News

తెలంగాణాలో 2.18 లక్షల టన్నుల యూరియా స్టాక్​:మంత్రి నిరంజన్‌రెడ్డి

Srikanth B
Srikanth B
తెలంగాణాలో 2.18 లక్షల టన్నుల యూరియా స్టాక్​:మంత్రి నిరంజన్‌రెడ్డి
తెలంగాణాలో 2.18 లక్షల టన్నుల యూరియా స్టాక్​:మంత్రి నిరంజన్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడిందని వస్తున్న వార్తలపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలంగాణాలో యూరియా కొరత లేదని రైతులకు అవసరానికి సరిపడా యూరియా అందుబాటులో ఉందని తెలిపారు.

రాష్ట్రంలో 2.18 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ప్రైవేటు డీలర్ల వద్ద 90 వేల టన్నులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద 41 వేల టన్నులు, మార్క్ ఫెడ్ వద్ద 81 వేల టన్నులు, కంపెనీ గోడౌన్లల్లో 6 వేల టన్నుల నిల్వలు ఉన్నాయని మంత్రి తెలిపారు.

రాబోయే నాలుగు రోజులలో మరో 18 వేల టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందని వివరించారు. ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయా జిల్లాల్లో పంటలసాగుకు తగిన ఎరువుల నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని మంత్రి హెచ్చరించారు.

రుణమాఫి అందని రైతులు 1.6 లక్షలు ..

దీనిపై సూర్య పేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు సమీక్షా నిర్వహిస్తూ జిల్లాలో రైతులు అధైర్య పడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఏఈవోలు, ఏవోలు రైతులకు అందుబాటులో ఉంటూ యూరియా సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో అవసరదృష్య 1000 మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్ర మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి వ్యవసాయ మంత్రితో మాట్లాడి తెప్పించడం జరిగిందని, మరోక 1000 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానున్నాయని కలెక్టర్ తెలిపారు.

రుణమాఫి అందని రైతులు 1.6 లక్షలు ..

Related Topics

niranjan reddy

Share your comments

Subscribe Magazine