కోనసీమలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పంపిణీ చేశారు.
కోనసీమలో సిఎం జగన్ పర్యటించారు. శుక్రవారం ఉదయం నిర్వహించిన మత్స్యకార భరోసా బహిరంగ సభలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు.మత్స్యకార భరోసా పథకం ) కింద 1,08,755 మత్స్యకార కుటుంబాలకు రూ.109కోట్ల నిధులను విడుదలు చేశారు. చేపల వేట నిషేధ సమయంలో ఇబ్బందిపడకుండా మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
సభలో సిఎం జగన్ ప్రసంగించిన అనంతరం లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేశారు. ఈ ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద అర్హులైన 1,08,755 కుటుంబాలకు రూ.109 కోట్లు జమ చేశారు. దీంతో పాటు ఓఎన్జీసీ పైపులైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన మత్స్యకార కుటుంబాలకు రూ.108 కోట్లు జమ చేశారు.వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద గంగపుత్రులకు నాలుగేళ్లలో రూ.418.08 కోట్లు లబ్ధి కలిగింది.
ఖరీఫ్ కార్యకలాపాలకు ముందస్తు చర్యలు
నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ జూన్ 1 నుంచి గోదావరి, కృష్ణా డెల్టా, గుంటూరు ఛానల్‌కు జూన్ 10 నుంచి నీటిని విడుదల చేసి ఖరీఫ్ సీజన్‌ను ముందుగానే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
వ్యవసాయ మరియు వ్యవసాయ మార్కెటింగ్ కార్యకలాపాల అభివృద్ధికి ఆర్థిక సంస్థల నుండి ₹ 1,600 కోట్ల రుణాన్ని సమీకరించడానికి మంత్రివర్గం తన సమ్మతిని తెలిపిందని, ఇందులో వ్యవసాయ మార్కెట్‌లకు కనెక్టివిటీని మెరుగుపరచడం, ప్రాథమిక ప్రాసెసింగ్ సౌకర్యాలు, రైతు బజార్లు, ఫామ్‌గేట్ మౌలిక సదుపాయాలు మరియు మార్కెట్ యార్డులలో సౌకర్యాలను ఆధునీకరించడం జరుగుతాయి.
మరిన్ని చదవండి.
Share your comments