Kheti Badi

ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిర్చి రకాలు...

KJ Staff
KJ Staff

మన తెలుగు ప్రజలకి స్పైసి ఫుడ్స్ మీద ఉన్న ప్రేమను ప్రత్యేకంగా వివరించక్కర్లేదు, స్వీట్ ఫుడ్స్ కంటే స్పైసి ఫుడ్స్కె ఎక్కువ మొగ్గు చూపుతారు. కారం అనగానే ముందుగా మనందరికి గుర్తుకువచ్చే పేరు 'గుంటూరు'. గుంటూరు మిర్చికి ప్రపంచంలో ఉన్న క్రేజ్అంత ఇంత కాదు. ఇక్కడ పండిన మిర్చి దేశ విదేశాలకు కూడా ఎక్సపోర్ట్ అవుతుంది. అయితే గుంటూరు మిర్చికంటే ఘాటైన మిర్చి రకాల గురించి మీకు తెలుసా?

గుంటూరు మిర్చి కంటే ఎక్కువ ఘాటైన ఐదు మిర్చి రకాల గురించి తెలుసుకుందాం. వీటిలో కొన్ని మిర్చి రకాలు వాటి గాటుతో గిన్నిస్ బుక్ లో స్థానాన్ని సంపాదించుకున్నాయి.

ప్రపంచంలోనే ఘాటైన మిర్చి రకాలలో ముందుగా వచ్చే పేరు భూత్ జోలోకియా. ఈ మిర్చిని అస్సాంలో పండిస్తారు. భూత్ జోలోకియా మిర్చిని ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిర్చి రకంగా భావిస్తారు. మిర్చిలోని ఘాటుని స్కోవిల్లే స్కేల్ పై కొలుస్తారు, ఈ స్కేల్ ప్రకారం జోలోకియా మిర్చి ఘాటు అక్షరాలా 1,041,427 యూనిట్లు, ఇది మనం తరచు వాడే మిర్చి గాటుతో పోలిస్తే కొన్ని వేల రేట్లు ఎక్కువ. కనుక ఈ రకం మిర్చిని ముట్టుకోవడానికి కూడా ప్రజలు భయపడతారు. 2007 లో ఈ మిర్చి ఐత్యంత ఘాటైన మిర్చిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్తానం సంపాదించుకుంది. ఈ మిర్చిని ఘోస్ట్ పెప్పర్ అని కూడా పిలుస్తారు. వీటిని ఎక్కువుగా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు, అంతర్జాతీయ మార్కెట్లో కిలోకి వెయ్యి రూపాయిల వరకు లభిస్తుంది.

రెండవ స్థానంలో డ్రాగన్ బ్రీత్ చిల్లి ప్రపంచంలోనే అత్యంత ఘాటైన చిల్లిగా పరిగణించబడుతుంది. ఈ చిల్లిని బ్రిటన్ లో సాగు చేస్తారు. ఈ మిరపలోని ఘాటు సాధారణ మిర్చి కంటే 2000 వేల రేట్లు ఎక్కువ. డ్రాగన్ బ్రేఅత్ మిర్చిని ఔషదాల తయారీలో ఎక్కువుగా వాడతారు. బ్రిటన్ లో పండే నాగ వైపర్ రకాన్ని కూడా ప్రపంచంలోనే అత్యంత ఘటైనదిగా పరిగణిస్తారు. ఈ మిర్చిలో ప్రత్యేకత ఏమిటంటే ఒక్కోసారి ఒక్కో రంగులో ఈ మిర్చి దొరుకుతుంది. ఎరుపు, నలుపు మరియు ఆకుపచ్చ ఇలా వైవిధ్యమైన రంగుల్లో ఈ మిర్చి లభిస్తుంది.

Read More:

భారతదేశంలో టాప్ వ్యవసాయ పథకాలు ఇవే!

ఖరీఫ్ కు అనువైన అల్లం పంట.. అధిక దిగుబడులు పొందడానికి యాజమాన్య పద్ధతులు

కరోలినా రీపర్ ను కూడా చాల ఘాటైన మిర్చిగా పరిగణిస్తారు, కరోలినా రీపర్ హైబ్రిడ్ మిర్చి, స్వీట్ హబానేర్ మరియు నాగ వైపర్ మొక్కలు దాటడం ద్వారా ఈ మిర్చి వచ్చింది. ఈ రకం మిర్చి కేవలం అమెరికాలో మాత్రమే పండుతుంది. ఈ ఘాటైన మిర్చి రకాల్ని వంటకాల్లో వాడటానికి ఎంతో అనుభవం కావాలి, పైగా వీటిని వాడేటప్పుడు వీలైనంత ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి.

ఈ రంగు పసుపుకి మార్కెట్ లో సూపర్ డిమాండ్.. సాగు చేస్తే అధిక లాభాలే!

Share your comments

Subscribe Magazine