News

10 లక్షల కొత్త పింఛన్లు.. ఆగస్టు 15 నుంచి అమలు

Srikanth B
Srikanth B

రాష్ట్రంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుంచి కొత్తగా పది లక్షల పింఛన్లు మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం
తాజాగా తీసుకొన్నది.

ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పింఛన్లు ఇస్తున్నారు. కొత్త వాటితో మొత్తం పింఛన్ల సంఖ్య 46 లక్షలకు చేరింది. లబ్ధిదారులందరికీ ప్రత్యేకంగా కార్డులు ఇవ్వాలని క్యాబినెట్‌ నిర్ణయం తీసుకొన్నది. గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. దాదాపు 5 గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం అనేక అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై క్యాబినెట్‌లో సమగ్రమైన చర్చ జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయంలో 15.3 శాతం వృద్ధిరేటు నమోదైనట్టు అధికారులు మంత్రివర్గానికి వివరించారు. సీఎస్‌ఎస్‌ కింద రాష్ర్టానికి రావాల్సిన నిధులు 12.9 శాతం తగ్గాయని.. అయినా ఈ వృద్ధి రేటు నమోదు చేయడం గమనార్హమని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ముఖ్యంగా కేంద్రం నిధులు విడుదల చేయడంలో ఎస్‌ఎన్‌ఏ అకౌంట్లు అనే కొత్త పద్ధతి తేవడం ద్వారా రాష్ట్రాలకిచ్చే నిధుల్లో తీవ్రమైన జాప్యం జరుగుతున్నదని అధికారులు తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను సకాలంలో ఇవ్వకపోవడంతోపాటు పరిమితుల్లో కోతలు విధించారని చెప్పారు. ఎఫ్‌ఆర్బీఎం పరిమితిలో కోత విధించకుండా ఉంటే రాష్ట్ర ఆదాయం మరింతగా పెరిగి దాదాపు 22 శాతం వృద్ధిరేటు నమోదయ్యేదన్నారు.

అటల్ పెన్షన్ యోజనలో కీలక మార్పులు.. అలాంటి వారికి ఇకపై నో పెన్షన్..

స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 21వ తేదీన తలపెట్టిన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలను రద్దు చేస్తూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకొన్నది. ఈనెల 21న పెండ్లిళ్లు, శుభకార్యాలకు చివరి ముహూర్తం కావడం వల్ల, పెద్దఎత్తున వివాహాది శుభ కార్యక్రమాలు ఉన్నందున ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక సమావేశాలను రద్దు చేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది.

రాష్ట్రంలో జీవో 58, 59 కింద పేదలకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీని వేగవంతం చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను మంత్రివర్గం ఆదేశించింది. గ్రామకంఠం స్థలాల్లో నూతన ఇండ్ల నిర్మాణానికి ప్రజలు ఎదురొంటున్న సమస్యలపై అధికారులతో ఒక కమిటీ వేసి, 15 రోజుల్లోగా నివేదిక తీసుకొని, సమస్యను శాశ్వతంగా పరిషరించాలని నిర్ణయించింది.

అటల్ పెన్షన్ యోజనలో కీలక మార్పులు.. అలాంటి వారికి ఇకపై నో పెన్షన్..

Share your comments

Subscribe Magazine