శనివారం కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది .. ఉల్లి ఎగుమతులను నియంత్రించేలా ఉల్లిపాయలపై ఎగుమతి సుంకాన్ని 40 శాతం విధించనున్నట్లు శనివారం గెజిట్ విడుదల చేసింది . వచ్చే నెలలో ఉల్లి ధరలు పెరిగే అవకాశం ఉందని అనేక మార్కెటింగ్ ఏజెన్సిస్లు అంచ వేయడంతో రానున్న రోజులలో ఉల్లి ధరలు పెరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం .
ఎగుమతి సుంకం పెంపుతో దేశంలో ఉల్లి సరఫరా పెరిగితే, ధరలు అదుపులో ఉంటాయని ఆర్థిక శాఖ భావిస్తోంది. కేంద్రం నిర్ణయంతో సామాన్యులకు ఉల్లి ధరల నుంచి ఊరట కలగనుంది.
దేశం నుంచి ఉల్లి ఎగుమతులు ఎక్కువ కావడం ద్వారా మార్కెట్లో లభ్యత తగ్గి ధరలు పెరిగే అవకాశం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం 40 శాతం ఎగుమతి పన్ను విధించింది దీనితో ఎగుమతులు తగ్గి దేశీయ మార్కెట్లో ఉల్లి లభ్యత పెరగనుంది తద్వారా వినియోగదారులకు ఊరట లభించనుంది. ఆగస్టు చివరి నాటికి రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు భారీగా పెరుగుతాయని అంచనా వేశారు. తక్కువ సమయంలో ఉల్లిపాయ కిలో రూ. 60-70కి చేరుకునే అవకాశం ఉందని పీటీఐ గత వారం రిపోర్ట్ చేసింది.
రైతు బంధు నిధులను పక్కదారి పట్టిస్తున్న అధికారులు.! ఎక్కడంటే?
గత నెలలో కూడా దేశంలో పెరుగుతున్న ధరలను నియంత్రించడానికి బాస్మతియేతర బియ్యం ఎగుమతుల పై నిషేధం విధించింది దీనితో వివిధ దేశాలలో నివసిస్తున్న భారతీయులు ఒకసారిగా ఆయా దేశాలలో బియ్యం కొనుగోలుకు ఎగబడ్డారు.
Share your comments