంగాల మొక్కలు చాలా సులభంగా ఎదుగుదలకు వస్తాయి. ఇది ప్రత్యేక శ్రద్ద అవసరం లేని పంట. ఇవి నాటిన 4 సంవత్సరాలకు పంట దిగుబడి వస్తుంది.
లవంగ వృక్షము తేమగా ఉండే ఉష్ణమండ వాతావరణంలో 100 -200 సెం.మీ వార్షిక వర్షపాతం నమోదు అయ్యే ప్రాంతాల్లో మరియు సముద్రమట్టానికి 1000 మీ. ఎత్తు ఉండే ప్రాంతాల్లో ఏపుగా పెరగగదు.
అక్కడ సరాసరి ఉష్ణోగ్రత 20-300 డిగ్రీల సెం.గ్రే ఉండాలిబాగా తేమగా ఉండే వాతావరణంలో లవంగం చెట్లు పుష్పించవు. నిర్జర (డ్రై) మరియు తడి వాతావరణము ఒక దాని తరువాత ఒకటి ఉండే ప్రాంతలో బాగా పెరుగుతాయి.
మనరాష్ట్రంలో సముద్రమట్టానికి ఎత్తుగా ఉన్న ప్రాంతాలైన హార్సెలీ కొండలు మరియు అరకు ప్రాంతాల్లో కొంత వరకు ఈ వాతావరణం ఉంటుంది.
సారవంతం అయిన గరప నేలలు ఈ పంట సాగుకు ఉపయోగకరం, ఇసుక నేలల్లో లవంగం పంట పండడం చాలా కష్టం.
ప్రవర్తనం: (Sowing )
• లవంగ మొక్కలను విత్తనం ద్వారా ప్రవర్థనం చేస్తారు. • ఈ విత్తనాలను పండిన ఫలం నుండి వేరుచేసి తరువాత విత్తుకోవాలి,ఆ తరువాత నారుమళ్ళు తయారు చేసుకోవాలి.
• పెద్ద పరిమాణంలో గల విత్తనాలు 88% మొలకెత్తితే చిన్న పరిమాణంలో గల విత్తనాలు 43% మొలకెత్తుతాయి.
• నారుమడి నీడలో ఏర్పాటు చేసుకోవాలి. 1-1 1/2 సంవత్సరం వయస్సు గల నారును జాగ్రత్తగా నాటుకోవాలి.
• జంజిబర్ నారును నారుమళ్ళలో ఒక సంవత్సరం పాటు ఉంచి తరువాత నాటుకోవాలి.
• ఒక మీటరు పొడవు, వెడల్పు లోతు గల గుంతలు త్రవ్వి పశువు ఎరువు కలిపిన మట్టి మిశ్రమం నింపి వర్షాకాలంలో ఈ లవంగ మొక్కలు నాటాలి.
• మొక్కకు మొక్కకు మధ్య 6 మీ. నుండి I 6 మీ. దూరంలో నాటాలి.
పోషణ: (Maintenance)
• మొక్కలు నాటిన 2 లేదా 3 నెల తరువాత ప్రతి మొక్కకు 4 కేజీ పశువు ఎరువును వేయాలి. దీనితో పాటు జులైలో 25 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. ఇదే మోతాదు సెప్టెబరు, అక్టోబరు మాసంలో మళ్ళీ వేయాలి.
• ఎరువులను మట్టితో కలిపి ప్రతిమొక్కకు 15 -20 సెం.మీ దూరంలో మరియు 10 -15 సెం.మీ లోతులో వేయాలి.
• 8 సంవత్సరము వయస్సుగల చెట్టుకి 50 కేజీ కంపోస్టు, 1 కేజి అమ్మోనియంసల్ఫేట్, సూపర్‌ఫాస్ఫేట్ మరియు మ్యూరేట్ఆఫ్‌పొటాష్‌లను వేయాలి.
• ప్రతి మొక్కకు 10 కి.గ్రా పశువు ఎరువు, 400 గ్రా. నత్రజని, 350 గ్రా. భాస్వరం, 1200 గ్రా. పొటాష్ మరియు వీటితోపాటుగా అజోస్పైర్లిం మరియు ఫాస్ఫోబాక్టీరియా మొక్కకి 50 గ్రా. చొప్పున సరఫరా చేస్తే అత్యధి దిగుబడి ఇవ్వడం జరుగుతుంది.
• జంజిబర్ లవంగాలలో అమ్మోనియం సల్ఫేట్‌ను ప్రతిమొక్కకు 400 గ్రా. చొప్పున రెండు సమానభాగాలుగా వర్షాకాలం చివర్లో వేస్తూ ఉండాలి. ఈ విధంగా 6 సం॥ వయస్సు వరకు వేసి తరువాత ఈ మోతాదుని ఒక కేజీ వరకు పెంచాలి.
• అలా నత్రజనినీ జంజిబర్ లవంగాల సాగులో పాటిస్తే హెక్టారుకి 300 కి.గ్రా ఎండు లవంగాల దిగుబడిని అధికంగా పొందవచ్చును.
దిగుబడి: (Yield)
• లవంగాలు 4-6 సంవత్సరంలోనే కోతకి వస్తుంది.
పూ మొగ్గ శాఖ యొక్క కొనభాగంలో చిన్న కొమ్మపై ఉత్పత్తి అవుతాయి.
• మొగ్గ ఎప్పుడైతే లేత ఎరుపు రంగులోనికి మారతాయో అన్నింటినీ సేకరించాలి.
మొగ్గ విచ్చుకోక ముందే అన్నింటినీ సేకరించాలి. లేకపోతే సుగంధ ద్రవ్యం విలువ తగ్గుతుంది.
సాధారణంగా ఫిబ్రవరి నుండి మే నెల్లో దిగుబడి బాగా వస్తుంది.
• జంజిబర్ లవంగాలు సాధారణంగా ఆగష్టు నుండి డిసెంబరులో కోతకు వస్తాయి.
• ఫలమును జులై నుండి ఆగష్టులో కోస్తే విత్తనాలను తీసి విత్తుకోవచ్చు.
• లవంగాల దిగుబడి ప్రతి సంవత్సరం మారుతుంది. కోతకి వచ్చిన చెట్టు ఇచ్చే సరాసరి దిగుబడి 40 కి.గ్రా. ఒక చెట్టు నుండి ఎండిన లవంగం 2 కి.గ్రా. మాత్రమే వస్తుంది.
• తగు జాగ్రత్తలతో పెంచిన మొక్క 10 కి.గ్రా ఎండిన లవంగాలు దిగుబడిని ఇవ్వవచ్చు.
• లవంగం చెట్లు 60 సంవత్సరాల వయస్సు వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో దిగుబడిని ఇవ్వగలవు.
ఇలా పండించిన శ్రేష్ఠమైన లవంగం పంటకు మార్కెట్లో పెద్ద గిరాకీ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే భారత దేశములో సాగు అయిన లవంగం అంటే దాని ధర మరింత రెట్టింపుగా ఉంటుంది.
Share your comments