Kheti Badi

బొప్పాయిలో వైరస్ వ్యాధిని ఎలా నియంత్రించాలి?

KJ Staff
KJ Staff

ప్రస్తుతం రైతులకు అధిక లాభాలు తెచ్చిపెడుతున్న పంటల్లో బొప్పాయి ఒకటి. మిగిలిన ఉద్యాన పంటల్లాగా కాకుండా నాటిన కొద్దీ రోజుల్లోనే దిగుబడిని అధించగల పంట బొప్పాయి. ఒకప్పుడు బొప్పాయిని కేవలం పెరటి పంటగానే భావించేవారు, ప్రస్తుతం ఎన్నో హైబ్రిడ్ రకాలు కలిగి ఉన్న బొప్పాయి వాణిజ్య పంటగా అవతరించింది. దేశం నాళములల్లోని వినియోగదారులు ఉండటం మూలాన మార్కెట్లో కూడా అధిక ధర లభిస్తుంది.

తక్కువ ఖర్చుతో వాణిజ్య పంటలు సాగుచెయ్యాలనుకున్న రైతులకు బొప్పాయి పంట సరైన ఎంపిక, అయితే బొప్పాయికి సోకె చీడపీడలు పంట నాణ్యతను తగ్గించడమే కాకుండా, రైతులకు అదనపు ఖర్చును కలిగిస్తున్నాయి. మొక్క నారు దశ నుండి అనేక చీడపీడలు ఆశించడం వలన రైతులమీద అదనపు భారం పడుతుంది. వీటిని నియంత్రించడానికి రైతులు పురుగు మందులను ఎక్కువుగా వినియోగిస్తున్నారు, విచక్షణరహితంగా పురుగుమందులను వినియోగించడం ద్వారా పర్యావరణానికి తీరని నష్టంవాటిల్లుతుంది. రోగాలు సోకినా పంటతోపాటు పర్యావరణాన్ని కాపాడటానికి పంట యాజమాన్యంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం ఉత్తమం.

బొప్పాయిని సాగుచేసే రైతులు ప్రధానంగా ఎదుర్కునే సమస్యల్లో ఆకుముడత తెగులు మరియు రింగ్ స్పాట్ వైరస్ అతి ముఖ్యమైనవి. ఈ వ్యాధి సోకినా మొక్కలకు నయంచేయ్యడం దాదాపు అసాధ్యం, ఈ వైరస్ తెగుళ్లు మొక్కకు రాకుండా నియంత్రించడం మాత్రమే మనం పాటించగలిగేది. ఈ తెగుళ్లు రావడానికి ప్రధాన కారణం రసం పీల్చు పురుగులు, ఈ పురుగులు మొక్కల్లోని రసం పిలుస్తూ ఒక మొక్క నుండి మరొక్క మొక్కకు ఈ వ్యాధులను వ్యాపింపచేస్తాయి. మొక్క నారుదశలో ఉన్నపుడు ఈ పురుగులు ఎక్కువుగా ఆశించి నష్టం కలిగిస్తాయి.

రసం పీల్చు పురుగుల నుండి బొప్పాయిని నారుని కాపాడుకోవడానికి, నారుని నెట్ హౌసులు, పోలీ హౌసులలో పెంచాలి. ఈ పురుగులు మొక్కల దగ్గరకు చేరకుండా ఉండేందుకు, 2.5 గ్రాముల వేప నూనెను ఒక లీటర్ నీటికి కలిపి వారానికి ఒకసారి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. వేపనూనెలోని చేదు మూలంగా పురుగులు మొక్కల వద్దకు చేరవు. బొప్పాయిని ప్రధాన పొలంలో నాటేముందు పొలం చుట్టూ, మొక్క జొన్న లేదా అవిసె ఒక రెండు వరసలు సాగు చెయ్యాలి, ఈ మొక్కలు రసం పీల్చు పురుగులను నియంత్రిస్తాయి. పురుగులు ఉదృతి ఎక్కువగా ఉన్న చోట్ల ఎసిఫేట్ 2.5 గ్రాములు, వేప నూనె 2.5 మిల్లి లీటర్లు, జిగురు 0.5 మిల్లి లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. వ్యాధి వ్యాపించిన మొక్కలను తొలగించి వాటిని పూడ్చిపెట్టడం లేదా కాల్చేయాలి, లేదంటే మిగిలిన, మొక్కలకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

Share your comments

Subscribe Magazine