Kheti Badi

ఖరీఫ్ పంటలును ఏ సమయంలో సాగు చెయ్యాలి.....

KJ Staff
KJ Staff

నైరుతి రుతుపవనాల రాకతో రైతులు ఖరీఫ్ పంటలు సాగు చెయ్యడం ప్రారంభించారు. అయితే ఖరీఫ్ పంటలో సాగు చేసే పంటలను ఏ సమయంలో సాగు చెయ్యాలని అవగాహనా లేక ప్రతిఏటా ఒకే పంటను సాగు చేస్తున్నారు. దీనివలన రైతులు నష్టపోవడమే కాకుండా, భూమిలోని పోషకాల శాతం కూడా తగ్గిపోతుంది. వివిధ రకాల పంటలను సాగుకు అనుకూలమైన సమయంలో నాటుకోవడం ద్వారా అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది. సరైన సమయంలో పంటలు నాటడం వలన పంటలకు చీడపీడల బాధలు కూడా ఉండవు. దీనివలన పంట నాణ్యత పెరిగి, రైతులు అధిక లాభాలు ఆర్జించవచ్చు. ఈ తరుణంలో పంట నాటేముందు రైతులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వరి:

ఖరీఫ్ సాగులో అధిక విస్తీర్ణంలో సాగు చేసే పంటల్లో వరి ప్రధానమైనది. ప్రతీ ఏటా కొన్ని లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. వరి సాగులో అధిక దిగుబడులు పొందేందుకు రైతులు, యాజమాన్య పద్దతులు, విత్తన ఎంపిక, మరియు పంట నాటే సమయం మీద ద్రుష్టి పెట్టవలసి ఉంటుంది. దీర్ఘకాలిక

దీర్ఘకాలిక వరి రకాలు సాగు చేసే రైతులు, జూన్ మొదటి వారం నుండి చివరలోపు నారు పోసుకోవడం పూర్తి చెయ్యాలి, దీర్ఘకాలిక రకాల పంట కాలం 135-150 రోజుల వరుకు ఉంటుంది. ఈ విధంగా అక్టోబర్ 31 నుండి నవంబర్ 20 లోపు పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుంది, దీనివలన రబి సీసన్ సాగుకి సమయం లభిస్తుంది.

అదేవిధంగా మధ్యకాలిక రకాలను సాగు చేసే రైతులు జూన్ 20 నుండి జులై 10 లోపు నారుపోయ్యడం పూర్తిచెయ్యాలి. వీటి పంటకాలం దాదాపు 125-135 రోజుల మధ్యలో ఉంటుంది, ఈ విధంగా నవంబర్ 10 లోపల పంట చేతికి అందివస్తుంది.ఈ విధంగా సాగు చేస్తే వేసంగి పంట సాగుకు కాస్త సమయం లభిస్తుంది.

వానాకాలంలో పంట పంట ఆలస్యం అయితే యాసంగి పంట సాగుకు కూడా ఆలస్యమయ్యే ప్రమాదం ఉంటుంది. మార్చ్ చివరిలోపు యాసంగి పంట చేతికి వచ్చేలా సాగు చెయ్యడం మంచిది, లేకుంటే ఏప్రిల్ మాసంలో వాతావరణ మార్పులతో పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. దీనితోపాటు వాతావరణానికి అనువైన రకాలను రైతులు ఎంపిక చేసుకోవాలి, లేకుంటే మొక్క ఎదుగుదల లోపించి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది.

పత్తి:

తెలంగాణాలో ఖరీఫ్ సీజన్లో సాగు చేసే వాణిజ్య పంటల్లో పత్తి పంట ముఖ్యమైనది. అయితే పత్తి పంటను ఎటువంటి సమయంలో నాటుకోవాలి, మార్కెట్లో డిమాండ్ ఎంత, ఇటువంటి విషయాల మీద అవగాహన లేక, పత్తి పంట మీద అధికంగా పెట్టుబడి పెట్టి రైతులు చాలా వరకు నష్టపోతున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర లేకపోవడంతో పత్తి సాగు రైతులకు నష్టాలు మిగిల్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

పత్తి సాగు చేసే రైతులు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి, ముందుగా నల్లరేగడి నేలల్లో సాగు చేపట్టే రైతులు, 70 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయిన తరువాత మాత్రమే పత్తి గింజలను విత్తుకోవాలి, లేకుంటే మొలక సశాతం తగ్గిపోయి, పొలంలో ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
దీనితోపాటు సమయానుసరంగా పంటలు నాటుకోవడం ద్వారా కొన్ని రకాల పురుగులు మరియు చీడపీడల ఉదృతిని కూడా తగ్గించవచ్చు. జూన్ 20 నుండి జులై 20 లోపు పంటలు నాటుకుంటే రసం పీల్చే పురుగుల ఉదృతిని చాలా వరకు తగ్గించవచ్చు.

మిరప:

భారతీయ వంటకాల్లో మిర్చికి విడదియ్యలేని బంధం ఉంది. మిర్చిని ఎక్కువుగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక ప్రాంతాల్లో ఎక్కువుగా సాగు చేస్తారు. మిరప పంట కాలం ఏడు నెలలు. ఆగష్టు మొదటి వారంలో మిర్చి సాగు మొదలుపెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రధాన పొలంలో నాటుకునేముందు ముందుగా మిచ్చి పైరును పెంచుకోవాల్సి ఉంటుంది.

మిర్చి విత్తనాలు కొనుగోలు చేసే రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు. గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే పంటను కొనుగోలు చెయ్యాలి. మంచి నాణ్యమైన విత్తనాలు ఎంచుకున్న తరువాత ఆగష్టు మొదటివారంలో నారుపోసుకొని నవంబర్ చివరి నాటికి నాట్లు వెయ్యవచ్చు. మిర్చి పంట సాగు చేసే ముందు తక్కువ కాలంలో చేతికి వచ్చే పంటలైన మినప మరియు పెసర వంటివి సాగు చేసి, తరువాత ఈ పంటను సాగు సాగుచేయవచ్చు.

Share your comments

Subscribe Magazine