Kheti Badi

సేంద్రియ వ్యవసాయంలో ఎరువుల వాడకం, నీటి యాజమాన్యం

KJ Staff
KJ Staff

ప్రస్తుతం పాటిస్తున్న వ్యవసాయ విధానాల వల్ల నేలకు మరియు పర్యావరణానికి ఎంతో కీడు కలుగుతుంది. ప్రకృతి వ్యవసాయం లేదా సేంద్రియ వ్యవసాయం ద్వారా ఈ నష్టాన్ని అరికట్టవచ్చు. సేంద్రియ వ్యవసాయంలో రసాయన ఎరువులు మరియు పురుగుమందులు బదులు సేంద్రియ ఎరువులను వాడతారు. వీటిని మీ పొలంలోనే సొంతంగా తక్కువని ఖర్చుతోనే తయారుచేసుకోవచ్చు. అంతేకాకుండా సేంద్రియ పద్దతిలో పంటకు అవసరమైనంత నీటిని మాత్రమే అందిస్తూ, నీటి వృథాను కూడా తగ్గించవచ్చు.

రసాయనాల వల్ల చెడును గుర్తించిన రైతులు ఇప్పుడిప్పుడే సేంద్రియ వ్యవసాయ పద్దతులను అవలంభించడం మొదలుపెట్టారు. కొనుగోలు దారులు కూడా సేంద్రియ ఉత్పత్తులకు ఎక్కువ ధర ఇచ్చి కొనుగోలు చెయ్యడంతో, రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. రసాయన ఎరువులను వాడటం వలన మాటి మరియు నీరు కలుషితం అవుతున్నాయి, ఈ ఎరువులను ఇలాగే వాడినట్లైతే మరికొన్ని రోజుల్లో వ్యవసాయ క్షేత్రాలన్నీ బీడు భూములుగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాల నేలల్లో సేంద్రియ కార్బన్ శాతం తగ్గి, సారం పూర్తిగా తగ్గిపోయింది. అదే సేంద్రియ ఎరువులను వాడినట్లైతే బీడు భూములను కూడా బంగారం పండించే నేలలుగా మార్చవచ్చు, సేంద్రియ ఎరువులు మట్టిలో కార్బాన శాతం పెంచి, దీర్ఘకాలికంగా అధిక దిగుబడులు పొందేలా చేస్తుంది.

సేంద్రియ ఎరువులను తక్కువ ఖర్చుతోనే తయారుచేసుకోవచ్చు. అంతేకాకుండా పొలంలో దొరికే ఆకులు, గడ్డిని, పశువుల పేడ మరియు మూత్రంతో ఈ ఎరువులను తయారుచేసుకోవచ్చు. పశువుల ఎరువును దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సేంద్రియ వ్యవసాయం లేదా ప్రకృతి వ్యవసాయం అనగానే గుర్తొచ్చేది జీవామృతం, దీనిని తయారు చెయ్యడానికి ఆవు పేడ, మూత్రం, సెనగపిండి, పుట్ట మన్ను, బెల్లం వీటన్నిటిని నీటిలో కలిపి ఒక వారం రోజులు పులియబెడతారు. ఈ సమయంలో దీనిలో మొక్కలకు మేలు చేసే బాక్టీరియా వృద్ధి చెందుతుంది. వారం రోజుల తరువాత ఈ జీవామృతాన్ని మొక్కల మోడళ్లలో కానీ, మొక్కల మీద స్ప్రే చెయ్యడం వల్ల మొక్కకు అవసరమైన పోషకాలు లభిస్తాయి. కాకపోతే సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులకు కంటే అధిక మోతాదులో వాడాలి. ఉదాహరణకు ఒక ఎకరం పంటకునత్రజని అందించడానికి 40 కేజీల యూరియా వాడినట్లైతే, పశువుల ఎరువు 1-2 టన్నుల మోతాదులో వాడవలసి ఉంటుంది.


సేంద్రియ ఎరువుల్లో అనేక రకాల ఎరువులున్నాయి వాటిలో, పశువుల పెంట, వెర్మికంపోస్టు, వేపపిండి, మొదలైన ఎరువులు ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయంలో భూమిని ఎక్కువ లోతు దున్నరు. ఎక్కువ లోతు భూమిని దున్నినట్లైతే మట్టి కోతకు గురై, పోషక విలువలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కనుక నేలను దున్నేటప్పుడు, రెండు మూడు సార్లు, 15 సెంటీమీటర్ల లోతు మించకుండా దున్నాలి.

Share your comments

Subscribe Magazine