News

రుణమాఫి అందని రైతులు 1.6 లక్షలు ..

Srikanth B
Srikanth B
రుణమాఫి అందని రైతులు 1.6 లక్షలు ..
రుణమాఫి అందని రైతులు 1.6 లక్షలు ..

రైతులకు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 17.15 లక్షల మంది రైతుల ఖాతలో రుణమాఫీ డబ్బులు చేరాయన్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు, కొన్ని సాంకేతిక కారణాలవల్ల 1.6 లక్షల మంది రైతులకు ఇంకా రుణమాఫీ డబ్బులు అందలేదని వారికీ కూడా త్వరలో రుణమాఫీ డబ్బులను అందిస్తామని , సోమవారం రైతు రుణమాఫీపై డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో బ్యాంకర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో హరీశ్‌రావు తెలిపారు.

 

సాంకేతిక, ఇతర కారణాల వల్ల 1.6 లక్షల మంది రైతులకు ఇంకా రుణమాఫీ డబ్బులు అందలేదని వారికీ కూడా త్వరలో రుణమాఫీ డబ్బులను అందిస్తామని ఈ సమీక్షా సమావేశానికి దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, స్పెషల్‌ సీఎస్‌ రామకృష్ణరావు, వివిధ బ్యాంకుల అధికారులు హాజరయ్యారు.
బ్యాంకు ఖాతాలు పనిచేయకపోవడం, అకౌంట్లు క్లోజ్‌ చేయడం, అకౌంట్‌ నంబర్లు మార్చడం, బ్యాంకుల విలీనం అనే నాలుగు కారణాల వల్ల ఈ సమస్య తలెత్తినట్టు ఆయనకు అధికారులు వివరించారు. చర్చించిన అనంతరం మూడు పరిష్కారమార్గాలు కనుగొన్నారు.

ఆధార్‌ నంబర్ల సాయంతో రైతుబంధు ఖాతాలను గుర్తించి ఆ ఖాతాల్లో రుణమాఫీ డబ్బు వేయడం, దీనివల్ల సుమారు మరో లక్షమందికి రుణమాఫీ డబ్బు అందుతుంది.

ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు ఇవే.!

ఎన్‌పీసీఐ సాయంతో బ్యాంకులు రైతుల బ్యాంకు ఖాతాలు సేకరించి ప్రభుత్వానికి అందజేయాలి. వారికి ఆర్థికశాఖ నిధులు విడుదల చేస్తుంది. ఇలా దాదాపు 50 వేల మందికి మూడు రోజుల్లోగా డబ్బు వేయాలని నిర్ణయించారు.రుణమాఫీ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం బ్యాంకులు రాష్ట్రస్థాయిలో గ్రీవెన్స్‌సెల్‌ ఏర్పాటు చేస్తామని .. ఒక అధికారిని నియమించి, వారి ఫోన్‌నంబర్, ఈ మెయిల్‌ ఐడీని ప్రజలకు తెలియజేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రైతులు ముందుగా బ్యాంకుస్థాయిలో సంప్రదిస్తారు..అక్కడ పరిష్కారం కాకపోతే రాష్ట్రస్థాయి అధికారిని సంప్రదించి, సమస్యను చెప్పుకొనేలా ఏర్పాటు చేయాలన్నారు. ఇదే తరహాలో వ్యవసాయశాఖ తరపున జిల్లాకు ఒక నోడల్‌ ఆఫీసర్‌ను నియమించనున్నట్లు తెలిపారు.

ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు ఇవే.!

Related Topics

runamafie scheme

Share your comments

Subscribe Magazine

More on News

More