Kheti Badi

దోసకాయలో వచ్చే మోజాయిక్ తెగులు-నివారణ చర్యలు

KJ Staff
KJ Staff
Mosaic Virus Diseases
Mosaic Virus Diseases

దోసకాయ సాగులో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలో పంట తెగుళ్ల బారిన పడటం ఒకటి.  మోజాయిక్ తెగులు ‘మోజాయిక్ వైరస్’ (సీఎంవీ) వల్ల వస్తుంది. ఇది ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తిచెందుతుంది.  ఇలా పంట మొత్తం వ్యాపించి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ ను దాదాపు 80 నుంచి 100 వరకు వేరువేరు జాతులకు చెందిన అనేక రకాల కీటకాలు, జీవులు ప్రసార కారకాలుగా ఉంటాయి. కాబట్టి మోజాయిక్ తెలుగు తక్కువ కాలంలోనే ఎక్కువ మొత్తంలో పంటపై ప్రభావం చూపుతుంది.  మోజాయిక్ వైరస్ దీర్ఘకాలం పాటు పంట శిథిలాలు, పరికరాలు, పనిముట్లపై జీవించి ఉంటుంది. కాబట్టి పంట కలుపు, ఇతర పనుల కోసం ఉపయోగించిన పనిముట్లను కీటక నివారణ రసాయనాలతో శుభ్రం చేసుకోకుండా వాడితే కూడా  ఈ తెగులు సోకే అవకాశం అధికంగా ఉంటుంది.

దోసకాయలో మోజాయిక్ తెగులు లక్షణాలు: పంట శిథిలాలు, పనిముట్లపై వైరస్ చాలా కాలం జీవించి వుంటుంది. కాబట్టి పంట వేసిన దశనుంచే మోజాయిక్ వైరస్ ప్రభావం ఉంటుంది. వైరస్ ఉన్నప్పటికీ లక్షణాలు ఒక్కోసారి కనిపించకపోవచ్చునని వ్యవసాయ పరిశోధకులు, నిపుణులు చెబుతున్నారు. మొక్కల్లో ఈ తెగులు లక్షణాలు పంట సాగు చేస్తున్న పొలం, వాతావరణ పరిస్థితులు, మొక్క రకాలను బట్టి భిన్నంగా ఉంటాయి. సాధారణంగా దోసకాయ పంట ఆకులు, కాయలు, తీగలుపై పసుపు పచ్చ, లేదా ముదురు ఆకు పచ్చ మచ్చలు ఏర్పడతాయి. లేత ఆకులు ముడుచుకుపోయి.. కుచించుకుపోయినట్టు కనిపిస్తాయి. పూల మీద కూడా వివిధ రకాలుగా చారలు ఏర్పడటంతో పాటు వాడిపోతుంటాయి. కాయలు సైతం నిగారింపును కోల్పోయి.. అక్కడక్కడ మచ్చలు ఏర్పడి ఉబ్బినట్టుగా మారిపోతాయి.

అయితే, ఈ తెగులును ముందుగానే నివారించే పూర్తి స్థాయి రసాయనాలు అందుబాటులో లేవు. కానీ కొన్ని రక్షణ చర్యలు, కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాలు అవలంభించాలి. ఈ వైరస్ వ్యాప్తికి కారణమైన వివిధ క్రిమికీటకాలను నివారించడానికి రసాయన మందులు పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా  తెగులును నిరోధించడానికి సైపెర్ మైథ్రిన్ లేదా క్లోరోఫైరిఫాస్ లతో కూడిన రసాయన సమ్మేళన మందులు వాడటం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.  పంట వేసే ముందు నేలపై అమ్మోనియం ద్రావణం చల్లటం వల్ల కూడా ఈ తెగులు రాకుండా ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. విత్తనాలు ఎంపిక కూడా కీలకం.

Share your comments

Subscribe Magazine