Kheti Badi

Oxygen releasing plants: ఆక్సిజన్ విడుదల చేసే మొక్కలు

KJ Staff
KJ Staff
Herbal Plants
Herbal Plants

రోజురోజుకి మన చుట్టూ ఉండే గాలిలో కాలుష్యం పెరుగుతుంది. కరోనా ప్రభావంతో చాలామందిలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయి.

ఆక్సిజన్ పీల్చుకునే వీల్లేక ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కరోనా బారిన పడిన వారు తీసుకునే గాలిలో ఆక్సిజన్ లెవల్ ఎక్కువగా ఉండాలి. అందుకే ఇంటి నిండా ఆక్సిజన్ అందించే ఈ మొక్కలను పెంచండి. తద్వారా మీ ఇంట్లో ఆక్సిజన్ లెవల్ పెంచుకొని కరోనా వచ్చినా.. రాకపోయినా ప్రశాంతంగా జీవించే వీలుంటుంది.

ఆక్సిజన్ అందించే మొక్కలు

1. వీపింగ్ ఫిగ్

ఇది ఫైకస్ రకానికి చెందిన మొక్క. ఇది గాలిని శుద్ధి చేసే మొక్క. ఇంట్లోనే పెంచుకోగలిగే ఈ మొక్క వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నాసా గుర్తించిన ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ ఇది. ఇంట్లోని ఫార్మాల్డిహైడ్, జైలిన్, టౌలిన్ వంటి రసాయనాలను కూడా ఇది పీల్చుకుంటుంది. ఈ మొక్కను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లోనూ ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలి పీల్చుకునే వీలుంటుంది.

2. కలబంద

కలబంద వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎన్నో మెడిసినల్ ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ మొక్క ఇంట్లోని గాలిని కూడా శుద్ధి చేస్తుంది. ఇది ఇంట్లోని బెంజీన్, ఫార్మాల్డిహైడ్ వంటివి కూడా పీల్చుకుంటుంది. రాత్రి సమయంలో ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది. ఆక్సిజన్ కోసం పెంచే అద్భుతమైన మొక్క ఇది.

3. పోథోస్ ప్లాంట్

మనీ ప్లాంట్ అని కూడా పిలిచే ఇది చాలా అందమైన మొక్క. దీన్ని సంరక్షించడం కూడా చాలా సులువు. ఇంట్లోని గాలి క్వాలిటీని పెంచేందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. టాక్సిన్లు ఎక్కువగా ఉంటే వాటిని ఇది చాలా సులభంగా పీల్చుకుంటుంది. ఫార్మాల్డిహైడ్, బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్ వంటివి కూడా పీల్చుకుంటుంది. ఇది రాత్రి సమయంలో ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది.

4. స్పైడర్ ప్లాంట్

స్పైడర్ ప్లాంట్ అనేది చాలా సులువుగా పెంచుకోగలిగే మొక్క. దీన్ని ఇండోర్ ప్లాంట్ గా సులభంగా పెంచుకోవచ్చు. ఇది కూడా ఇంట్లోని గాలి క్వాలిటీని పెంచుతుంది. కార్బన్ మోనాక్సైడ్, బెంజీన్ ని పీల్చుకుంటుంది. ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది. ఇది ఇంట్లో ఆనందాలను పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మొక్క దగ్గర సమయం గడిపితే అది తగ్గిపోతుంది.

5. అరెకా పామ్

గాలిలోని కాలుష్యకారకాలన్నింటినీ పీల్చుకునే మొక్క ఇది. అరెకా పామ్ అనేది చక్కటి ఇండోర్ ప్లాంట్. ఎయిర్ ప్యూరిఫికేషన్ కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దాంతో పాటు గర్భవతులు ఉన్న ఇళ్లలో ఇది ఉంచితే గర్భంలోని బిడ్డతో పాటు చిన్న పిల్లల ఆరోగ్యాన్ని కూడా ఇది పెంచుతుంది. ఇది నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది

Oxygen Plants in internal
Oxygen Plants in internal

6. స్నేక్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్ అనేది గాలి ప్యూరిఫికేషన్ కోసం ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే మొక్క. ఎక్కువ మంది ప్రేమించే మొక్క ఇది. నాసా కూడా దీన్ని మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ గా గుర్తించింది. ఫార్మాల్డిహైడ్, నైట్రోజెన్ ఆక్సైడ్, బెంజీన్, జైలిన్, ట్రై క్లోరో ఇథిలిన్ వంటి వాటిని కూడా అవి పీల్చుకుంటాయి.

7. తులసి

తులసి మొక్కను చాలామంది ఇంట్లో పెంచుకుంటారు. పూజ కూడా చేస్తుంటారు. ఇది మీరు చక్కటి ఆరోగ్యాన్ని కూడా అందించే మొక్క. లక్ ని కూడా అందిస్తుంది. ఇంటిని చెడు నుంచి కూడా రక్షిస్తుంది. ఇది క్వీన్ ఆఫ్ హెర్బ్స్ అని కూడా పిలిచే మొక్క. దీనివల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. తులసి మొక్కను ఇంట్లో పెంచితే ఇంటి నిండా ఆక్సిజన్ సప్లై ఉంటుంది. ఇది రోజుకు కనీసం 20 గంటల పాటు ఆక్సిజన్ ని అందిస్తుంది. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ వంటి ప్రమాదకరమైన గ్యాసెస్ ని ఇది పీల్చుకుంటుంది.

8. లక్కీ బ్యాంబూ

లక్కీ బ్యంబూ మొక్క ఇంటి నుంచి టౌలిన్ ని పీల్చుకుంటుంది. ఈ రంగు లేని వాయువు చెడు వాసన కలిగి ఉంటుంది. ముక్కు, కళ్లు, గొంతులో ఇరిటేషన్ ని కలిగిస్తుంది. ఇది గాలిలో టాక్సిన్లను తొలగిస్తుంది. బెంజీన్, ఫార్మాల్డిహైడ్ వంటి టాక్సిన్లను తొలగిస్తుంది. గాలిలో ఆక్సిజన్ స్థాయులను చాలా వరకు పెంచుతుంది.

9. జెర్బెరా డైసీ

ఈ మొక్క అందమైన పూలతో ఇంటిని చాలా అందంగా మార్చడంతో పాటు ఆక్సిజన్ ని కూడా అందిస్తుంది. నాసా క్లీన్ ఎయిర్ స్టడీ ప్రకారం డైసీ మొక్క ఇంట్లోని కాలుష్యం తొలగిస్తుంది. ఇంట్లోని ఫార్మాల్డిహైడ్, బెంజీన్, ట్రైక్లోరోథైలీన్ వంటి వాటిని పీల్చుకుంటుంది. ఇది కార్బన్ డై ఆక్సైడ్ ని పీల్చుకొని ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది.

బయట గాలి ఎలా ఉందన్న విషయం మనం కంట్రోల్ చేయలేం కానీ ఇంట్లో గాలి లెవల్ లో ఆక్సిజన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దానివల్ల మనం ఆరోగ్యంగా ఉండే వీలుంటుంది.

https://krishijagran.com/health-lifestyle/10-indoor-plants-that-will-bring-positive-energy-in-your-home/

https://krishijagran.com/agripedia/air-pollution-top-10-indoor-plants-to-get-rid-of-pollutants-inside-your-house/

Share your comments

Subscribe Magazine