News

'హర్ ఘర్ తిరంగా' కోసం 20 కోట్ల జాతీయ జెండాలు సిద్ధం

Srikanth B
Srikanth B

దేశమంతా 75వ స్వాతంత్ర వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో ఒక్క రోజు మాత్రమే జరిగే వేడుకలు ఈ సారి రెండు, మూడు వారాలపాటు సాగనున్నాయి.

 

దీనిలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోంది. అందులోనూ ఈ నెల 13, 14, 15 తేదీల్లో వరుసగా మూడు రోజులు జాతీయ జెండా ఎగురుతుంది. దీంతో దేశవ్యాప్తంగా గతంలో ఎప్పుడూ లేనంతగా జాతీయ జెండాలకు డిమాండ్ పెరిగింది. కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 20 కోట్లకు పైగా జాతీయ జెండాలు సిద్ధమయ్యాయి. 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం గురించి ప్రధాని ప్రకటించిన తర్వాతి నుంచి ఈ జెండాలు సిద్ధమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం జెండా కోడ్‌లో మార్పులు తెస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో ప్రతి ఒక్కరూ జెండాను తమ ఇంటిపై ఎగరేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అధికారులు అంటున్నారు.

తెలంగాణలోని ములుగు జిల్లాలోని గిరిజన ప్రాంతాలను మలేరియా, డెంగ్యూ విజృంభణ


దీని ప్రకారం పగటిపూటే కాకుండా, రాత్రిపూట కూడా జాతీయ జెండాలు ఇంటిపై ఎగరేయొచ్చు. కేంద్ర ప్రచారంలో భాగంగా జెండా ఎగరవేసిన తర్వాత సెల్ఫీ తీసుకుని, సోషల్ మీడియాలో షేర్ చేయాలని సూచించింది. అలాగే సోషల్ మీడియా అకౌంట్లలో డీపీగా జాతీయ పతాకాన్ని ఉంచుకోవాలని సూచించింది.

ఉపాధి హామీ పనుల్లో అవకతవకలపై కేంద్రం విచారణ

Share your comments

Subscribe Magazine