Kheti Badi

సోయాబీన్ సాగులో పాటించవలసిన యాజమాన్య పద్దతులు...

KJ Staff
KJ Staff

మాంసాహారం తినలేనివారికి, ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు అందించడంలో సోయాబీన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. తక్కువ శర్మ మరియు ఎక్కువ లాభాలు కలిగించే పంటల్లో సోయాబీన్ ఒకటి. సోయాబీన్ పంట లెగ్యుమ్ జాతికి చెందిన ,మొక్క కాబట్టి రైతులు దీనిని భూసారం పెంచే పంటగా కూడా సాగుచెయ్యవచ్చు. సాగు నీటి లభ్యత తక్కువుగా ఉన్న ప్రాంతాల్లో వర్షాధార పంటగా కూడా సొయా బీన్ సాగు చేపట్టవచ్చు.

రైతులు సోయాబీన్ సాగు చేసే తక్కువ శ్రమ మరియు తక్కువ సమయంలోనే మంచి నికర ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. దీనిని పప్పుజాతి మరియు నూనెజాతి పంటగాకూడా సాగు చెయ్యవచు. సొయాబీన్ నూనెలో కొవ్వు శాతం చాలా తక్కువుగా ఉంటుంది తద్వారా ఆరోగ్యానికి మంచిదని భావించి ప్రజలు ఈ నూనెను ఎక్కువుగా ఉపయోగించడం ప్రారంభించారు. నూనె తీసేయగా మిగిలిన పిండిలో 50-60 మాంశకృతులు ఉంటాయి, ఇందువల్ల దాణా పరిశ్రమల్లో ముడి సరుకుగా ఉపయోగిస్తారు.

ఖరీఫ్ సీజన్ సొయా బీన్ సాగుకు అనుకూలం. ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో సోయాబీన్ ఖరిఫ్ పంటగా సాగు చేస్తున్నారు. జూన్ మొదటి వారంలో కురిసిన తొలకరి జల్లులతో సోయాబీన్ సాగు చెయ్యడం ప్రారంభించారు. సొయా బీన్ విత్తనాన్ని జూన్ జులై నెలలు మొదల్కొని ఆగష్టు మరియు సెప్టెంబర్ వరకు విత్తుకునే వీలుంటుంది. దీని సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలమే సారవంతమైన నల్లరేగడి నేలల్లో సాగు లాభదాయకంగా ఉంటుంది. అయితే ఆమ్లా, క్షార నేలలు, నీరు నిలువ ఉండే మురుగు నేలలు సాగుకు అనుకూలించవు. ఖరీఫ్ సీజన్ లో సోయాబీన్ సాగుకు సన్నద్ధమైన రైతులు విత్తన ఎంపికలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ పాటించవలసి ఉంటుంది.

ఖరీఫ్ సాగుకు అనుకూలమైన మరియు చీడపీడలను సమగ్రవంతంగా తట్టుకునే మేలైన రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. విత్తనాలు కొనుగోలు చేసిన తరువాత పొలంలో నాటు ముందు తప్పకుండా విత్తన శుద్ధి చెయ్యాలి, దీని ద్వారా విత్తనాలోని సిలింద్ర బీజాలు తొలగిపోవడే కాకుండా మొక్క ఎదిగే సమయంలో రక్షణ కలిపించడానికి వీలుంటుంది. విత్తన శుద్ధి కొరకు క్యాప్టాన్ 2 గ్రాములు, లేదా థైరామ్ 2 గ్రాములు, లేదంటే కార్బోక్సిన్ థైరం 3 గ్రాములు ఒక కిలో విత్తనానికి బాగా పట్టించాలి. దీని తరువాత ఇమిడాక్లోరోఫిడ్ 1.5 మిల్లి లీటర్లు ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి, దీని వలన మొక్క ఎదిగే సమయంలో వచ్చే కాండం కుళ్ళు మరియు వేరు కుళ్ళు తెగులును సమగ్రవంతంగా నివారించుకోవచ్చు. ఒక ఎకరానికి దాదాపు 25-30 కేజీల విత్తనం సరిపోతుంది.

విత్తనాలు విత్తుకునే ముందు భూమిని బాగా దున్నుకోవాలి. సొయాబీన్ బోదెల పద్దతిలో నాటుకుంటారు, విత్తనానని 3-4 సెంటీమీటర్ల లోతులో మాత్రమే విత్తుకోవాలి. విత్తుకునే సమయంలో ప్రతి వరుసకు మధ్య 45సెంటీమీటర్ల దూరం మరియు ప్రతీ మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. మొక్క ఎదిగే సమయంలో కలుపు నివారణ చర్యలు చేపట్టాలి లేదంటే మొక్క ఎదుగుదల క్షిణిస్తుంది. విత్తిన 48 గంటల లోపల పెండిమిథాలిన్ 1 మి.లి ఒక లీటర్ నీటికి కలిపి పొలం మొత్తం పిచికారీ చెయ్యాలి, వెడల్పాటి ఆకులు కలిగిన మొక్కల నివారణకు ఇమాజిత్ ఫిర్ 1.5 మి.లి ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. సోయాబీన్ విత్తిన 25 రోజుల తరువాత మొక్కల్లో ప్రధానంగా కనిపించే సమస్య కాండం ఈగ దీనిని నివారించడానికి బీటాసీఫ్లోత్రిన్ మరియు ఇమిడాక్లోరోఫిడ్ మిశ్రమాన్ని 1.25 మి.లి ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి.

పంట పూత దశలో ఉన్నపుడు సిలిండర్ల బెడద ఎక్కువగా ఉంటుంది, ఈ దశలో పంటను కాపాడుకోలేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. సిలింద్రాలను కట్టడి చెయ్యడానికి ప్రోఫికోనోజోల్ లేదా టేబుకోనోజోల్ 1 మి.లి. ఒక;లీటర్ కలిపి పిచికారీ చెయ్యాలి. ఈ చర్యలు అన్ని పాటిస్తే పంటకు వచ్చే రోగాలు అన్నిటిని సమగ్రవంతంగా నియంత్రిస్తూ మంచి లాభాలు పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine