ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదంటారు, అందుకేనేమో భారతీయ వంటకాల్లో ఉల్లిపాయను ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆహార ప్రయోజనాలతోపాటు ఎన్నో ఔషధగుణాలు ఉల్లిపాయిలో ఉన్నాయి. ఉల్లిపాయను మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉండటంతో ఎంతో మంది రైతులు ఉల్లి సాగువైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఉల్లిని సాగు చేయాలనుకునే రైతులు ముందుగా నారుమడిని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. పంటకు పురుగులు మరియు తెగుళ్ల బెడద తగ్గాలంటే నారుమడిని పెంచే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది, అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిని అధికంగా పాందించే రాష్ట్రాలైన మహారాష్ట్ర మరియు గుజరాత్ తోపాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉల్లిని సాగు చేస్తున్నారు. ఉల్లి పంట ఖరీఫ్ మరియు రబి సీజన్లో సాగుచేయవచ్చు, ఖరీఫ్ పంట సాగుకు, జూన్- జులై నుండి, అక్టోబర్ నవంబర్ వరకు సాగుకు అనుకూలం. ఉల్లిసాగుకు తేలికపాటి ఇసుకనేలలు, సారవంతమైన మెరక నేలలు అనుకూలమైనవి. ఆమ్ల, క్షార, చౌడు, మరియు మురుగు నీరు నిలిచే నేలలు సాగుకు అనుకూలం కాదు. నీరు త్వరగా ఇంకిపోయే నేలల్లో ఉల్లి సాగు లాభదాయకంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఉల్లిని వేసవి పంటగా కూడా సాగుచేస్తారు, ఇందుకోసం జనవరి మరియు ఫిబ్రవరి మాసాల్లో పంటను నాటుకోవాల్సి ఉంటుంది.
ఉల్లిసాగులో విత్తన ఎంపిక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. భిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగే విత్తన రకాన్ని ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. వివిధ ప్రాంతాల వాతావరణ పరిస్థితులు మరియు మార్కెట్లోని డిమాండ్ బట్టి ఈ రకాలను ఎంచుకోవాలి. ప్రస్తుతం రైతులకు, బళ్ళారి, పుసారెడ్, రాంపురా రెడ్, వైట్ ఆనియన్, ఆర్కాని కేతన్, కళ్యాణ్ పూర్, ఆర్కా ప్రగతి, రెడ్ రౌండ్, ఎన్-53, అగ్రి ఫౌండ్ డార్క్ రెడ్, పూస వైట్ రౌండ్, పూసా వైట్ ఫ్లాట్, మొదలైన రకాలు అందుబాటులో ఉన్నాయి.
అయితే ఉల్లి సాగును ప్రారంభించే ముందు నారుమడులు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ నారుమడిని పెంచుకోవడానికి రైతులు రెండు పద్దతులను ఉపయోగించవచ్చు, మొదటిది చిన్న మడుల్లో నాటుకుని పద్దతికాగా, డ్రిప్ సౌకర్యంతో ఎతైన బెడ్ల మీద నాటుకుని పద్దతి మరొక్కటి. విత్తనాలను నాటుకుని ముందు విత్తనశుద్ధి చేపట్టాలి, దీనికోసం ఒక కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్ కలిపి విత్తనశుద్ది చెయ్యాలి. ఒక ఎకరానికి 4 కిలోల విత్తనం సరిపోతుంది. నారుపెరిగే సమయంలో నారుకుళ్లు తెగులు సోకకుండా ఉండేందుకు 10 రోజులకు ఒకసారి లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారీ చెయ్యాలి. ఈ దశలో రసం పీల్చే పురుగులనుండి రక్షణ కల్పించడానికి కార్బొఫ్యుర్మన్ 3 జి గుళికలను చల్లి నీరు పెట్టాలి.
Share your comments