Kheti Badi

విత్తన నిల్వలో పాటించవలసిన జాగ్రత్తలు

KJ Staff
KJ Staff

ఆరోగ్యకరమైన పంట మరియు అధిక దిగుబడి పొందడం కోసం మేలైన విత్తన రకాన్ని ఎంచుకోవడం చాల కీలకం. విత్తనంలో ఏమైనా చీడపీడలు ఉంటే అవి పంట సమయంలో భారినష్టాన్ని మిగులుస్తాయి. సాధారణంగా రైతులు విత్తన కేంద్రాల నుండి లేదంటే కంపెనీల నుండి విత్తనాలను కొనుగోలు చేస్తారు. అయితే కొంత మంది రైతులు మాత్రం మునపటి పంట విత్తనాలను తిరిగి మల్లి వినియోగిస్తూ ఉంటారు. ఇటివంటి వారు విత్తనాలను నిల్వచేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి, లేకుంటే విత్తనాలు కీటకాలు మరియు శిలింద్రాలు ఆశించి, విత్తనం నాణ్యత తగ్గేలా చేస్తాయి. ఇందుకోసం పాటించవలసిన చర్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే నిల్వచేసిన విత్తనాలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదా ఏమైనా చీడపీడల భారిన పడ్డాయో తరచు గమనిస్తూ ఉండాలి. రోగాల భారిన విత్తనాల మీద బూజు ఏర్పడటం, రంగుమారడం, మరియు విత్తనాలు ముద్దగా మారడం వంటి లక్షణాలను గమనించవచ్చు. ఇలా కనుక ఉంటె వెంటనే తగిన నివారణ చర్యలు పాటించాలి.

సాధారణంగా బాగా ఎండిన విత్తనాలను మాత్రమే నిల్వచెయ్యలి, తేమ ఎక్కువగా ఉండే విత్తనాలను నిల్వ చేసినట్లైతే అవి చీడపీడల భారిన పడే అవకాశం ఉంటుంది. అయితే ప్రతీ పంటకు నిర్ధిష్టపరిమాణంలో తేమ శాతం నిర్దేశించబడింది. సాధారణంగా నిల్వచేసే సమయంలో ధాన్యం పంటలకు 12-13 శాతం నూనెగింజలకు 7-8శాతం మరియు అపరాల పంటలకు 8-10 శాతం తేమ శాతం అవసరం. పంట నూర్పిడి సమయంలో గింజల మీద పగుళ్లు రావడం, పంట అవశేషాలు రాకుండ జాగ్రత్త వహించాలి, పంట అవశేషాల్లో ఉండే సిలింద్రాలు లేదా పురుగుల గుడ్లు విత్తనాలకు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది.

పంటకు నష్టం కలిగించే పురుగుల్లో సీతాకోకజాతికి చెందినవి మరియు పెంకు పురుగులు ప్రధానమైనవి. సీతాకోకజాతికి చెందిన పురుగులు, సంచుల్లోనూ మరియు విత్తనాలపైనా గుడ్లు పెడతాయి, ఆ గుడ్లు పొదిగి, వాటినుండి వచ్చిన లార్వా గింజలను తిని నాశనం చేస్తాయి, వీటి అవశేషాలు మరియు మలం విత్తనాలపై ఉండటం మూలాన వాసనా వస్తుంది. మరియు పెంకుపురుగుల్లో తల్లి పురుగులు మరియు లార్వాలు రెండు విత్తనాలను ఆశించి నష్టం కలిగిస్తాయి. వీటిని నివారించడానికి, విత్తనం నిల్వ చేసే సంచులను మలాతిన్ ద్రావణంలో ముంచి ఎండబెట్టినవి వాడాలి, నిల్వచేసే సంచుల మీద మరియు గదిలో వేపనూనెను పిచికారీ చెయ్యాలి.

విత్తనాలను నిల్వ చేసే గోదామును కూడా శుభ్రంగా ఉండేలా జాగ్రత్ పాటించాలి. సంచులను నిల్వచేసే సమయంలో తేమ చేరకుండా, నెలకు ఎత్తులో ఉండే విధంగా నిల్వచెయ్యలి. ఇందుకోసం వెదురు కర్రలను లేదా ఇనుప స్టాండ్లను వాడవలసి ఉంటుంది. ఈ విధమైన రక్షణ చర్యలు పాటించడం వలన విత్తనాలను పురుగుల నుండి మరియు శిలింద్రాల నుండి కాపాడుకోవాల్సి ఉంటుంది.

Share your comments

Subscribe Magazine