Kheti Badi

ఆముదం సాగుకు అనువైన వాతావరణం,అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు....!

KJ Staff
KJ Staff

సాధారణంగా ఆముదం పంటను పారిశ్రామిక నూనె కోసం ఎక్కువగా సాగు చేస్తారు.కొన్నిచోట్ల ఆముదం లేత ఆకులను ఏరీ పట్టుపురుగుల పెంపకంలో పట్టుపురుగులకు ఆహారంగా వినియోగిస్తారు. ప్రపంచంలోనే ఆముదం సాగు చేస్తున్న దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. అలాగే మన రాష్ట్రం దాదాపు 2 లక్షల హెక్టార్లలో ఆముదం సాగు చేస్తూ దేశంలోని రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆముదం తీవ్ర వర్షాభావ పరిస్థితులను సైతం తట్టుకొనే స్వభావం ఉన్నందున మెట్ట సాగు రైతులకు అనుకూలమైన పంటగా చెప్పవచ్చు.

అనుకూలమైన వాతావరణం:
సాధారణంగా ఆముదంను అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు అయితే మీరు నిలిచే నేలలు ఈ పంటకు అంత అనుకూలం కాదు. సంవత్సరానికి సగటున 500- 600 మి. మీ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చు.వాతావరణంలో ఉష్ణోగ్రత 30 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. 41 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచితే పుష్పాలు వికసించేది దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. ఖరీఫ్ సీజన్లో తొలకరి వర్షాలు పడిన వెంటనే జూన్ 15 నుంచి జులై 31 వరకు విత్తుకోవచ్చు. రబీ సీజన్లో అయితే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చు.

అధిక దిగుబడినిచ్చే ఆముదం రకాలు:

డి.సి. హెచ్ 177 : దీని పంటకాలం 90- 180 రోజులు ఉండి ఎకరాకు 7- 8 కింటల్ దిగుబడినిస్తుంది. ఈ రకం అత్యధిక బెట్ట పరిస్థితులనూ తట్టుకొని దిగుబడినిస్తుంది.

డి.సి. హెచ్ 519: పంటకాలం 90 -180 రోజులు ఉండి ఎకరాకు 8-9 క్వింటాల్ దిగుబడినిస్తుంది. ఎండు తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుంది.

క్రాంతి : స్వల్పకాలిక రకం దాదాపు 90-150 రోజులకు కోతకు వస్తుంది. బెట్ట పరిస్థితులను తట్టుకుని పెద్ద సైజు గింజలను ఇస్తుంది. ఎకరాకు 6 క్వింటాల్ దిగుబడినిస్తుంది

జ్వాల: పంటకాలం 90 నుంచి 180 రోజులు ఉంది ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి నిస్తుంది. ఎండు తెగులును, బూజు తెగులు సమర్థవంతంగా తట్టుకుంటుంది.

Share your comments

Subscribe Magazine