News

ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు ఇవే.!

Gokavarapu siva
Gokavarapu siva

అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడం ద్వారా పేద మరియు మధ్య-తరగతి ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం గణనీయమైన చర్యలు తీసుకుంది. ప్రజల కొరకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ప్రతి ఏటా ఏ ఏ పథకాలను ఏ నెలలో అమలు చేస్తుందో తెలియడానికి ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ ను కూడా విడుదల చేసింది.

క్యాలెండర్ సూచించిన విధంగా సెప్టెంబర్ నెలలో అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ నెలలో మూడు వేర్వేరు పథకాల లబ్ధిదారులకు నిధులు అందజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

వైఎస్ఆర్ చేయూత

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వైయస్సార్ చేయూత పథకం గురించి ఒక ముఖ్యమైన సమాచారం వచ్చింది. అయితే వైయస్సార్ చేయూత పథకం యొక్క మూడో విడత నగదు ఈ సెప్టెంబర్ నెలలో విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం. కాగా ఈ పథకానికి సంబంధించి సచివాలయాల ద్వారా కొత్త అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యింది. కాబట్టి రాష్ట్రంలో ఈ పథకానికి ఎవరైన అర్హులైతే వెంటనే మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోండి.

ఈ పథకానికి అర్హులైన వారికి ప్రభుత్వం మొత్తానికి రూ.75 వేల ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. కానీ మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయాన్ని ఒకేసారి ఖాతాల్లో జమ చేయకుండా, ప్రతి ఏడాది అర్హులైన వారికీ 18,750 రూపాయలు అందించడం జరుగుతుంది.

ఇది కూడా చదవండి..

గుడ్‌న్యూస్! మీ వాహనంపై ఎక్కువ పెండింగ్ చలాన్లు ఉన్నాయా? వాటిని తగ్గించుకునే లక్కీ ఛాన్స్.. ఎలాగో తెలుసా?

వైఎస్సార్ కాపు నేస్తం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కాపు నేస్తం అనే పథకాన్ని అమలు చేస్తుంది. ఈ ప్రోగ్రామ్‌కు అర్హత పొందాలంటే, మహిళలు తప్పనిసరిగా 45 మరియు 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. కాపు నేస్తం పథకం కింద ప్రభుత్వం నాలుగో విడత డబ్బులను ఈ సెప్టెంబర్ నెలలో లబ్ధిదారులకు అందజేయనుంది.

వైఎస్సార్ వాహనమిత్ర

ఇటీవలి ఏపీ ప్రభుత్వం ఈ వాహనమిత్ర పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ ప్రభుత్వం ఇటీవల ఆటో, టాక్సీ మరియు క్యాబ్ డ్రైవర్లకు కొన్ని సానుకూల వార్తలను అందించింది. వాహనమిత్ర పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ప్రకటించిన రూ.10,000 ఈ నెల సెప్టెంబర్ లో డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

YSR వాహన మిత్ర పథకంలో భాగం కావడానికి, ప్రజలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఏపీ ట్రాన్స్ పోర్ట్ వెబ్ సైట్ లోకి వెళ్లి https://aptransport.org/ ద్వారా అప్లికేషన్ సెక్షన్‌లోకి వెళ్లి.. అన్ని వివరాలు అందించాలి.

ఇది కూడా చదవండి..

గుడ్‌న్యూస్! మీ వాహనంపై ఎక్కువ పెండింగ్ చలాన్లు ఉన్నాయా? వాటిని తగ్గించుకునే లక్కీ ఛాన్స్.. ఎలాగో తెలుసా?

Share your comments

Subscribe Magazine