దేశంలో మరియు రాష్ట్రంలో పేద ప్రజలు ఆహార విషయంలో ఇబ్బందులు పడకూడదని వారికి ప్రభుత్వం ఉచితంగా బియ్యం, గోధుమలు, చక్కెర వంటి కొన్ని నిత్యవసర సరుకులను పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో పంపిణి చేస్తుంది. బయట దుకాణాల్లో కన్న ప్రజలకు ఇక్కడ తక్కువ ధరలకే నిత్యవసర సరుకులను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ విధంగా అమలు చేస్తూ పంపిణి చేస్తున్న ఈ రేషన్ బియ్యాన్ని కొంతమంది దళారులు పక్కదారి పట్టిస్తున్నారు.
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా ఇచ్చే బియ్యం కంటే కరోనా సమయంలో ఎక్కువ మొత్తంలో పేద ప్రజలకు బియ్యాన్ని పంపిణి చేశారు. పేదప్రజలకు పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో అందాల్సిన ఈ రేషన్ బియ్యం పక్క దారి పడుతున్నది. దీనిని క్యాష్ చేసుకోవాలనుకున్న కొంతమంది దళారులు పేదలను దగ్గర బియ్యం కొని ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదని విమర్శలు వస్తున్నాయి.
అక్రమంగా పేద ప్రజల నుండి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పేదవారికి డబ్బులు ఆశ చూపించి కొనుగోలు చేసిన కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు అయితే రెవెన్యూ, సివిల్‌సప్లయ్ అధికారులకు సమాచారాన్ని ఇవ్వాలని తహసీల్దార్ ఉమాదేవి కోరారు.
ఇది కూడా చదవండి..
పేదప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త..ఆదేశాలు ఇచ్చిన సీఎం
నారాయణరావుపేట మండలంలో మొత్తం 5,562 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటిలో ఆహార భద్రత కార్డులు 5,129, అంత్యోదయ మరియు అన్నపూర్ణ కార్డులు కలిపి 393 ఉన్నాయి. ప్రతి నెల ఈ మండలంలో ఉన్న మొత్తం 14 రేషన్ దుకాణాల ద్వారా 9,281 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పేద ప్రజలకు పంపిణి చేస్తున్నారు.
దళారులు పేదప్రజల నుండి ఈ బియ్యాన్ని కొనుగోలు చేసి పౌల్ర్టీ ఫాంలకు మరియు రైస్ మిల్లులకు ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. పేదప్రజల నుండి కిలో బియ్యాన్ని కేవలం రూ.10నుంచి రూ.13చెల్లించి దళారులు కొనుగోలు చేస్తున్నారు. ఆ బియ్యాన్ని పౌలీ్ట్రఫాంలకు, రైస్ మిల్లులకు కిలో రూ.15 నుంచి రూ.20చొప్పున అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. అధిక మొత్తంలో బియ్యాన్ని పౌల్ర్టీలో కోళ్లకు దాణా తయారుచేయడానికి వాడతారు. మరోవైపు రైసుమిల్లర్లు రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి అధిక ధరలకు మార్కెట్ లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments