Kheti Badi

ఎలుకల బెడద నుంచి పంటను కాపాడటం ఎలా?

KJ Staff
KJ Staff
rats crops
rats crops

పంట పోలాల్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇవి పంటను నాశనం చేస్తాయి. పంట ఉత్పత్తిని కాజేస్తాయి. వరి లాంటి ధ్యానాల పంటల్లో ఎలుకల బెడద రైతులను వేధిస్తూ ఉంటుంది. ఈ ఎలుకల బెడద నుంచి పంటను కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారింది. ఎలుకలను చంపేసినా మళ్లీ మళ్లీ కొత్తవి వస్తూ ఉంటాయి. ఎలుకల వల్ల రైతుల పంటకు తీవ్ర నష్టం జరుగుతూ ఉంటుంది. మరి ఎలుకలను నివారించడం ఎలా.. పాటించాల్సిన పద్దతులు ఏంటీ అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

తొలి రోజు

ఎలుకల కన్నాలను గుర్తించి మట్టితో మూసివేయాలి.

రెండోరోజు ఎలుకల కన్నాలలో బ్రోమోడయోలోన్ మందు, వరి నూక, వంట నూనె కలిపిన ఎరను కన్నానకి 10 గ్రా చొప్పున పెట్టాలి.

7వ రోజు మళ్లీ బ్రోమోడయోలోన్ మందుతో కూడినటువంటి ఎరను కన్నానికి 10గ్రా చొప్పున పెట్టాలి.

ఇక ఎలుకలను చంపడానికి ప్రభుత్వం ఉచ్చులను, విషపు బిళ్లలను రైతులకు సరఫరా చేస్తుంది. ఎరుకల మందును పోలంలో, గట్ల మీద పెట్టడం ద్వారా వాటిని తిని ఎలుకలు చచ్చిపోతాయి. ఎలుకల మందును జొన్న లేదా సజ్జ పిండితో కలిపి ఒక ప్లాస్టిక్ కవర్ లో ఉంచి చెట్టు మీద పెడతారు. ఎలుకలు వాటిని తినడం వల్ల చచ్చిపోతాయి. వేయించిన వేరుశనగ పప్పు పొడి, నువ్వులు, ధనియాలు, ఎలుకలమందు మిశ్రమాన్ని బట్టతో ఒక చిన్న మూట కట్టి, చెట్టుపై ఉంచుతారు. వీటిని తినడం వల్ల ఎలుకలు మరణిస్తాయి.

ఇక ఎలుకలను నివారించడానికి ప్రత్యేకమైన బోన్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ బోనులో కొబ్బరి ముక్కను పెడతారు. వాటిని తినడానికి ఎలుకలు వచ్చి బోనులోనే చచ్చిపోతాయి. ఈ బోనుద్వారా 3-4 ఎలుకలను పట్టి, చంపవచ్చు. ఈ బోను ఖరీదు రూ.40 వరకు ఉంటుంది. ఇక బొరియల్లో పొగబెట్టడం వల్ల వేడికి తగ్గుకోలేక ఎలుకవలు చనిపోతాయి. ఎలుకల్లో మూడు జాతులు ఉన్నాయి. పందికొక్కు, చిన్న పందికొక్కు, ఇళ్లలో తిరిగే ఎలుకలు. ఇవన్నీ పంటను నాశనం చేసేవే. ఎలుకల మందు పెట్టడానికి ఎకరానికి రూ.250, బుట్టల్లో పడిన ఒక్కో ఎలుకకు రూ.20 చొప్పున ఖర్చు అవుతుంది. మొత్తమ్మీద వీటి నివారణకు ఎకరాకు రూ.1500 వరకు భారం పడుతోంది

Related Topics

Rats, Crop

Share your comments

Subscribe Magazine