News

10 పరీక్షలకు విద్యార్థులు సంసిద్ధం:

KJ Staff
KJ Staff

నేటినుండి తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లో 10 వ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. విద్యార్థి దశలో పదవ తరగతి పరీక్షలు అతి ముఖ్యమైనవి. ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివి వారు కోరుకున్న లక్ష్యాలను ఛేదించడంలో పదవ తరగతి మొదటి మెట్టుగా నిలుస్తుంది.

విద్యార్థులకు, మరియు పాఠశాలలకు, ఎంతో కీలకమైన పదవ తరగతి పరీక్షలు, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని మొదలైయ్యాయి. మార్చ్ 18 నుండి మార్చ్ 30 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షలకు వెళ్లే విద్యార్థులు తమ హాల్ టికెట్ను మర్చిపోకుండా తీసుకువెళ్ళండి. పరీక్షా కేంద్రం చుట్టూ 144 సెక్షన్ అమల్లో ఉండటం మూలాన విద్యార్థుల తల్లితండ్రులు పరీక్ష కేంద్ర చుట్టు గుంపులు గుంపులుగా ఉండకూడదు అని పోలీసులు హెచ్చరికలు జారీ చేసారు. మాస్ కాపీయింగ్ అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఫ్లైయింగ్ స్క్వాడ్స్, తోపాటు, ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సిట్టింగ్ స్క్వాడ్ ని నియమించారు. పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసారు.

Share your comments

Subscribe Magazine