News

RBI కు సలహా ఇస్తే .. రూ. 40 లక్షల ప్రైజ్‌మనీ గెలిచే అవకాశం !

Srikanth B
Srikanth B

 

బ్యాంకింగ్‌, డిజిటల్‌ ఫైనాన్షియల్‌ రంగంలో సమస్యల పరిష్కారానికి RBI కొత్త మార్గాన్ని ఎంచుకుంది , బ్యాంకింగ్ రంగంలో వివిధ సమస్యల పరిష్కారానికి రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా RBI హార్బింగర్‌ 2023 HARBINGER 2023 పేరుతో గ్లోబల్‌ హ్యాకథాన్‌ (Hackathon)ను నిర్వహిస్తోంది. ఈపోటీలో పోటీలో ఎవరైనా పాల్గొనవచ్చు , పోటీలో పాల్గొని సమస్యలకు పరిష్కారం చెబితే 40 లక్షలు గెలుచుకోవచ్చు .

 

సమస్యలకు పరిష్కారం కనుగొన్నవారికి మొదటి బహుమతిగా రూ. 40 లక్షలు, రెండో బహుమతిగా రూ. 20 లక్షల నగదును అందిస్తోంది. ఆర్‌బీఐ ఈ హ్యాకథాన్‌ను తొలిసారిగా 2021లో ప్రారంభించింది. రెండో విడతలో భాగంగా ఈ ఏడాది నిర్వహిస్తోంది. ఈ హ్యాకథాన్‌లో పాల్గొనే వారు నాలుగు అంశాలకు పరిష్కారాలు చూపాల్సి ఉంటుంది .


సమస్యలకు పరిష్కారం చూపవల్సిన రంగాలు :


ఆర్థిక సేవల  రంగంలో నియంత్రిత సంస్థలు ఉపయోగించే సాంకేతికతలో సరికొత్త ఆవిష్కరణలు

రిటైల్‌ లావాదేవీ ల్లో ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ మోడ్‌ ద్వారా ఇ-రూపీ  వినియోగాన్ని విస్తృతం చేసేందుకు కొత్త మార్గాలను అన్వేషించడం

బ్లాక్‌చెయిన్స్‌  ద్వారా సెకనుకు జరిగే లావాదేవీల  సంఖ్యను పెంచి, వాటిని లెక్కించేందుకు అసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయడం

పాక్‌లో ఆర్థిక సంక్షోభం.. లీటర్ పాలు రూ.210, కిలో చికెన్‌ రూ.780

హార్బింగర్‌ 2023లో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 22 నుంచి మార్చి 24లోపు తమ ఆవిష్కరణలు, సాంకేతికతలకు సంబంధించిన ప్రతిపాదనలను ఆర్‌బీఐ ప్రత్యేక వెబ్‌సైట్‌ (https://hackolosseum.apixplatform.com) ద్వారా సమర్పించాలి. 18 సంవత్సరాలు నిండి, హ్యాకింగ్‌పై అవగాహన ఉన్న వారు ఎవరైనా తమ ప్రతిపాదనలను సమర్పించవచ్చు. ఆర్‌బీఐ జ్యూరీ వీటిని పరిశీలించి విజేతలను ప్రకటిస్తారు .

పాక్‌లో ఆర్థిక సంక్షోభం.. లీటర్ పాలు రూ.210, కిలో చికెన్‌ రూ.780

Related Topics

RBI Recruitment

Share your comments

Subscribe Magazine