Kheti Badi

నేలను ఎందుకు టెస్ట్ చేయాలంటే..

KJ Staff
KJ Staff
Soil Testing is Neccesary For Every Crop
Soil Testing is Neccesary For Every Crop

భూసారం పై ఆధారపడే 60 శాతం పంటల దిగుబడి ఆధారపడి ఉంటుంది. నేల సాంద్రతను కాపాడుకునేందుకు వీలైనంతగా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎప్పటికప్పుడు టెస్ట్ లు చేయించాల్సి ఉంటుంది. అందుకే నేల సారాన్ని చెక్ చేయడం ఎంత అవసరమో చెప్పేందుకు ఈ కారణాలు చెక్ చేయండి.

1. నేల సాంద్రత గురించి తెలుసుకొని దాన్ని మెరుగుపర్చేందుకు..

ఒక పొలంలో ఆరోగ్యకరమైన పంట పండాలంటే ఆ నేల కూడా ఆరోగ్యంగా ఉండాల్సిందే. భూసారాన్ని పెంచాలంటే ముందు దానికి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. కెమికల్, ఫిజికల్, బయోలాజికల్ గుణాల ద్వారా ఒక నేల సారాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. నేల సాంద్రత, రంగు వంటివన్నీ కళ్లకు కనిపిస్తాయి. కానీ అందులోని మూలకాల శాతం పూర్తిగా పరీక్షిస్తే కానీ తెలీదు. అందుకే నేల శాంపిళ్లు తీసుకొని అందులోని పోషకాలు, నేల పీహెచ్ వంటివి కనుక్కోవాల్సి ఉంటుంది. ఈ సమాచారంతో ఆ నేలలో ఎలాంటి పంటలు పండించేందుకు అనువుగా ఉంటుంది. ఎలాంటి ఎరువులు, ఎంత మేరకు ఉపయోగించాలి అన్న వివరాలన్నీ తెలుస్తాయి. దీని ద్వారా భూసారాన్ని పెంచే వీలుంటుంది.

2. భూసారాన్ని పెంచే పద్ధతుల్లో ఇది మొదటిది..

నేలలో సారాన్ని పెంచేందుకు ఫర్టిలిటీ మేనేజ్ మెంట్ స్ట్రాటజీని పాటించాల్సి ఉంటుంది. ఈ స్ట్రాటజీలో మొదటి అడుగు నేల సారాన్ని కనుక్కోవడమే.. రైతులు ఈ పద్ధతులను ఉపయోగించి పోషకాలను పెంచడంతో పాటు నీటి వినియోగాన్ని తగ్గించడం, తద్వారా వ్యవసాయ ఉత్పత్తిని ఎక్కువ చేయడం వంటివి చేసే వీలుంటుంది. ముఖ్యంగా నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ మంచి ఫలితాలను అందించేందుకు ఎక్కువ లాభాలను పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది.

Soil Testing Instruments
Soil Testing Instruments

3. ఎరువుల వినియోగం తగ్గించడం..

నేల సారాన్ని పరీక్షించడం ద్వారా ఆ నేలలో ఎలాంటి మూలకాలు తక్కువగా ఉన్నాయి.. ఏవి ఎక్కువగా ఉన్నాయి అన్న విషయం తెలుస్తుంది. దీని ద్వారా మీ నేలకు, మొక్కలకు ఎలాంటి రకాల పోషకాలు అవసరం.. ఏయే ఎరువులు వేయాలి అన్న విషయం కూడా తెలుస్తుంది. సహజ పోషకాలైన ఫాస్పరస్, పొటాషియం వంటివి కూడా అందించే వీలుంటుంది. ఎరువుల ధరలు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. అందుకే ఇలా భూసార పరీక్షలు చేయించడం వల్ల ఎరువుల ఖర్చు తగ్గుతుంది. తద్వారా వ్యవసాయంలోనూ మార్పులు కలుగుతాయని చెప్పవచ్చు.

4. ఎక్కువ ఎరువులు వాడకుండా..

నేలకు ఎంత అవసరమో తెలియకుండా ఎంత పోషకాలను అందించాలో నిర్ధారించకుండా మామూలుగా అన్ని పోషకాలను ఒకే మోతాదులో అందించడం వల్ల నేలకు కొన్ని పోషకాలు ఎక్కువ మోతాదులో మరి కొన్ని తక్కువ మోతాదులో అందుతాయి. ఇలా ఓవర్ ఫర్టిలైజేషన్ వల్ల నేల సారం పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే నేల సారాన్ని చెక్ చేసుకొని దాని ద్వారా ఇచ్చిన ఫర్టిలైజర్ రికమండేషన్స్ ఆధారంగా వాటిని ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల అత్యధిక మోతాదులో ఎరువులు వాడి అటు ఎక్కువ ఖర్చులు పెట్టడం, ఇటు నేలను పాడు చేయడం వంటివి రెండు జరగకుండా చూసుకోవచ్చు. ఇది కేవలం పంటలకే కాదు.. వాతావరణానికి కూడా మంచిది. ఓవర్ ఫర్టిలైజేషన్ వల్ల ఆకులు పసుపు పచ్చగా మారి రాలిపోతాయి. అంతే కాదు.. పోషకాలన్నీ బయటకు వెళ్లిపోవడం, నీటి కాలుష్యం వంటివన్నీ ఎదురవుతాయి. అందుకే నేల సారాన్ని బట్టి తక్కువ మోతాదులో ఎరువులు వాడడం అవి కూడా సహజమైనవి వాడడం వల్ల నేల కాలుష్యం బారిన పడకుండా ఉంటుంది.

5. నేల పోషకాలు తగ్గిపోవడం ఆగుతుంది..

నేలలో పోషకాలు తగ్గిపోవడం ప్రతి రైతు భయపడే సందర్భం అని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం 24 బిలియన్ టన్నుల పోషకాలు నిండిన నేల భూమి కోత కారణంగా పాడవుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనివల్ల నేల బ్యాలన్స్ లేకుండా తయారవుతుంది. నేల సారాన్ని కాపాడాలంటే ఇలాంటి పరీక్షలు చేయాలి. నేలలో ఏ పోషకాలు అయితే తక్కువగా ఉన్నాయో వాటిని ఎక్కువ మోతాదులో.. ఏవైతే తక్కువగా ఉన్నాయో వాటిని ఎక్కువ మోతాదులో అందించాలి. దీని ద్వారా నేలలో సమపాళ్లలో అన్ని పోషకాలు ఉంటాయి. తద్వారా ఆరోగ్యకరమైన పంట పండి దిగుబడి కూడా పెరుగుతుంది. ఇది ఆర్థికంగా కూడా రైతుకు రెండు రకాలుగా లాభాలను కలిగిస్తుంది. ఉపయోగించే ఎరువులు తగ్గడంతో పాటు దిగుబడి పెరగడం వల్ల రెండు రకాల లాభాలు పొందే వీలుంటుంది.

https://telugu.krishijagran.com/kheti-badi/what-are-the-benefits-of-undergoing-soil-tests/

https://telugu.krishijagran.com/kheti-badi/benefits-of-crop-rotation/

Share your comments

Subscribe Magazine