News

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో 100కు పైగా వీధి కుక్కలు మృతి !

Srikanth B
Srikanth B

తెలంగాణ లో సిద్దెపేట తిగుల్ అనే గ్రామం లో 100కు పైగా వీధి కుక్కలకు విషప్రయోగం జరిగింది. చనిపోయిన కుక్కలా యొక్క మృతదేహాలను బావిలో పడేసిన ఘటన ఆలస్యం గ వెలుగులోకి వచ్చింది . తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో 100కు పైగా వీధి కుక్కలు హత్యకు గురైనట్లు ఓ జంతు ప్రేమికుడు తెలిపారు.

బాధ్యులపై కేసులు నమోదు చేయాలని కోరుతూ గౌతమ్ కుమార్ అనే కార్యకర్త సిద్దిపేట కలెక్టర్, సిద్దిపేట పోలీస్ కమిషనర్ కు  ఫిర్యాదు చేశారు.

సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్, కార్యదర్శి ప్రొఫెషనల్ డాగ్ క్యాచర్లను నియమించి, వీధికుక్కలను ప్రాణాంతక ఇంజెక్షన్లు ఇచ్చి చంపేశారని ఆరోపించారు.

ఈ సంఘటన మార్చి 28 న జరిగినట్లు సమాచారం. హైదరాబాద్లోని ఓ స్వచ్ఛంద సంస్థను ఓ గ్రామస్థుడు అప్రమత్తం చేయడంతో సోమవారం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఆరేళ్ల పెంపుడు కుక్క మృతి గురించి తమకు సమాచారం అందడంతో ఈ సామూహిక హత్య వెలుగులోకి వచ్చిందని ఫిర్యాదుదారు తెలిపారు. కారణాలు తెలుసుకునేందుకు ఆ కార్యకర్త గ్రామానికి వెళ్లినప్పుడు పెంపుడు కుక్క కు  విషం ఇచ్చినట్లు  గుర్తించారు.

మృతదేహాలను గ్రామంలోని పాత బావిలో పడేశారు. గత మూడు నెలల్లో సుమారు 100 వీధి కుక్కలు చంపబడ్డాయని గ్రామస్థులు స్వచ్చంద సంస్థకు  తెలిపారు .

TS EAMCET 2022 :నోటిఫికేషన్ విడుదల!

Related Topics

100 Dogs Dog telangana

Share your comments

Subscribe Magazine