కునో నేషనల్ పార్క్‌కి సెప్టెంబర్ నెలలో తన పుట్టిన రోజు సందర్భంగా 8 చిరుతలను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసారు . దీని తరువాత ఆ చిరుతలు ఇక్కడి వాతావరణాన్ని తట్టుకొని గర్భము కూడా దాల్చడం తో భారత్ మరో చిరుతలు నమీబియా నుంచి తీసుకురావడానికి గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తుంది అయితే ప్రయత్నాలు ఫలించే మరో చిరుతలు నేడు ప్రత్యేక విమానంలో భారత్ లోకి తీసుకొచ్చారు .
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానంలో వీటిని తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చేరుకున్నాయి. వీటిని నేరుగా కునో నేషనల్ పార్క్‌కు చేర్చుతారు. ఈ 12 చీతాల్లో 7 మేల్, కాగా మిగతా 5 ఫిమేల్. ఇప్పటికే నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌కు వచ్చాయి. రెండో విడతలో 12 చీతాలను దిగుమతి చేసుకున్నారు. "సౌతాఫ్రికా నుంచి ప్రత్యేక విమానంలో 12 చీతాలు తీసుకొచ్చినట్లు . గ్వాలియర్ ఎయిర్‌పోర్ట్‌లో 10 గంటలకు చేరుకున్నాయి" అని అధికారులు వెల్లడించారు.
నమీబియా నుండి చిరుతలను ఎందుకు దిగుమతి చేసుకున్నారు?
హిమాలయ ప్రాంతం తప్ప, చిరుత కనిపించని ప్రదేశం భారతదేశంలో లేదు. ఆసియాటిక్ చిరుతలు ఇప్పటికీ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో కనిపిస్తాయి. దక్షిణాఫ్రికాలోని నమీబియా నుంచి చిరుతలు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ పగలు మరియు రాత్రి పొడవు భారతదేశం మరియు ఇక్కడ ఉష్ణోగ్రత ఆఫ్రికా మాదిరిగానే ఉంటుంది.
RBI కు సలహా ఇస్తే .. రూ. 40 లక్షల ప్రైజ్‌మనీ గెలిచే అవకాశం !
ఇప్పటికే దక్షిణాఫ్రికా,భారత్ మధ్య ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. సౌతాఫ్రికా, నమీబియా, బోత్స్‌వానాలో దాదాపు 7 వేల చీతాలున్నట్టు అంచనా. వీటిలో నమీబియాలోనే అత్యధికంగా చీతాలున్నాయి. భారత్‌లో పూర్తిగా ఇవి అంతరించిపోవడం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి తెప్పిస్తోంది కేంద్రం. చివరి సారిగా భారత్‌లో 1948లో ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో సల్ అడవుల్లో కనిపించింది. అందుకే వీటి సంఖ్య పెంచాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం.
Share your comments