Kheti Badi

పత్తి పంటలో గులాబీ పురుగు నివారణ చర్యలు.....

KJ Staff
KJ Staff

భారత దేశంలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే వాణిజ్య పంటల్లో పత్తి ప్రధానమైంది. ఇక్కడ పండించే పత్తికి మన దేశంతోపాటు ఇతర దేశాల్లో కూడా ఎంతో డిమాండ్ ఉంది. మిగిలిన పంటలతో పోలిస్తే పత్తిలో పురుగులు మరియు చీడపీడల బెడద ఎక్కువ, వీటిని నివారించడానికి రైతులు అధిక మొత్తంలో పురుగుమందులు వినియోగిస్తారు. పత్తి పంటలో తీవ్ర నష్టం కలిగించే పంటల్లో గులాబీ పురుగు ఒకటి. పంట ప్రారంభించిన 45 రోజుల తరువాత ఈ పురుగు మొక్కలను ఆశించి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. గులాబీ పురుగుయొక్క ఉదృతిని ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపడితే పంట నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు.

ఈ గులాబీ పురుగు లార్వా దశలో ఉన్నపుడు మొక్కల్లో నష్టం కలిగిస్తుంది. ఈ పురుగు ఆశించిన మొగ్గలు తెరుచుకోకపోవడం దీనికి ప్రధానమైన లక్షణంగా చెప్పుకోవచ్చు. తల్లిపురుగు ముందుగా మొక్కల మీద గుడ్లు పెడుతుంది, గుడ్ల నుండి బయటకు వచ్చిన మొదటితరం లార్వా మొగ్గలను క్రమక్రమంగా తినేస్తుంది. పువ్వులు వికసించిన దశలో లార్వా పట్టు ధరలతో కనిపిస్తుంది. కాయలు తయారైన తరవత పురుగులు కాయల్లోకి చేరి విత్తనాలు తినేస్తాయి. కాయల్లోని పత్తికి నష్టం కలగడం వలన మార్కెట్లో విలువ బాగా తగ్గిపోతుంది. పురుగుల ఉదృతి మరిఎక్కువుగా ఉన్న సమయంలో కాయలు రాలిపోవడం, నల్లగా మారడం, నాణ్యత తగ్గిపోవడం మొదలైన లక్షణాలను గమనించవచ్చు.

మొదటి బూడిద మరియు గోధుమ రంగులో ఉండే ఈ పురుగులు క్రమంగా గులాబీ రంగులోకి మారతాయి, కాబట్టే వీటికి గులాబీ పురుగులు అన్న పేరువచ్చింది పత్తికాయలను పురుగు ఆశించింది అనడానికి సంకేతంగా కాయలపై పులిపురుల రూపంలో మచ్చలు కనిపిస్తాయి. ఈ పురుగుల ఉదృతి ముందుగానే తెలుసుకొని తగిన రక్షణ చర్యలు పాటించాలి, ఆలస్యమయ్యేకొద్దీ పురుగుల ఉదృతి పెరిగి పంటకు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ముందుగా పొలంలో పురుగుల ఉదృతి ఉందొ లేదో తెలుసుకోవడానికి పొలం మొత్తం లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. ఒక రోజులో 7-8 కన్నా ఎక్కువ పురుగులు ఉన్నట్లైతే వీటి ఉదృతి ఎక్కువగా ఉందని అర్ధం.

పురుగుల ఉదృతిని గమనించేందుకు కాయలను కూడా పరీక్షిస్తూ ఉండాలి. పురుగుల ఉదృతి ఎక్కువగా ఉన్న సమయంలో ఒక లీటర్ నీటికి 1.5 మి.లి క్లోరోపైరిఫోస్ ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. దీంతోపాటు వేపనూనెను ఒక 5 మి.లి ఒకలితీర్ నీటికి కలిపి 10 రోజులకు ఒకసారి మొక్కమొత్తం తడిచేలా పిచికారీ చెయ్యాలి. తొందరగా దిగుబడినిచే పంట రకాలను మరియు రోగనిరోధక శక్తీ అధికంగా ఉన్న రకాలను ఎంచుకోవాలి.

Share your comments

Subscribe Magazine