Kheti Badi

గోరు చిక్కుడు సాగు ఎలా చెయ్యాలో తెలుసా?

KJ Staff
KJ Staff
Beans
Beans

తీవ్ర కరువు పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు తట్టుకుని మంచి దిగుబడిని ఇచ్చే పంటల్లో గోరు చిక్కుడు కూడా ఒక‌టి.  గోరు చిక్కుడు ఎలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కొంటుంది. దీంతో పంట మంచిగా వ‌స్తుంది. రైతుల‌కు న‌ష్టాల‌ను క‌లుగజేయ‌కుండా మంచి ఆదాయం గోరు చిక్కుడు సాగుతో వ‌స్తుంది. దీనిని కూర‌గాయ‌గానే కాకుండా బ‌ట్ట‌లు, పేప‌రు, నూనే, సౌద‌ర్య సాధ‌నాల త‌య‌రీ పరిశ్రమల్లో కూడా ఉప‌యోగిస్తారు. దీంతో మార్కెట్‌లో మంచి ధ‌ర ప‌లుకుతుంది.

గోరు చిక్కుడు సాగు 

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో అధికంగా సాగు చేసే పంటల్లో గోరు చిక్కుడు కూడా ఒకటి. గోరు చిక్కుడు ఉష్ణ‌మండ‌ల పంట‌. ఇది నీటి ఎద్ద‌డిని త‌ట్టుకుని.. ఉష్ణోగ్ర‌త ఎలా ఉన్నా సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఈ పంటను ఎర్రనేలలు, ఒండ్రు నేలలతో పాటు అన్ని సాధారణంగా ఉంటే నేలలో గోరు చిక్కుడును సాగు చేయవచ్చు. నీరు సరిపడినంత ఉంటే పంట దిగుబడి అధికంగా ఉంటుంది. కాబట్టి నీరు తక్కువగా ఉన్న పరిస్థితులతో పాటు నీరు అధికంగా లభించే ప్రాంతాల్లోనూ  గోరు చిక్కుడు సాగు చేయడం  రైతులకు లాభదాయకంగా ఉంటుంది.

గోరు చిక్కుడు పంటకాలం

గోరు చిక్కుడు వేసవి కాలానికి అనుకూలమైన పంట అయినప్పటికీ.. వర్షాకాలంలోనూ దీనిని సాగు చేయవచ్చు.  పంట వేసే ముందు నేలను బాగా దున్నుకోవడంతో పాటు అందులో పశువుల పేడ ఎరువును వేసుకుంటే దిగుబడి మంచిగా వస్తుంది. వరుసలుగా నీరు పారే విధంగా బోజలు తయారు చేసుకుని విత్తనాలు నాటుకోవాలి. ఒక ఎకరాకు 4 నుంచి 5 కిలోల విత్తనాలు అవసరం అవుతాయ. ప్రస్తుతం మార్కెట్ లో పూసా మాసమి, పూసా సదాబహార్, పూసా నవబహార సహా అనేక కంపెనీల సాధారణ, హైబ్రీడ్ గోరు చిక్కుడు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. విత్తనాలు నాటే ముందు 10 గ్రాముల  రైజోబియంతో  ఒక కిలో విత్తనానికి ఉపయోగించి విత్తనశుద్ధి చేసుకోవాలి.  విత్తనాలు నాటిన 50 నుంచి 60 రోజుల వ్యవధిలో మొదటి కోతకు వస్తాయి. దిగుబడి అధికంగా ఉండాలంటే ఎరువులు, సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. కలుపు లేకుండా చూసుకోవాలి.  ఎకరాకు కొతలో పది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.

Share your comments

Subscribe Magazine