News

పేదప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త..ఆదేశాలు ఇచ్చిన సీఎం

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్ లోని పేద ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ప్రతి పేద 2వాడికి ఇల్లు ఉండాలని ప్రభుత్వం పేదవారికి ఇల్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రిగారు చెప్పిన విషయం మనకి తెల్సిందే. అయితే ఈ హౌసింగ్ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. అతి త్వరలో ఈ ఇళ్లను పూర్తి చేసి పేద ప్రజలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి తెలిపారు.

ఈ కొత్త ఇళ్లకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు మరియు తదితర అంశాలపై సమీక్షించారు. ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి హౌసింగ్‌ స్కీమ్‌ పై సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ హౌసింగ్‌పై చేస్తున్న ఖర్చు అనేది కొన్ని చిన్న రాష్ట్రాల బడ్జెట్ కన్నా ఎక్కువ అన్నారు. గత ఆర్ధిక సంవత్సరంలో 10,203 కోట్ల రూపాయలను హౌసింగ్ నిర్మాణాల ఖర్చు చేస్తే రోజుకు 28 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు తెలిపారు. రోజుకు 43 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ ఇళ్లలో మౌలిక సదుపాయాలకు రాజి పడవద్దని ముఖ్యమంత్రి తెలిపారు. ఇళ్లకు కావలసిన కరెంటు, తాగునీరు సహా మౌలిక సదుపాయాలను కల్పిస్తామని అధికారులు అన్నారు. ప్రతి ఇంటికీ కూడా సోక్పిట్స్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు అధికారులు. భవిష్యత్తులో వాననీటిని భూమిలోకి ఇంకించేలా చేయడానికి ఇవి ఉపయోగడతాయన్న అధికారులు.

ఇది కూడా చదవండి..

రైతులకు శుభవార్త: భారీగా పెరిగిన పత్తి ధర..

మౌలిక సదుపాయాలతో పాటు పేదలకు నిర్మించే ఇళ్లకు కావలసిన సిమెంటు, స్టీలు, రాయి వంటి వాటిపై పరీక్షలు నిర్వహిస్తున్నమై అధికారులు తెలిపారు. ఇప్పటివరకు వీటిపై 4529 పరీక్షలు చేశామని, అందులో 2 శాతం వరకు లోపాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల రూపంలో 21 వేల కోట్ల విలువైన లబ్ధి చేకూర్చామని అధికారులు వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు పేదల కొరకు 3,40,741 ఇళ్లు పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. మరొకవైపు 4,67,551 ఇళ్లు శ్లాబ్‌ పూర్తి చేసుకున్నవి, శ్లాబుకు సిద్ధంచేసినవి ఉన్నాయని అన్నారు. త్వరలో ఈ ఇళ్లు కూడా పూర్తవుతాయని చెప్పారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ఇది కూడా చదవండి..

రైతులకు శుభవార్త: భారీగా పెరిగిన పత్తి ధర..

Share your comments

Subscribe Magazine