Kheti Badi

అడవి పందుల నుంచి పంటను రక్షించుకోవడం ఎలా?

KJ Staff
KJ Staff
forest dog
forest dog

పంట సాగు అంటే మాములు విషయం కాదు.. పంట వేసిన దగ్గర నుంచి చేతికొచ్చేంతవరకు చాలా కష్టపడాల్సి వస్తుంది. అధిక పెట్టుబడితో పాటు కూలీలు దొరక్క ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇక తెగులు, చీడపురుగులు, ఎలుకల నుంచి పంటను కాపాడుకోవాల్సి ఉంటుంది. దీనికి తొడు అడవి పందుల బెడద కూడా ఉంటుంది. అడవి పందులు పోలంలోకి వచ్చి పంట మొత్తాన్ని చెల్లాచెదురు చేస్తాయి. దీని వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. అడవి పందులు చొరబడి పంటను నాశనం చేయడం వల్ల రైతు కష్టం వృధా అవుతుంది.

అయితే అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు పోలం చుట్టూ కంచె వేసి కరెంట్ తీగలు పెడుతూ ఉంటారు. దీని వల్ల కరెంట్ షాక్ కు పందులు చనిపోతూ ఉంటాయి. అయితే దీని వల్ల రాత్రి వేళల్లో మిగతా రైతులు కరెంట్ తీగలు వేసిన పోలం వైపు వెళ్లి అనుకోకుండా షాక్ కు గురై ప్రమాదానికి గురై అవకాశముంది. దీంతో పోలానికి కరెంట్ తీగ వేయడం అనేది పాతకాలం పద్దతి. ఇప్పడు అనేక ఆధునిక పద్దతులు పందుల బెడదకు చెక్ పెట్టడానికి అందుబాటులోకి వచ్చాయి. వాటిని రైతులు ఫాలో అయి అడవి పందుల నుంచి పంటను రక్షించుకోవచ్చు.

కందకం ఏర్పాటు

పొలం చుట్టూ రెండు అడుగులు వెడల్పు, ఒకటిన్నర అడుగుల లోతులో కందకాన్ని తవ్వాలి. దీని వల్ల పోలంలోకి పందులు రాకుండా నివారించవచ్చు.

రసాయనిక పద్దతులు


-ఫోరేట్ గుళికలను ఇసుకలో కలిపి చిన్న చిన్న సంచుల్లో కట్టి పోలం చుట్టూ అక్కడక్కడ కర్రలను పాతి సంచులను వేలాడదీయాలి. గాలికి ఫోరేట్ గుళికలు ఘాటు వాసనను వెదజల్లుతాయి. దీని వల్ల ఆ వాసన దెబ్బకు పందులు పోలం దగ్గరికి రావు.

-ఇక కుళ్లిన కోడిగుడ్ల ద్రావణాన్ని నీటికి కలిపి పోలం చుట్టూ చల్లాలి. దీని వాసన వల్ల పంట వాసనను గుర్తించలేక పందులు వెళ్లిపోతాయి.

-ఇక కిరోసిన్ లో ముంచిన నవారును పొలం చుట్టూ కడితే ఆ ఘాటు వాసనకు పందులు పారిపోతాయి.

-గోధుమ పిండిలో ఉల్లిపాయ, వెల్లుల్లిని మెత్తగా కలిపి పొలం చుట్టూ పెట్టాలి. వీటిని పందులు తినడం అలవాటు చేసుకుంటాయి. ఆ తర్వాత సోడియం మోనో ఫ్లోరో ఎసిటేట్ లేదా వార్‌ఫెరిన్ కలిపిన ఉండలను పెట్టాలి. వాటిని తిన్న పందులు అజీర్ణానికి లోనై వెళ్లిపోతాయి.

-క్షౌరశాలలో దొరికే వ్యర్థ వెంట్రుకలను సేకరించి పంట పొలం గట్లపై ఒక అడుగు వెడల్పులో చల్లాలి. పందుల ముక్కులోకి వెంట్రుకలు వెళ్లి శ్వాస ఆడదు. దీంతో పోలంలోకి రాకుండా వెళ్లిపోతాయి. వీటితోపాటు ఊరపందుల పెంటను పొలం చుట్టూ చల్లితే ఆ వాసనకు పందులు పోలం దగ్గరకు రావు. అలాగే వేటకుక్కలతో పందులను తరమడం, టపాసులు పేల్చడం వంటి వాటి ద్వారా అడవి పందుల బారి నుంచి పంటలు కాపాడుకోవచ్చు.

-ఒక రకమైన పంట పొలాన్ని కాపాడుకోవాలంటే దాని చుట్టూ నాలుగు వరసల్లో మరో పంట వేయాలి. వేరుశనగ పంట చుట్టూ నాలుగు వరుసల్లో కుసుమ పంటను వేయాలి. దీని వల్ల ఆ మొక్కకు ఉన్న ముళ్లు వల్ల పందులు పోలం లోపలికి రావు. అలాగే కుసుమ మొక్క వాసన, వేరుశనగ మొక్క వాసన కన్నా ఘాటుగా ఉండడం వల్ల పందులు వేరుశనగ మొక్కను గుర్తించలేకపోతాయి. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి కూడా పంటను రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లను కలిగి ఉండే ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పందుల బెడద నుంచి పంటను సులువుగా కాపాడుకోవచ్చు. ఇలా పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.

Related Topics

Forest dog, Formers, Crop

Share your comments

Subscribe Magazine