Kheti Badi

వరిపంటను ప్రధానంగా వేదించే కలుపు నివారణ చర్యలు

KJ Staff
KJ Staff

భారతీయులకు వరి ప్రధాన ఆహరం. దేశంలోని అత్యధిక భూభాగంలో సాగు చేయబడే పంటగా వరి ప్రాధాన్యత సంతరించుకుంది. వరి సాగుచేస్తున్న ప్రధానంగా ఎదుర్కునే సమస్య కలుపు. పంటను పట్టిపీడించే చీడపీడలతో పాటు, కలుపు ప్రధాన సమస్యగా మారి వరి సాగులో నష్టాన్ని కలిగిస్తుంది. వరి సాగుకు ప్రతిబంధకంగా మారి సమస్య కలిగించే కులపు గురించి మరియు వాటి నివారణ పద్దతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఊదర గడ్డి:

దీనినే బర్న్యార్డ్ గ్రాస్ అని కూడా పిలుస్తారు. ఈ గడ్డి సుమారు రెండు మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది. ఏది ఏకవార్షికా గడ్డి జాతిమొక్క, దీని కాండం సన్నగా ఉంది ఆకులు చిన్నవిగా మరియు వెడల్పుగా ఉంటాయి. కాండం చివరిలో భాగంలో గింజలు గుంపుగా దగ్గర దగ్గరగా ఉంటాయి.

నివారణ చర్యలు:

మొక్కలు నాటిన 25- 30 రోజుల సమయంలో వీటి ఉదృతి ఎక్కువుగా ఉంటుంది. వీటి ఉదృతి ఎక్కువుగా ఉంటే మొక్కకు అందవలసిన నీరు మరియు పోషకాలు సర్రిగా అందక దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఎక్కువ, కనుక వీలైనంత వరకు వీటిని చేతితో నివారనిచడానికి ప్రయత్నించాలి. కలుపు ఉదృతి ఎక్కువుగా ఉంటె బ్యూటక్లోర్ 50% 1.5 నుండి 2 లీటర్ల నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. తుంగ వెడల్పాటి ఆకు దశలో ఉన్నపుడు ఆక్సాడయార్టిల్ 80% 35-45 గ్రాముల పొడి మందును 500 మిల్లి లీటర్ల నీటిలో కలిపి తయారు చేసిన ద్రావణాన్ని 20 కేజీల పొడి ఇసుకలో కలిపి పొలం మొత్తం వెదజల్లాలి. వీటితో పాటు 400 గ్రాముల 2,4-డి సోడియం సాల్ట్ 80% పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే ఊదర గడ్డిని సమర్ధవంతంగా నియంత్రించవచ్చు.


పసుపు తుంగ:

పసుపు తుంగ లేదా తుంగ వరిలో వచ్చే దీనినే ఎల్లోసెడ్జ్ అని కూడా పిలుస్తారు. వరిసాగు చేసే రైతులకు తుంగ ప్రధానమైన సమస్య, ఇది గడ్డి జాతికి చెందిన కలుపుమొక్క గనుక నివారణ కాస్త కఠినతరంగా ఉంటుంది. తుంగ మొక్క 20-60 సెంటీమీటర్ల ఎత్తు పెరిగి, కాండం త్రికోణకారంలో ఉంటుంది. కాండం అడుగున పల్చని పేపర్ లాగా ఆకు తొడుగు ఉండటం మరియు సూది వంటి ఆకృతి కలిగివుండటం దీని ప్రత్యేకత.

నివారణ చర్యలు:

తుంగ గడ్డి వార్షిక గడ్డి జాతి మొక్కగా పరిగణించబడుతుంది. వరి ఎదిగే దశలో ఈ కలుపు ఎక్కువుగా కనిపిస్తుంది. దీని నివారణకు విత్తిన 5-10 రోజుల మధ్యలో బెంతియకార్బ్ 50%, రెండు లీటర్ల నీటిలో కలిపి కలుపు మొక్కలపై పిచికారీ చెయ్యాలి. దీనితో పాటు బ్యూటక్లోర్ 50% ఒక లీటర్ నీటికి కలిపి కలుపు మొక్కలపై పిచికారీ చెయ్యాలి. కలుపు మందులను నీటితో కాకుండా ఇసుకతో కలిపి ఉపయోగించే రైతులు ప్రీటిల్లాక్లోర్ 50% 500 మిల్లి లీటర్లు, బెంతియోకార్బ్ 50% 1.5 లీటర్లు ఒక ఎకరానికి 25 కేజీల ఇసుకలో కలిపి పొలం మొత్తం పల్చని పై పొరల చల్లుకోవాలి. నీటిని సమానంగా అందిస్తూ మందు మొత్తం పొలంలోకి ఇంకేలా చూడాలి.

జమ్మ గడ్డి:

జమ్మ గడ్డి లేదా గుంజర గడ్డిగా పిలవబడే ఈ గడ్డి వరి సాగులో ప్రతిబంధకంగా నిలుస్తుంది. దీనినే నట్ గ్రాస్ లేదా సైప్రస్ రోటెన్డస్ అని కూడా పిలుస్తారు. దీని నియంత్రణ మిగిలి గడ్డి జాతి కలుపుతో పోలిస్తే కాస్త కష్ట తరంగ ఉంటుంది. ఈ గడ్డి భూమిలో దుంపలు ఏర్పరచి మొక్కలను నివారించిన సరే తిరిగి మల్లి వస్తుంది. దీనిని బహువార్షికా గుడ్డిగా పరిగణిస్తారు. ఈ మొక్క 15-20 సెంటీమీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది. దీని ఆకులు ముళ్లవంటి ఆకులు కలిగి ఉంటుంది.

నివారణ చర్యలు:

జమ్మూ గడ్డి భీమిలోని దుంపల ద్వారా విస్తరిస్తుంది, కనుక వీటి మొక్కలతో పాటు దుంపలను కూడా నాశనం చెయ్యాలి. వేసవిలో మట్టిని గుంటతో సాగు చెయ్యడం ద్వారా భూమి అడుగున ఉన్న దుంపలు బయటకు వచ్చి ఎండ వేడికి మరణిస్తాయి. నారుమడిలో జమ్మ గడ్డి నివారణకు బెంతియోకార్బ్ 50% 1.5 లేదా 2.0 లీటర్లు నీటికి లేదా 20 కేజీల పొడి ఇసుకకు కలిపి పిచికారీ చెయ్యాలి.

Share your comments

Subscribe Magazine