Kheti Badi

పొద్దుతిరుగుడు సాగు యాజమాన్య పద్దతుల గురించి తెలుసుకుందాం రండి....

KJ Staff
KJ Staff

నూనె పంటల్లో వేరుశెనగ తరువాత అంతటి ప్రత్యేకత ఉన్న పంట ఏదైనా ఉన్నదంటే అది పొద్దుతిరుగుడు పంటని చెప్పవచ్చు. వేరుశెనగ తరువాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంటల్లో పొద్దుతిరుగుడు ఒకటి. వీటి గింజలను నూనెను సేకరించడానికి మాత్రమే కాకుండా తినడానికి కూడా ఉపయోగిస్తారు. వీటి గింజల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.

పొద్దుతిరుగుడు సాగుకి అన్ని కాలాలు అనుకూలమే. అంతేకాకుండా తక్కువ పెట్టుబడితో పాటు తక్కువ కాలపరిమితి కలిగి ఉండటం వలన ఎంతో మంది రైతులు పంట సాగు చెయ్యడానికి ఆశక్తి చూపిస్తున్నారు. భూసారాన్ని పెంచాలంటే పంట మార్పిడి చెయ్యవలసి ఉంటుంది. పొద్దుతిరుగుడును కనీసం రెండేళ్లకు ఒకసారైనా సాగుచేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని, అధికారులు సూచిస్తున్నారు. పొద్దుతిరుగుడు సాగులో రైతులు ప్రధానంగా ఎన్నో రకాల చీడపీడల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మంచి లాభాలు ఆర్జించడానికి ఏ విధంగా పొద్దుతిరుగుడు సాగు చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పొద్దుతిరుగుడు సాగు కోసం చాలా తక్కువ మొత్తంలో నీరు అవసరమవుతుంది. పైగా ఈ పంటకయ్యే పెట్టుబడి కూడా చాలా తక్కువ. పంట నాటిన మూడు నెలలలోనే పంట చేతికి వస్తుంది, కాబట్టి రెండు ప్రధాన పంటల మధ్య సాగు చెయ్యవచ్చు. కొద్దిపాటి యాజమాన్య పద్దతులు పాటిస్తే మంచి దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు రానున్న ఆగష్టు మరియు సెప్టెంబర్ మాసాల్లో పంటను నాటుకునేందుకు అనుకూలంగా ఉంటుంది.

పొద్దుతిరుగుడు సాగుకు రకాలను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. దీనిలో ఎన్నో రకాల హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో బిఎస్హెచ్-1, ఎల్ఎస్హెచ్ - 1, ఎల్ఎస్హెచ్ -3, కేబిఎస్హెచ్ - 1, 44, తుంగా, ఫూలే రవిరాజ్, ప్రభాత్, పిఎస్హెచ్ - 1962, ఆర్ఎస్ఎఫ్హెచ్- 1887, మొదలైనవి ప్రముఖమైన హైబ్రిడ్ రకాలు దీనితోపాటు సాధారణ రకాలు కూడా రైతులకు అందుబాటులోకి వచ్చాయి, వాటిలో కో - 1,2,3,4,5, మోడరన్, సూర్య, కాంతి, భాను, ఈసి- 68415, మొదలైనవి అందుబాటులో ఉన్నాయి. పొద్దుతిరుగుడు సాగు కోసం నీరు నిల్వ ఉందని తేలికపాటి నేలలు మరియు ఇసుక నేలలు అనుకూలం.

పొద్దుతిరుగుడు మొక్కలను బోడె మరియు సాలు పద్దతిలో సాగు చేస్తారు, దీనివలన కొన్ని రకాల తెగుళ్లను అరికట్టవచ్చు. విత్తనాలు నాటేముందు పొలంమొత్తం రెండు నుండి మూడు సార్లు బాగా దున్నాలి. ఆగష్టు రెండోవారం వరకు విత్తుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒక ఎకరానికి 4-5 కేజీల వరకు విత్తనం సరిపోతుంది. విత్తనాలు నాటేముందు విత్తనశుద్ధి తప్పనిసరి, ఇందుకోసం ఒక కేజీ విత్తనానికి 3 గ్రాముల కప్తాన్ లేదా థీరాం మందులతో విత్తనశుద్ధి చెయ్యవలసి ఉంటుంది.

అధిక దిగుబడులు సాధించడానికి ఎరువుల యాజమాన్యం సరైనరీతిలో పాటించవలసి ఉంటుంది. పంట నాటేముందు ఆఖరి దుక్కిలో ఒకఎకరానికి 7 టన్నుల పశువుల ఎరువు బాగాకలిపి కలియదున్నుకోవాలి. ఒక ఎకరానికి సుమారు 60 కిలోల నత్రజని, 90 కిలోల భాస్ఫారమ్, మరియు 60 కిలోల పోటాష్ అవసరం. దీనిలో నత్రజని ఎరువుని రెండు భాగాలుగా విభజించి మొదటి భాగాన్ని విత్తుకున్నప్పుడు మరియు రెండొవ భాగాన్ని పంట నాటిన 30 తరువాత అందించవల్సి ఉంటుంది. పూలు పూసినతరువాత విత్తనాలు ఏర్పడేందుకు, 2 గ్రాముల బోరాన్ ఒక లీటర్ నీటికి కలిపి పులా మీద పిచికారీ చెయ్యాలి.

పొద్దుతిరుగుడులో కలుపు సమస్య ఎక్కువుగా ఉంటుంది. పొలంలో వచ్చే కలుపును ఎప్పటికప్పుడు నివారిస్తూ ఉండాలి. కలుపును చేతితో నివారించడానికి ప్రయత్నించాలి. కలుపు సమస్య ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో పెండిమిథాలిన్ లేదా ఫ్లూక్లోరాలిన 4.5 మిల్లిలీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పొద్దుతిరుగుడు సాగుకు నీటి అవసరం చాలా తక్కువ, అయితే సాగు నీటి లబ్యత ఉన్నవారు 10-15 రోజుల వ్యవధిలో నీటిని అందించాలి. పొద్దుతిరుగుడు పూల తల వెనుక భాగం నలుపు మారిందంటే పంట కోతకు సిద్ధమయ్యిందని గుర్తించవచ్చు. విత్తనాలను సేకరించి, వాటిలో తేమ 10 శాతానికి చేరేవరకు ఆరబెట్టి మార్కెట్ చెయ్యవచు. ఒక ఎకరానికి 12 వేల రూపాయిలు పెట్టుబడి పెడితే సుమారు 45,000-50,000 రూపాయిల వరకు ఆదాయం పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine