మొక్కలు చాలా సున్నితమైనవి. అందంగా ఉన్నాయి కదా అని పూలను మొక్క నుంచి వేరు చేస్తే అవి ఎక్కువ కాలం జీవించలేవు. నీటిని వాటి గుండా ప్రసరించే గుణాన్ని కూడా అవి కోల్పోతాయి.
అందుకే మొక్కల నుంచి కట్ చేసిన తర్వాత పూలు ఎక్కువ కాలం ఉండవు. మరి, వాటిని ఎక్కువ కాలం పాటు ఫ్రెష్ గా ఉంచాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ చిట్కాలను పాటిస్తూ వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచుకునే ప్రయత్నం చేయండి.
1. సరైన వేజ్ (కుండీ) ఎంచుకోవడం..
మీ దగ్గర ఉన్న పూలన్నింటికీ సరిపోయేలా మీ ఫ్లవర్ వేజ్ ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ పూలు ఉంటే పెద్ద ఫ్లవర్ వేజ్ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల పూలన్నింటికీ సరిపడా స్థలం దొరుకుతుంది. ఒకటి, రెండు పూలు మాత్రమే ఉంటే సన్నని వేజ్ ఎంచుకుంటే బాగుంటుంది. పూలను పెట్టే ముందు వేజ్ ని వేడి నీటితో కడిగేసి ఆరబెట్టాలి. ఆ తర్వాత పూలు అమర్చుకోవాలి. ఇది ఒకవేళ వేజ్ లో ఏదైనా సూక్ష్మ జీవులు ఉంటే వాటిని తొలగిస్తుంది.
2. వేజ్ లో నీటిని నింపడం..
చాలామంది పూలు ఎక్కువ కాలం నిలిచి ఉండాలని డిస్టిల్ వాటర్ వాడతారు. కానీ వీటికి సాధారణ నీళ్లే మంచివని నిపుణులు చెబుతారు. గోరు వెచ్చని నీటిని ఉపయోగించాలి. ఒకవేళ మొక్కల కాండం సన్నగా ఉంటే సగానికి మాత్రమే నీటిని నింపాలి. నీటిని నింపేటప్పుడు బుడగలు వస్తే వాటిని తొలగించే వరకు ఆగాలి. ఆ తర్వాతే పూలను ఉంచాలి. బుడగలు ఉన్నప్పుడే పెడితే అవి కాండంలోకి నీళ్లు వెల్లకుండా అడ్డుకుంటాయి.
3. కొమ్మ నుంచి ఆకులను తెంపివేయడం
కొమ్మ అంచుల దగ్గర ఆకులు లేకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. నీటిలో మునిగి ఉండే కాడలకు ఆకులు ఉంటే అవి మురిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఆకులతో పాటు కొమ్మలు కూడా మురిగిపోతాయి. ఇది నీటిలో బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగేలా చేస్తుంది. అందుకే ఆకులు తొలగించి వేజ్ లో పెట్టాలి.
4. కొమ్మలను సరిగ్గా కట్ చేయడం.
కొమ్మలు నీటిలో ఉంచే ముందు అలాగే ఉంచకుండా ఒక ఇంచు లేదా రెండు ఇంచుల మేర కింద భాగం కత్తిరించి ఉంచాలి. ఈ కటింగ్ కూడా అడ్డంగా కాదు.. వంకరగా కట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల నీళ్లు ఎక్కువగా అందే వీలుంటుంది. ఇలా చేయడం వల్ల పూల అరేంజ్ మెంట్ లో కూడా ఉపయోగపడుతుంది. కట్ చేసిన తర్వాత ఒకేసారి అన్ని కాండాలను నీళ్లలో ఉంచాలి.
5. ఫ్లవర్ ఫుడ్ ని కలపడం
ఫ్లవర్ ఫుడ్ ని కలపడం అత్యవసరం కాకపోయినా ఎక్కువ రోజుల పాటు ఉంచాలంటే దీన్ని ఉపయోగించడం మంచిది. దీనికోసం కావాల్సినవి
టేబుల్ స్పూన్ చక్కెర
రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం
అర టీ స్పూన్ బ్లీచ్
పావు వంతు వేడి నీరు
ఇవన్నీ కలిపి కాస్త చల్లారిన తర్వాత వేజ్ లో పోసుకోవాలి. ఇందులోని చక్కెర పూలను తాజాగా ఉంచుతుంది. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ నీటి పీహెచ్ మెయిన్ టెయిన్ చేస్తుంది. బ్లీచ్ బ్యాక్టీరియా, ఫంగస్ ని పెరగకుండా చేస్తుంది. ఈ ఫుడ్ పూలను ఆరోగ్యంగా, బ్యాలన్స్డ్ గా ఉంచుతుంది. ఎలాంటి వ్యాధులు రాకుండా చేస్తుంది.
6. నీళ్లను మారుస్తూ ఉండడం.
వేజ్ లో నీళ్లు రెగ్యులర్ గా మారుస్తూ ఉండాలి. నీళ్లు క్లౌడీగా మారితే బ్యాక్టీరియా పెరుగుతుందని అర్థం. అందుకే వెంటనే నీళ్లను మార్చాలి. ఫ్లవర్ ఫుడ్ వేస్తుంటే మీ వేజ్ లోని నీటిని మూడు నుంచి నాలుగు రోజుల కోసారి మారుస్తుండాలి. ఒకవేళ ఫ్లవర్ ఫుడ్ వాడకపోతే వేజ్ లో నీళ్లు రోజూ మార్చుతూ ఉండాలి.
7. సరైన ప్రదేశంలో పూలను ఉంచడం
పూలు పెట్టే లొకేషన్ కూడా చాలా ముఖ్యం. దీనివల్లనే పూలు ఎంత కాలం జీవించి ఉంటాయన్న విషయం ఆధారపడి ఉంటుంది. చాలా తక్కువ వేడి, గాలి, సూర్య రశ్మి వచ్చేలా ఉన్న ప్రదేశంలో ఉంచాలి. వేడి ఎక్కువగా ఉంటే నీళ్లు ఎక్కువగా పీల్చుకుంటాయి. ముఖ్యంగా డైసీ ఫ్లవర్స్ నీటిని ఎక్కువగా పీల్చుకున్నా తొందరగా వాడిపోతాయి. అలాగే పండ్లను వీటికి దగ్గరగా ఉంచకూడదు. అవి ఇథలిన్ గ్యాస్ ని విడుదల చేస్తాయి. దానివల్ల పూలు తొందరగా వాడిపోతాయి.
8. వాడిన పూలను, రేకులను తీసేయడం
పూలు లేదా పూల రేకులు ఎండిపోవడం లేదా వాడిపోవడం వంటివి చేస్తే వెంటనే వాటిని తొలగించాలి. వాడిపోయిన పూలు కూడా ఇథలిన్ గ్యాస్ ని విడుదల చేస్తాయి. అందుకే పక్కనున్న పూలు కూడా వేగంగా పాడైపోతాయి.
9. కొమ్మలను మళ్లీ కట్ చేయడం
కొమ్మలు కొన్ని రోజులు నీటిలో ఉంచిన తర్వాత మరోసారి మరో అంగుళం మేర వాటిని కట్ చేయాల్సి ఉంటుంది. మీరు నీటిని రోజూ మార్చితే మూడు నుంచి నాలుగు రోజుల కోసారి ట్రిమ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నీళ్లు మరింత బాగా తీసుకునే వీలుంటుంది.
https://krishijagran.com/featured/importance-and-scope-of-commercial-floriculture/
https://krishijagran.com/agripedia/a-guide-how-to-have-healthy-rose-plantation/
Share your comments