News

పాక్‌లో ఆర్థిక సంక్షోభం.. లీటర్ పాలు రూ.210, కిలో చికెన్‌ రూ.780

Srikanth B
Srikanth B

పాకిస్థాన్ యొక్క పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతుంది ఒకవైపు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు మరోవైపు IMF ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ నుంచి ఎలాంటి సాయం అందకపోవడం తో పాకిస్థాన్ యొక్క పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారింది రోజు రోజుకు నిత్యావసరాల ధరలు పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు .

ఆ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. పాల నుంచి.. చికెన్‌ వరకు అన్ని ధరలు చుక్కలు అంటు తున్నాయి. ప్రస్తుతం అక్కడ లీటరు లూజ్‌ పాల ధరలు రూ.190 నుంచి రూ.210కి ఎగబాకాయి. ఇక లైవ్‌ బ్రాయిలర్‌ చికెన్‌ గత రెండు రోజుల్లో కిలోపై రూ.30-40 పెరిగింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో చికెన్‌ కిలో రూ.480 రూ.500 మరికొన్ని ప్రాంతాల్లో రూ.780 వరకు పలుకుతున్నట్లు ప్రముఖ వార్తాపత్రిక డాన్‌ నివేదించింది.

కరాచీలో మొన్నటివరకు రూ. 650గా ఉన్న కిలో చికెన్‌ ధరలు ఇప్పుడు రూ.780కి చేరుకుంది. రావల్పిండి, ఇస్లామాబాద్‌ లాంటి కొన్ని నగరాల్లోనూ ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరిందని సింధ్‌ పౌల్ట్రి హోల్‌సేలర్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కమల్‌ అక్తర్‌ సిద్ధిఖీ వెల్లడించారు . చికెన్‌ ధరలు పెరగడానికి ఆర్థిక సంక్షోభంతో పాటు ఫీడ్‌ కొరత కారణంగా అనేక పౌల్ట్రి వ్యాపారాలు మూసివేయడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రోజురోజుకూ అమాంతం పెరిగిపోతున్న ఈ ధరలు చూసి చికెన్‌ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరో వైరస్‌ ముప్పు.. మార్‌ బర్గ్‌ వైరస్ వ్యాప్తిపై WHO అత్యవసర సమావేశం

 

మరోవైపు పరిస్థితులు దారుణంగా మారుతున్న IMF (ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్) పెట్టిన షరతులకు మాత్రం పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకరించడం లేదు దీనితో పరిస్థితి దారుణంగా తయారయింది , రానున్న కాలంలో మరింత దారుణంగా పాకిస్థాన్ పరిస్థితి మారనునట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .

మరో వైరస్‌ ముప్పు.. మార్‌ బర్గ్‌ వైరస్ వ్యాప్తిపై WHO అత్యవసర సమావేశం

Related Topics

pakisthan crisis

Share your comments

Subscribe Magazine