Kheti Badi

ఉల్లి పంట సాగు విధానం.. పాటించాల్సిన యాజమాన్య పద్దతులు

KJ Staff
KJ Staff

ఉల్లి.. రోజూ ఇంట్లో ఉపయోగించే నిత్యావసర సరుకు. ఉల్లి లేనిది వంటింట్లో ఏ పని జరగదు. ఏ కూర వండాలన్నా ఉల్లిపాయ అనేది తప్పనిసరి. ఉల్లి లేకపోతే ఏ వంట చేసినా టెస్ట్ అనిపించదు. ఉల్లి లేకుండా ఏదీ వండలేము. ఏ కూర వండలన్నా ఉల్లిపాయ వేయాల్సిందే. దీంతో ఉల్లిపాయ అనేది నిత్యావసర సరుకుగా మారిపోయింది. డిమాండ్ దృష్ట్యా ఉల్లిపాయల ధరలు కూడా పెరుగుతున్నాయి.

ఇక ఉల్లిపాయలు కూరలో వేయాలంటే పండించే రైతు కావాలి. ఇంతకు ఉల్లి ఎలా పండిస్తారు. సాగులో పాటించాల్సిన మెళకువలు ఏంటి.. ఎలాంటి సమగ్ర విధానం పాటించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఖరీఫ్ సీజన్‌లో ఎక్కువగా ఈ పంటను పండిస్తారు. జూన్ లేదా జులై నుంచి మొదలుపెట్టి నవంబర్ వరకు పండిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాంతాల్లో ఉల్లిని పండిస్తారు. దేశంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉల్లి పండుతుంది. కర్నూలు జిల్లాలో ఉల్లిని ఎక్కువగా పండిస్తారు. ఇక్కడి నుంచి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు విదేశాలకు కూడా ఉల్లి వెళుతూ ఉంటుంది.

విత్తన సమయం

జూన్ లేదా జులైలో నాటాలి. వాతావరణంలో మార్పులు లేని ప్రాంతాల్లో ఉల్లి ఎక్కువ పండుతుంది.

ఎలాంటి నేలల్లో విత్తాలి

నీరు నిలువని, సౌరవంతమైన మెరక నేలలు ఉల్లి పంటకు అనుకూలం. ఉప్పు, చౌడు, క్షారత్వం, నీరు నిలువ ఉండే నేలలు దీనికి పనికిరావు.

రకాలు

బళ్లారిరెడ్‌, రాంపూర్‌రెడ్‌, వైట్‌ ఆనియన్‌, పూసారెడ్‌, అర్కనికేతన్‌, అర్కకళ్యాణ్‌, అర్కప్రగతి, కళ్యాణ్‌పూర్‌, రెడ్‌రౌండ్‌, ఎన్‌-53, అగ్రిఫౌండ్‌ లైట్‌రెడ్‌, అగ్రిఫౌండ్‌ డార్క్‌రెడ్‌, తెలుపు రకాలైన పూసావైట్‌ రౌండ్‌,పూసావైట్‌ఫ్లాట్‌

బళ్లారిరెడ్‌ రకం: పాయలు పెద్దగా ఉండి, పాయలు ఒకటిలేదా రెండుగా కలిపి ఉంటాయి. ఘాటు తక్కువగా ఉంటుంది. ఈ రకం మన రాష్ట్రంలో సాగు చేసేందుకు అన్ని ప్రాంతాల్లో అనువైనది.

రాంపూర్‌రెడ్‌ రకం: బళ్లారిరెడ్‌ రకం లాగే ఉంది ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ఈ రకాన్ని ఎక్కువగా పండిస్తారు. పాయలు పెద్దగా ఉండి ఘాటు ఎక్కువగా ఉంటుంది. దిగుబడి తక్కువగా ఉంటుంది. పాయలు తెల్లగా ఉంటాయి.

నాసిక్‌రెడ్‌ రకం: పాయలు మధ్యస్థంగా ఉండి, ఎరుపు రంగులో ఉంటాయి. ఈ రకం ఉల్లిపాయలు బాగా ఘాటుగా ఉంటాయి.

అగ్రిఫౌండ్‌ డార్క్‌రెడ్‌ రకం: పాయలు ముదురు ఎరుపు రంగులో గుండ్రంగా ఉంటాయి. ఘాటుగా ఉంటాయి. ఈ రకం ఉల్లిపాయలను ఎక్కువ రోజులు నిల్వ చేయవచ్చు. ఇవి ఖరీఫ్‌లో నాటేందుకు అనువైన రకం.

అర్క కళ్యాణ్‌ రకం: ఇద కూడా ఖరీఫ్ లో నాటేందుకు అనువైన రకం. పాయల బరువు 100 నుంచి 190గ్రా వరకు ఉంటుంది. దిగుబడి 136 క్వింటాళ్లు వస్తుంది. ఆకుమచ్చ తెగులును ఈ రకం కొద్దిగా తట్టుకుంటుంది.

నారు పెంచడం ఎలా?

నేలను బాగా దున్ని 120 సె. మీ వెడల్పు, 3 మీ. పొడవు గల ఎత్తయిన నారుమళ్లను తయారు చేసుకోవాలి. ఆ తర్వాత 2 నుంచి 2.5 కిలోల విత్తనాన్ని 200 నుంచి 250 చ.మీల నారుమడిలో పెంచిన నారు ఒక ఎకరాలో నాటడానికి సరిపోతుంది. విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. 3గ్రా. కాప్టాన్‌ లేదా థైరమ్‌ ను కిలో విత్తనానికి నారుమడిలో పల్చగా వరుసల్లో పోయాలి. నారుకుళ్లు తెగులు సోకకుండా 10 రోజులకు ఒకసారి కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఇక నారు పెరుగుదల దశలో కార్బోప్యూరాన్‌ 3జి గుళికలు నారుమడిలో చల్లి నీరు కట్టాలి. దీని వల్ల పురుగుల సమస్య ఉండదు.

నారు నాటడం ఎలా?

పొలాన్ని రెండు,మూడు సార్లు దుక్కిదున్ని చదును చేయాలి. బోదెలు 30 సెం. మీ ఎడంలో చేసి బోదెకు రెండు వైపులా నారు నాటాలి.

కలుపు పడకుండా చేయడం ఎలా?

ప్లుక్లోరాలిన్‌ 45 శాతం ఎకరానికి ఒక లీటరు చొప్పున పిచికారి చేసి భూమిలో కలియదున్నాలి. లేదా పెండిమిథాలిన్‌ 30 శాతం ఎకరానికి 1.3 నుండి 1.6 లీ. లేదా ఆక్సీఫ్లోరోఫిన్‌ 23.5 శాతం 200 మి.లీ చొప్పున నాటే ముందు పిచికారీ చేయాలి. నాటిన 30 నుంచి 45 రోజుల మధ్య కలుపు తీయాలి.

ఎరువులు

ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 60 నుంచి 80కి. నత్రజని, 24 నుంచి 32కి. భాస్వరం, 24కిలోల పోటాష్‌నిచ్చే ఎరువులను వేయాలి.

సాగునీరు ఎప్పుడు అందించాలి

నాటిన 60 రోజుల వరకు 12 నుంచి 15 రోజుల వ్యవధితో 4 నుంచి 5 తడులు ఇవ్వాలి. గడ్డ ఊరే దశలో 6 నుంచి 7 రోజుల వ్యవధితో 8 తడులు ఇవ్వాలి. కోతకు 15 రోజుల ముందుగా నీరు పెట్టడం ఆపేయాలి.

Share your comments

Subscribe Magazine