ఒకటి రెండు అడుగులు ఎత్తు పెరుగగల మెంతి మొక్క అందరికీ సుపరిచితమే. ముఖ్యంగా భారతదేశంలో ప్రతి ఒక్క వంటగదిలో మనకు ఈ మెంతికూర కనిపిస్తుంది మెంతికూర లేని వంట ఉండనీ ఇల్లు ఒక్కటి కూడా ఉండదు. ఇంతటి ప్రాముఖ్యత గల ఈ చిన్న మొక్కలు ఎన్నో ఔషధగుణాలున్నాయి. ఈ చిన్నపాటి మొక్కలను సాగు చేయడం కూడా చాలా సులభం.
మెంతుల సాగుకైతే వసంత ఋతువు చివరి నుండి మొదలు వరకు ఎప్పుడైనా మంచు కురిసే అవకాశం ఉండడం వల్ల వసంత ఋతువు గడిచిన తరువాత నేల వేడెక్కడం ప్రారంభం అవుతుంది అప్పుడు తోటలో విత్తనాలు నాటడం మొదలెట్టాలి అప్పుడు మనకు కావలసిన విత్తులు మన చేతికి వస్తాయి.
మెంతి కూర సాగు:(cultivation)
వేగంగా పెరిగే ఆకు కూర కోసం వసంత కాలం చివర్లో విత్తనాలను విత్తుకోవడం మంచిది. ఎందుకంటే వేసవి కాలం మధ్యవరకు వచ్చే సరికి భూమి వేడెక్కడం జరుగుతుంది. ఆ సమయంలో భూమి తేమను కోల్పోవడం జరుగుతుంది.
విత్తుకోవడం: (Sowing)
విత్తిన విత్తనాలు త్వరగా మొలకెత్తాలి అంటే భూమిలో 1/4 వంతు లోతుతో గుంటలు చేసి, ఒక్కో గుంటకి 8 నుండి 18 అంగుళాల దూరంలో వరుసలలో నాటాలి. కొన్ని రోజులలోనే ఇవి మొలకెత్తి బయటికి రావడం మనం గమనించ వచ్చు. క్రమం తప్పకుండా నీళ్ళు పట్టాల్సి ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే అతిగా నీరు పెట్టడం ఈ చిన్ని మొక్కలకు మంచిది కాదు. ఎందుకంటే అతిగా తేమ ఉంటే ఈ మొక్కలు పెరగవు.
ఎలా పెంచాలి(how to grow):
సాధారణంగా మెంతి కూరను పొడి బారిన నెలలో నాటుతారు. ఎందుకంటే ఆ పొడి నేలలో 6.5 నుండి 8.2 వరకు PH విలువను కలిగిన ఆల్కలిన్ తటస్థంగా ఉంటుంది. దీని కారణంగా ఆ మొక్కలు త్వరగా పెరుగుతాయి. అందువల్ల విత్తనాలు నాటిన 20 నుండి 30 కోతకు సిద్ధంగా ఉన్న ఆకులు ఉత్పత్తి అవుతాయి.
పోషణ (Fertilizing):
ఒకహెక్టార్ కి 15టన్నుల వ్యవసాయ యార్డ్ ఎరువుతో పాటు, 25 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం మరియు 50 కిలోల పొటాష్ ను ఉపయోగించడం జరుగుతుంది. నత్రజని మోతాదులో సగం మరియు భాస్వరం మరియు పొటాష్ మొత్తం పరిమాణం మొదటి సారి ఎరువులు చల్లేటప్పుడు ఉపోయోగిస్తారు. మిగిలిన సగం నత్రజని విత్తిన 30 రోజుల తరువాత ఉపయోగిస్తారు. మరింత ఆరోగ్యవంతమైన ఆకు పెరుగుదలను పొందడానికి, ప్రతి కటింగ్ తర్వాత నత్రజనిని వాడాల్సి ఉంటుంది.
నీటి పారుదల (irrigation):
విత్తనాలను నాటిన సమయంలో నీరు బాగా పట్టాలి. తరువాత 7 నుండి 10 రోజులు విరామం ఇచ్చి మళ్ళీ నీళ్ళు పట్టాలి.
కోతలు (Harvesting):
25 రోజుల నుండి 30 రోజుల కాల వ్యవధిలో 4 నుండి 5 సెంటి మీటర్ల పొడవు ఉన్న చిన్న చిన్న మొలకలు భూమి నుండి బయటకు రావడం మనం గమనించవచ్చు. తరువాతి 15 రోజుల కాలంలో మనకు కోతకు సిద్ధంగా ఉన్న మొక్కలుగా ఎదుగుతాయి.
దిగుబడి (Yield):
ఒకవేళ రెండు (విత్తనాలు మరియు ఆకుకూర) ప్రయోజనాల కోసం పంటను వేస్తే ఒక హెక్టారు కు
1200 నుండి 1500 కిలోల మెంతులు, 800 నుండి 1000 కిలోల మెంతి కూర దిగుబడి పొందొచ్చు.
Share your comments