సాధారణంగా గుడ్లను, ఉడకపెట్టకో, లేదా ఆమ్లెట్ వేసాకో మిగిలే గుడ్డు పెంకులను మనం బయట పడేస్తాం. గుడ్డు పెంకుల నుండి వచ్చే దుర్వాసన వాళ్ళ వీటిని నిల్వ చెయ్యరు. కానీ ఇంటి దగ్గరే కూరగాయలు, ఆకుకూరలు పెంచుకునే హోమ్ గార్డెనేర్స్ కి మాత్రం గుడ్డు పెంకులు బంగారంతో సమానం. గుడ్డు పెంకుల వల్ల మొక్కలకు కలిగే ఉపయోగాలు ఏమిటో చుడండి.
గుడ్డు పెంకుల్లో కాల్షియమ్ అధికంగా ఉంటుంది. మొక్కల్లో రోగనిరోధక శక్తిని పెంపొందిచడంలో కాల్షియమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పురుగుల నుండి మరియు శిలింద్రాల నుండి మొక్కలకు రక్షణ కల్పించడంలో కాల్షియమ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాల్షియమ్ మొక్క కణం యూక పై పొర(దీనినే ఇంగ్లీష్ లో సెల్ వాల్ అంటారు), ఈ సెల్ వాల్ తయారీకి కాల్షియమ్-పెక్టటే అవసరం. అలాగే పురుగులు తినిడం వల్ల పాడైన మొక్క భాగాలను తిరిగి పునరుద్ధరించడంలో కాల్షియమ్ తన వంతు సాయాన్ని అందిస్తుంది.
Read More:
అదనపు లాభాలు తెచ్చిపెట్టే పెసరు పంట:
గుడ్డు పెంకులను ఏ విధంగా వాడాలి:
గుడ్డు పెంకుల మొక్కలకు వాడే ముందు నీటిలో ఉడకబెట్టడం చాల మంచింది. నీటిలో ఉడక బెట్టడం ద్వారా ఎటువంటి మలినాలు ఉన్న నాశనం అవుతాయి. గుడ్డు పెంకులను ముక్కలు చేసి కానీ లేదా పొడి చేసి కానీ మొక్కలకు వాడవచ్చు. గుడ్డు పెంకులను ముక్కలుగా చేసి మొక్క చుట్టూ చల్లడం ద్వారా మట్టిలోని పురుగులను మొక్కల దగ్గరకు చేరనియ్యకుండా ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది, కాలక్రమేణా గుడ్డు పెంకులోని కాల్షియమ్ మట్టిలోకి కలుస్తుంది. అలాగే పొడిగా చేసి మొక్కలకు అందించడం ద్వారా పెంకులోని కాల్షియమ్ మట్టిలో తొంగరగా కలిసి మొక్కకు అందుతుంది. కానీ గుడ్డు పెంకులోని కాల్షియమ్ మట్టిలోని క్షారాన్ని పెంచుతుంది. క్షార నేలలు మొక్కల పెంపకానికి అనువుగా ఉండవు కాబట్టి, మట్టిలో ఆమ్ల శాతాన్ని బట్టి గుడ్డు పెంకులను వాడవలసి ఉంటుంది.
గుడ్డు పెంకులతో పాటు, వాడకార్చిన తర్వాత మిగిలిన టీ పొడి, ఉల్లిపాయల మీద పై పోరా, మరియు కూరగాయల తుక్కు ఇలా వంట గది నుండి వచ్చే వ్యర్ధాని మొక్కలకు అవసరమయ్యే ఎరువులుగా మార్చుకోవచ్చు, వీటిని ఉపయోగించడం వాళ్ళ మొక్కలకు మరియు మట్టికి ఎటువంటి కీడు ఉండదు పైగా మంచి ఆరోగ్యకరమైన కాయగూరలు కుటుంబం కోసం పండించవచ్చు.
Share your comments